Offer: కార్లపై రూ.1 లక్ష 30 వేల డిస్కౌంట్ అందిస్తున్న హోండాసిటీ.. మార్చి వరకే ఆఫర్
జపాన్ కి చెందిన ప్రముఖ వాహన తయారీదారు సంస్థ 'హోండా' భారత్ లో నమ్మదగిన కార్ల కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. తాజాగా ఆ కంపెనీ కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై ఆఫర్లను అందిస్తోంది. రూ. 17,000 నుంచి రూ.1.3 లక్షల వరకు డిస్కౌంట్ ను ఇస్తుంది. వీటికి సంబంధించిన డిస్కౌంట్ వివరాలు మీకోసం..
ఆ సంస్థ నుంచి వచ్చిన హోండా అమేజ్ కాంప్యాక్ట్ సెడాన్ పై భారీ ఆఫర్ ను కంపెనీ అందిస్తోంది. మొత్తం రూ.26,000 డిస్కౌంట్ ను హోండా ఇస్తుంది. అందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, అలాగే రూ.6,000 కార్పోరేట్ తగ్గింపుగా ఉండనుంది. ఈ కారు ధరలురూ.6.89 లక్షలతో ప్రారంభమై రూ.9.48 లక్షల (ఎక్స్ షో రూం)గా ఉంది.

అదిరే ఫీచర్లతో..
ఈ హోండా అమేజ్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. 90 PS వద్ద 110 Nm గరిష్ట పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ లేదా CVT ట్రాన్స్మిషన్ ఎంపికను కలిగి ఉంది. E, S, VX అనే మూడు వెర్షన్ లలో ఈ కారు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు 18.3 నుంచి 18.6 kmpl మధ్య మైలేజ్ అందిస్తుంది.
ఈ సెడాన్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పర్ల్ సహా ఐదు రంగుల ఎంపికలో లభిస్తుంది. అదనంగా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆప్ల్ కార్‌ప్లే, ఆటో ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ ఉన్నాయి. భద్రత పరంగా ద్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, రేర్ పార్కింగ్ సెన్సార్లు అలానే రేర్ వ్యూ కెమెరాలు ఉన్నాయి.

WR-Vపై రూ.70,000 వరకు డిస్కౌంట్..
దేశ వ్యాప్తంగా మారిన నూతన పర్యావరణ అనుమతులు కచ్చితం చేయడంతో హోండా కంపెనీ WR-V ఉత్పత్తిని నిలిపివేసింది. పాత స్టాక్ ఖాళీ చేయడానికి రూ.70,000 భారీ తగ్గింపును సంస్థ కల్పిస్తోంది. ఈ ఆఫర్ కేవలం 2022 మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంద. 2023 మోడల్‌పై ఎటువంటి తగ్గింపు ఇవ్వలేదు. ఈ హోండా WR-V సెడాన్ రూ.9.11 లక్షల నుంచి రూ.12.31 లక్షల ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఈ కారు, SV, VX అనే రెండు వెర్షన్ లో అందుబాటులో ఉంది.. దీని ఇంజన్ సామర్థ్యం గురించి మాట్లాడితే 1.2 లీటర్ ఇంజిన్ 90 PS వద్ద 110 Nm పీక్ టాక్స్ ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ వెర్షన్ 100 bhp వద్ద 200 Nm గరిష్ట టార్క్ ని అందిస్తుంది. 5 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ ఆప్షన్ లో ఈ కారు వస్తుంది. ఈ కారు 16.5- 23.7 kmpl మైలేజ్ అందిస్తుంది.
హోండా WR-V ఫీచర్లను చూస్తే, ఇది 7ఇంచిన టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆప్ల్ కార్‌ప్లే, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రూస్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ మరియు ఆకర్షణీయమైన సన్‌రూఫ్‌లు. భద్రత కోసం డ్యూయల్ ఎయిర్ బాగ్స్, ABS, EBD మరియు రేర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
రూ. 1.3 లక్షల వరకు ఆఫర్..
Honda City 5th Gen ప్రి ఫేస్‌లిఫ్ట్, 5th Gen ఫేస్‌లిఫ్ట్ కార్లపై కూడా భారీ ఆఫర్ ను ప్రకటించింది. 2022 మోడల్ ప్రి ఫేస్ లిఫ్ట్ పై ఏకంగా 1.3 లక్షల రాయితీని సంస్థ కల్పిస్తోంది. దగ్గర్లోనీ డీలర్ షిప్ లలో అందుబాటులో ఉన్న కార్లకు ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. వీటిని త్వరిగతన సేల్ చేసేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
హోండా ఫేస్ లిఫ్ట్ పై భారీ కూడా డిస్కౌంట్ అందిస్తోంది. అందులో రూ.5,000 కస్టమర్ లాయల్టీ బోనస్, 7,000 INR ఎక్స్చేంజ్ బోనస్ అలానే రూ.5,000 కార్పొరేట్ సేవింగ్స్‌తో సహా మొత్తం రూ.17,000 INR ఆఫర్‌లను అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ ఆఫర్లను పొందేందుకు వెంటనే దగ్గర్లోని షోరూంకి వెళ్లి డిస్కౌంట్ ని పొందండి.


Click it and Unblock the Notifications








