Honda కార్లపై డిస్కౌంట్.. ఏయే మోడళ్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుందంటే?

కార్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి హోండా గుడ్ న్యూస్‌ చెప్పింది. హోండా కొన్ని మోడళ్లపై డిస్కాంట్‌ ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. సెడాన్లు, సిటీ, అమేజ్‌ కార్లను ఈ ఆఫర్‌లో కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. వీటీపై సుమారు రూ. 17,000 వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌ మే నెల 31 వరకు ఉందని తెలిపింది.

హోండా అమేజ్‌: ఈ నెలలో హోండా అమేజ్‌ కారును సుమారు రూ. 17,000 తగ్గింపుతో పొందవచ్చని తెలిపింది. అందులో క్యాష్‌ డిస్కౌంట్ రూ.10,000, లాయల్టీ బోనస్‌ కింద మరో రూ.4000 తగ్గింపు, మరియు కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ.3000 తగ్గింపు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ కారు సుమారు 6.99 లక్షల నుంచి 9.60 లక్షల వరకు ధర (ఎక్స్‌షోరూం, ఢిల్లీ) ఉంటుంది.

Honda cars

హోండా అమేజ్‌ 4- సిలిండర్‌తో 1199 cc పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ఆటోమేటిక్‌ మరియు మాన్యువల్ ట్రాన్సిమిషన్‌లో అందుబాటులో ఉంది. వేరియంట్‌ మరియు ఇంధనం అనుగుణంగా అమేజ్‌ 18.3 నుంచి 18.6 kmpl మైలేజ్‌ను ఇస్తుంది. ఈ కారులో 5 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

హోండా అమేజ్‌ 6000 rpm వద్ద గరిష్టంగా 88.50bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే 4800 rpm వద్ద గరిష్టంగా 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 35 లీటర్ల ఇంధన ట్యాంక్‌ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఫ్రంట్‌ యాక్సిల్‌ డిస్క్‌, రేర్‌ యాక్సిల్‌ డ్రమ్‌ బ్రేకులను కలిగి ఉంటుంది.

Honda Amage

హోండా అమేజ్‌ పవర్‌ స్టీరింగ్, యాంటీ లాక్‌ బ్రేకింగ్ సిస్టమ్‌, ఆటోమేటిక్‌ క్లైమెట్ కంట్రోల్‌, డ్రైవర్‌ ఎయిర్‌బ్యాగ్‌, ప్రయాణికుల ఎయిర్‌బ్యాగ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. మరియు అల్లాయ్‌ వీల్‌తో వస్తుంది. మరియు 420 లీటర్ల బూట్‌స్పేస్‌ను కలిగి ఉంటుంది.

5th జనరేషన్‌ హోండా సిటీ : 5th జనరేషన్‌ హోండా సిటీ కార్లపై సుమారు రూ.15000 వరకు డిస్కౌంట్లను పొందవచ్చని సంస్థ తెలిపింది. ఎక్స్చేంజ్‌ బోనస్‌ కింద సుమారు రూ.6000 (ఈ ఆఫర్‌ కేవలం ప్రస్తుతం హోండా కార్లు కలిగి ఉన్న వినియోగదారులకు మాత్రమే)తగ్గనుంది. లాయల్డీ బోనస్‌ కింద రూ.4000 తగ్గనుంది. కార్పొరేట్‌ బోనస్‌ కింద రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ప్రస్తుతం భారత్‌లో 5th జనరేషన్‌ హోండా సిటీ కార్ల ధరలు రూ.11.49 లక్షల నుంచి రూ.15.97 లక్షలు వరకు (ఎక్స్‌షోరూం, ఢిల్లీ) ఉంటుంది.

Honda City

5th జనరేషన్‌ హోండా సిటీ ప్రధానంగా డీజిల్‌, పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. డీజిల్‌ ఇంజిన్‌, పెట్రోల్‌ ఇంజిన్‌ 1498 cc సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆటోమేటిక్‌, మాన్యువల్‌ ట్రాన్సిమిషన్‌ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వేరియంట్‌, ఇంధనం బట్టి ఈ కార్లు 18.3 నుంచి 24.1 kmpl మైలేజ్‌ని ఇస్తాయి.

ఈ కార్లు ప్రధానంగా 6600 rpm వద్ద గరిష్టంగా 119.35 bhp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. మరియు 4300 rpm వద్ద గరిష్టంగా 145Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. మరియు ఈ కార్లలో 506 లీటర్ల బూట్‌స్పేస్‌ ఉంటుంది. ఇంధన ట్యాంక్‌ సామర్థ్యం 40 లీటర్లు ఉంటుంది. ఈ కార్లలో పవర్‌ స్టీరింగ్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, డ్రైవర్‌, ప్రయాణికుల ఎయిర్‌బ్యాక్‌ వ్యవస్థ. ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 17, 2023, 13:10 [IST]
English summary
Honda cars india announces discounts on its amaze city models upto may 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+