Maruti Suzuki Baleno ది బెస్ట్ కారుగా బాలెనో నిలువడానికి కారణాలు ఇవే.. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి
భారత మార్కెట్‌లో మారుతి సుజుకి కార్లకు డిమాండ్ ఎక్కువ. సామాన్యులకు అందుబాటులో బడ్జెట్‌లో పలు రకాల మోడళ్లను నిత్యం వినియోగదారులకు పరిచయం చేస్తూనే ఉంది. మారుతి తన బ్రాండ్లను ప్రారంభించి ఏళ్లు గడిచినా ఇప్పటికీ మార్కెట్‌లో హవా కొనసాగుతూనే ఉంది. అందుకే గత నెల విక్రయాల్లోనూ మారుతి సుజుకి బ్రాండ్లు టాప్ 10 లో నిలిచాయి.
మారుతి సుజుకి బ్రాండ్లు ఇంతగా ప్రజాదరణ పొందడానికి కారణం ఆ కంపెనీ అందించే సర్వీస్ నెట్‌వర్క్‌తో పాటు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కార్లను తయారు చేయడమే. అంతే కాకుండా సరసమైన ధరలో సామాన్యులకు అందుబాటులో లభించడం మారుతిని నెం. 1 గా నిలిపింది. ఈ క్రమంలో మారుతి సుజుకి బాలెనో అత్యధిక అమ్మకాలతో వినియోగదారుల ఫేవరెట్‌గా మారింది.

మారుతి సుజుకి బాలెనో అమ్మకాలను చూస్తే ఈ ఏడాది మే నెలలో 18,733 యూనిట్లు. గతేడాది ఇదే నెలలో 13,970 యూనిట్లను విక్రయించింది. అంటే గతేడాదితో పోలిస్తే 34.09 శాతం వృద్ధిని సాధించింది. 4,763 యూనిట్లు లాభపడి, ఈ జాబితాలో బాలెనో 13.34 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ కారు భారత్‌లో ఇంతలా ప్రాచుర్యం పొందడానికి 5 కారణాలు ఉన్నాయి.
డిజైన్ : బాలెనో మోడల్‌ను మారుతి సుజుకి అద్భుతమైన రీతిలో డిజైన్ చేసింది. మారుతీ సుజుకి బాలెనో అలా హైవే మీద వెళ్తుంటే, ఎవరైనా ఆ కారువైపు అలా చూస్తూ ఉండిపోవడం ఖాయం. ఈ కారు ఏరోడైనమిక్, మంచి బాడీ లైన్‌లతో కూడిన సొగసైన డిజైన్, LED DRL, బాహ్య డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 2022 తర్వాత కారుకు మరిన్ని డిజైన్లను జోడించడంతో ప్రీమియం టచ్ లుక్‌ను అందుకుంది.

ఫీచర్లు : ఈ కారు భారతీయుల ఫేవరెట్ కారు కావడానికి మరో కారణం బాలెనో ఫీచర్లు. ఇటీవల బాలెనోలో 9 - అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, హెడ్ - అప్ డిస్‌ప్లే వంటి కొత్త ఫీచర్లను మారుతి సుజుకి జోడించింది. దీంతో ఈ కారుకు అదనపు హంగులు జతచేయబడ్డాయి.
ఇంటీరియర్ : మారుతి సుజుకి బాలెనో యొక్క ఇంటీరియర్‌ను పరిశీలిస్తే ఈ కారులో 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. సౌలభ్యంగా ఉండే కుషన్డ్ సీట్లు, వెనుక ప్రయాణీకులకు తగినంత లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ మరియు ప్రీమియం ఇంటీరియర్ డిజైన్ ఈ కారుకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

మంచి మైలేజ్ : ఇదే సెగ్మెంట్‌లో ఇతర కార్ల కంటే మారుతి సుజుకి బాలెనో ఒక అడుగు ముందుకేసింది. నివేదికల ప్రకారం బాలెనో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 22 కి.మీల మైలేజీని, AMT ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 23 కి.మీల మైలేజీని అందిస్తుంది. ఈ కారుకు CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
సరసమైన ధర : మారుతి సుజుకి బాలెనో ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ కారు. ఈ కారు అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా దాని విభాగంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. ఈ కారు ఎక్స్ - షోరూమ్ ధర రూ. 6.61 లక్షల నుంచి రూ. 9.88 లక్షల మధ్య అందుబాటులో ఉంది.



Click it and Unblock the Notifications








