మార్కెట్‌లోకి త్వరలో రానున్న కొత్త మహీంద్రా ఎస్‌యూవీలు ఇవే.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు..
మహీంద్రా & మహీంద్రా భారతీయ మార్కెట్‌లో వచ్చే ఏడాది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కొత్త SUVలను పరిచయం చేయనుంది. ఇప్పటికే అవన్నీ పరీక్షించబడ్డాయి. 2024 ప్రారంభంలో మహీంద్రా 5- డోర్ థార్ మరియు ఫేస్‌లిఫ్టెడ్ XUV 300ని భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
మహీంద్రా & మహీంద్రా ఇప్పటికే భారత్ మార్కెట్‌లో పలు మోడళ్ల విక్రయాలతో టాప్‌లో కొనసాగుతోంది. ఫ్యామిలీ అవసరాలకే కాకుండా వాణిజ్య పరంగాను మహీంద్ర వినియోగదారులకు సేవలందిస్తోంది. ఈ టాప్ కంపెనీ నుంచి కొత్త మోడల్ విడుదల అవుతుంది అంటే ఔత్సాహికుల్లో ఆసక్తి పెరుగుతుంది. త్వరలో ఈ కంపెనీ నాలుగు కొత్త ఎస్‌యూవీలు విడుదల కానున్నాయి.

1.5-డోర్ మహీంద్రా థార్ : 5- డోర్ మహీంద్రా థార్ వచ్చే ఏడాది మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఇది 3-డోర్ మోడల్ కంటే ఎక్కువ కొలతలు కలిగి ఉంటుంది. ఎక్స్‌టీరియర్ సాధారణ మోడల్‌ను పోలి ఉంటుంది. 2.2L టర్బో డీజిల్, 2.0L టర్బో పెట్రోల్ ఇంజిన్‌లు కలిగి ఉంది. 1.5L డీజిల్ ఇంజిన్ దాని RWD రూపంలో లభిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.
2. మహీంద్రా XUV 300 ఫేస్‌లిఫ్ట్: మహీంద్రా XUV 300 యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ 2024 ప్రారంభంలో భారత మార్కెట్‌లో ప్రవేశించనుంది. ఇప్పటికే స్పై షాట్‌లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. XUV 700 నుండి స్ఫూర్తిగా ఫ్రంట్ ఫాసియా రీడిజైన్ చేయబడింది. వెనుక భాగంలో కొత్త LED టెయిల్ ల్యాంప్స్, టెయిల్ గేట్ మరియు బంపర్‌ను కలిగి ఉంటుంది.

ఇతర ఫీచర్లు చూసుకుంటే కొత్తగా డిజైన్ చేయబడిన XUV 700 లో అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి. క్యాబిన్ విశాలంగా రావడంతో పాటు ఫీచర్ల జాబితా మరింత అధునాతనంగా ఉండనుంది. పనితీరు విషయానికొస్తే, 1.2L టర్బో పెట్రోల్ మరియు 1.5L టర్బో డీజిల్ ఇంజన్లు కలిగి ఉంది.
3. మహీంద్రా బొలెరో నియో ప్లస్ : బొలెరో Neo Plus దేశంలో రానున్న నెలల్లో ప్రారంభించబడుతుందని సమాచారం. 2.2L నాలుగు సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది. పవర్ మోడ్‌లో గరిష్టంగా 120 PS మరియు ఎకానమీ మోడ్‌లో 95 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లింక్ అయి వస్తుంది. ఇది ఏడు మరియు ఎనిమిది సీట్ల లేఅవుట్‌లలో అందుబాటులో ఉంటుంది.

4. మహీంద్రా BE.05 : మహీంద్రా BE.05 కి సంబంధించి పలు ఇమేజెస్ కొన్ని రోజుల క్రితం ఇంటర్నెట్‌లో విడదల అయ్యాయి. ఇది 4,370 mm పొడవు, 1,900 mm వెడల్పు మరియు 1,635 mm ఎత్తు మరియు 2,775 mm వీల్‌బేస్ పొడవుతో ఉంటుంది. ప్రొడక్షన్ వెర్షన్ వచ్చే ఏడాది చివరిలో లేదా 2025లో ప్రారంభం కానుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.



Click it and Unblock the Notifications








