ఫుల్‌ ట్యాంక్‌పై 1000 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే టాప్‌ 5 కార్లు ఇవే..

కార్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. పెరుగుతున్న అవసరాలు, ఫ్యామిలీతో వెళ్లేందుకు సౌకర్యంగా ఉండేలా తమకు నచ్చిన కారును కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఆటో మేకర్లు సైతం అధునాతన ఫీచర్లతో కార్లను ప్రవేశపెడుతున్నాయి. అయితే కారు కొనే ముందు ముఖ్యంగా పరిశీలించే విషయం మైలేజ్‌(5 cars with high mileage).

లక్షల ఖర్చు పెట్టి కారు కొనుగోలు చేసేముందు ముఖ్యంగా కొన్ని పరిశీలిస్తారు. వాటిలో మైలేజ్‌, సేఫ్టీ ఫీచర్ల గురించి తెలుసుకుంటారు. తమకు నచ్చిన కారు కొన్న తర్వాత లాంగ్‌ జర్నీస్‌లో ఎక్కువగా ఫుల్‌ ట్యాంక్ చేయిస్తారు. అయితే ఫుల్‌ ట్యాంక్‌ ఎన్ని కి.మీలు ఇస్తుందో కూడా తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ఫుల్‌ ట్యాంక్‌తో దాదాపు 1000 కి.మీ ప్రయాణించే ఐదు కార్ల వివరాలను మీకోసం అందిస్తున్నాం.

Toyota-Urban-Cruiser-Hyryder

టయోటా హైరైడర్‌(Toyota Hyryder): టయోటా బ్రాండ్‌ నుంచి ప్రముఖ మోడల్‌ హైరైడర్‌ హైబ్రిడ్‌ 27.93 kmpl మైలేజ్‌ ఇస్తుంది. ఈ కారు 45 లీటర్‌ ఫ్యూయెల్‌ ట్యాంక్‌తో వస్తుంది. అంటే ఈ గణాంకాల ప్రకారం చూసుకుంటే ఈ SUV ఫుల్‌ ట్యాంక్‌ పెట్రోల్‌పై ఏకంగా 1,257 కి.మీ ప్రయాణించవచ్చు.

మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా(Maruti Suzuki Grand Vitara): మారుతి సుజుకి బ్రాండ్‌ నుంచి మంచి విక్రయాలు నమోదు చేస్తున్న మోడల్‌ గ్రాండ్‌ విటారా. ఈ కారు కూడా 27.90 kmpl మైలేజ్‌ ఇస్తుంది. టయోటా హైరిడర్‌ మాదిరిగానే 45 లీటర్‌ ఫుల్‌ ట్యాంక్‌ను కలిగి ఉంటూ.. మొత్తంగా 1,257 కి.మీ ప్రయాణించవచ్చు.

Maruti-Suzuki-Invicto

మారుతి సుజుకి ఇన్విక్టో(Maruti Suzuki Invicto): టయోటా ఇన్నోవా- హైక్రాస్‌ ఆధారంగా దేశీయ మార్కెట్లోకి కొత్తగా విడుదలైన SUV మారుతి సుజుకి ఇన్విక్టో.. 2.0 లీటర్‌ పెట్రోల్‌ హైబ్రిడ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. ARAI గణాంకాల ప్రకారం ఇన్విక్టో లీటర్‌కు 23.24 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. 52 లీటర్‌ ఫ్యూయెల్‌ ట్యాంక్‌ను కలిగి ఉంది. మొత్తంగా ఫుల్‌ట్యాంక్‌తో 1,208 కి.మీ ఇస్తుంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్‌(Toyota Innova Hycross): లాంగ్‌ వీల్స్‌, కొంచెం ఎక్కువ బరువుతో మార్కెట్లో మంచి దూకుడు మీద ఉన్న కారు టయోటా ఇన్నోవా హైక్రాస్‌. అయితే ఇది ఇన్విక్టో కంటే కొంచెం తక్కువ మైలేజ్ ఇస్తుంది. హైక్రాస్‌ లీటర్‌కు 21.1 కి.మీ క్లెయిమ్‌ చేసిన మైలేజ్‌ ఇస్తుంది. ఈ ప్రకారం ఫుల్‌ ఫ్యూయెల్‌ ట్యాంక్‌పై 1,097 కి.మీ ప్రయాణించవచ్చు.

Honda-City-e:HEV

హోండా సిటీ e:HEV(Honda City e:HEV): హోండా నుంచి ప్రముఖ కారు మోడల్‌ హోండా సిటీ e:HEV హైబ్రిడ్‌ కారు 27.13 kmpl మైలేజ్‌ని ఇస్తుంది. ఈ కారు మొత్తంగా 40 లీటర్‌ ఫ్యూయెల్‌ ట్యాంక్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే ఫుల్‌ ట్యాంక్‌ పెట్రోల్‌పై 1,085 కి.మీ నడుస్తుంది.

Top-5-Cars-Give-1000-KM-On-Full-Tank

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, October 12, 2023, 17:22 [IST]
English summary
Here is about five cars that can give 1000 km traveling in one full tank
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+