ఒకేరోజు 100 Honda Elevate SUV కార్ల డెలివరీ.. ఏంటీ కారు ప్రత్యేకత..!

హోండా ఇండియా తన మిడ్‌ సైజ్‌ SUV ఎలివేట్‌ డెలివరీలను ప్రారంభించింది. ఇటీవలే తన ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా హోండా ఎలివేట్‌ను లాంచ్‌ చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 100 కార్లను ఒకేరోజు డెలివరీ చేసింది. Honda Elevate ధర రూ.11 లక్షలు నుంచి రూ.16 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. పండుగ సీజన్‌ను అనుకూలంగా మార్చుకోవాలని, విక్రయాలను పెంచుకోవాలని భావిస్తోంది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో హోండా ఎలివేట్‌ SUV మెగా డెలివరీ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఎస్‌యూవీ SV, V, VX, ZX వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎలివేట్‌.. కియా సెల్టోస్‌, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్‌, వ్యోక్స్‌వ్యాగన్‌ టైగన్‌, స్కోడా కుషాక్‌లకు పోటీ ఇవ్వనుంది.

Honda delivered 100 units of Elevate SUV

హోండా ఎలివేట్‌ 1.5 లీటర్‌ i-VTEC DOHE పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 6600 rpm వద్ద 119.35bhp, 4300 rpm వద్ద 145Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్సిమిషన్‌ లేదా 7-స్పీడ్‌ CVT ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

హోండా ఎలివేట్‌ మాన్యువల్ ట్రాన్సిమిషన్‌ గేర్‌బాక్స్ ఇంజిన్‌ 15.31 kmpl మైలేజీని ఇస్తుంది. అదే CVT ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్‌ వేరియంట్‌ 16.92 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ కారు 4392mm పొడవు, 1790mm వెడల్పు, 1650mm ఎత్తు, 2650mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ కారు 220mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌, 458 లీటర్ల బూట్‌స్పేస్‌తో వస్తుంది.

Honda delivered 100 units of Elevate SUV

హోండా ఎలివేట్‌ మిడ్‌ సైజ్‌ SUV బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ డిజైన్‌ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్‌ను కలిగి ఉంటుంది. LED హెడ్‌లైట్లు గ్రిల్‌కు ఇరువైపులా ఉంటాయి. ఇవి క్రోమ్ బార్‌ ద్వారా కనెక్ట్ చేయబడతాయి. ఈ కారు 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. మొత్తంగా ఈ కారు క్లాసీ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది.

హోండా ఎలివేట్‌ కారు వెనుకవైపు పెద్ద విండ్‌షీల్డ్‌, టెయిల్‌ లైట్లను పొందుతుంది. ఇది ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. లోపలి భాగం కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ ప్లేను సపోర్టు చేసే 10.25 అంగుళాల HD ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, 8 స్పీకర్‌ సౌండ్‌ సిస్టమ్‌ను కనెక్ట్ చేయబడుతుంది.

Honda delivered 100 units of Elevate SUV

దీంతో పాటు ఎలివేట్‌ కారు 7 అంగుళాల డిజిటల్‌ డిస్‌ప్లే, సింగిల్‌ పేన్‌ సన్‌రూఫ్‌, ఆకట్టుకొనే సీట్లు, హోండా కనెక్ట్‌, వైర్‌లైస్‌ ఫోన్‌ ఛార్జర్‌, రిమోట్‌ ఇంజిన్‌, మల్టీ యాంగిల్‌ కెమెరా, ఆటో వైపర్లు వంటి కీలక ఫీచర్లను కలిగి ఉంది.

భద్రత పరంగా హోండా ఎలివేట్‌ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెహికల్‌ స్టెబిలిటీ అసిస్ట్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్, లెవల్‌ 2 ADAS ( అడ్వాన్సడ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ ) సూట్‌, కొలిజన్ మిటిగేషన్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, లేన్ డిపార్చర్‌ వార్నింగ్‌ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Honda delivered 100 units of Elevate SUV

దీంతోపాటు ఆడాప్టివ్‌ క్రూయిజ్ కంట్రోల్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, ఆటోమేటిక్‌ హై బీమ్ అసిస్ట్‌, రోడ్‌ డిపార్చర్‌ వార్నింగ్ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. మిడ్‌ సైడ్‌ SUV సెగ్మెంట్‌లో MG Aster, కియో సెల్టోస్‌ మాత్రమే ADAS వ్యవస్థను కలిగి ఉన్నాయి.

వేరియంట్ల వారీగా SV (MT) ధర రూ.10.99 లక్షలుగా ఉంది. V (MT) ధర రూ.12,10,900, VX (MT) రూ.13.49,900, ZX ధర రూ.14,89,900గా ఉంటుంది. అయితే SV వేరియంట్‌ CVT గేర్‌బాక్స్‌లో అందుబాటులో లేదు. V (CVT) ధర రూ.13,20,900, VX (CVT) రూ.14,59,900, ZX ధర రూ.15,99,900గా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, September 11, 2023, 17:13 [IST]
English summary
Honda delivered 100 units of elevate suv in hyderabad in one day
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+