ఒక్కరోజులోనే 200 Honda Elevate SUV కార్ల డెలివరీలు.. ఇవే ప్రత్యేకతలు.!!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా తాజాగా ఓ సరికొత్త మైలురాయిని సాధించింది. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన మిడ్ సైజ్ ఎస్‌యూవీ మోడల్ ఎలివేట్ కార్లను డెలివరీ చేసింది. ఒక్క రోజే 200 మంది కస్టమర్లకు ఎలివేట్ కార్లను అందించడం విశేషం.
హోండా కార్స్ ఇండియా తన తాజా మోడల్ Honda Elevate SUV అమ్మకాల్లో రికార్డు సృష్టించింది.
చెన్నైలో నిర్వహించిన ఓ మెగా ఈవెంట్‌లో ఒక్క రోజులోనే 200 హోండా ఎలివేట్ మిడ్ సైజ్ SUV యూనిట్లను పంపిణీ చేసింది. OEM ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన కస్టమర్లకు కొత్త Honda Elevate డెలివరీలపై దృష్టి సారిస్తోంది.

కాగా హోండా Elevate SUV మోడల్ ధర(ఎక్స్ షోరూమ్ -ఢిల్లీ) దేశీయ మార్కెట్లో రూ. 10,99,900 నుంచి రూ. 15,99,900 ధరలో అందుబాటులో ఉంది. తమ కస్టమర్లకు ఎలివేట్ ఎస్‌యూవీ కార్లు డెలివరీ చేయడంపై హోండా కార్స్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. ఎలివేట్ రాకతో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హోండా కార్స్ శక్తిమంతంగా దూసుకెళ్తోంది.
ఇక హోండా ఎలివేట్ ఎస్‌యూవీ ఇంజిన్ పనితీరును పరిశీలిస్తే ఇంది సింగిల్- ఇంజిన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. కానీ రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుంది. 1.5 లీటర్ DOHC i-VTEC పెట్రోల్ యూనిట్ గరిష్ఠంగా 119 బీహెచ్‌పీ వద్ద 145.1 NM గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 - స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, అధునాతన CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Honda Elevate SUV మాన్యువల్ వేరియంట్లలో లీటర్‌కు 15.31 మైలేజ్‌ను ఇస్తుంది. CVT వెర్షన్లు లీటర్‌కు 16.92 కి.మీ మైలేజ్ ఇస్తుందని హోండా తెలిపింది. ఇంకా హోండా ఎలివేట్ ఎస్‌యూవీ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. SV, V, VX, ZX వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.
హోండా ఎలివేట్ డిజైన్‌ను పరిశీలిస్తే ఇది ఆకర్షణీయమైన బాక్సీ ఫ్రంట్ ప్రొఫైల్, పెద్ద బ్లాక్ రేడియేటర్ గ్రిల్, LED హెడ్‌లైట్లు, ఇంటిగ్రేటెడ్ LED DRLలు, LED టైల్‌లైట్లు, బ్లాక్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ మరియు పెద్ద వీల్ ఆర్చెస్ హోసింగ్ స్పోర్టీ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.
ఇందులో బ్లాక్ క్లాడింగ్‌లతో పాటు సైడ్స్ క్యారెక్టర్ లైన్‌లు మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. హోండా ఎలివేట్(Honda Elevate SUV) ఎస్‌యూవీ మోడల్ భారీ 220 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇదే అత్యధికం కావడం విశేషం.
హోండా ఎలివేట్ SUV లోపలి వైపున విశాలంగా ఉంటుంది.. ఇంకా సరళంగా ఉంటుంది. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టవిటీకి అనుకూలంగా ఉండేలా 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. 7 అంగుళాల HD కలర్ TFT డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ వంటి ఇతర ఫీచర్లను కలిగి ఉంది.
హోండా ఎలివేట్‌లోని సింగిల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో ప్లాటినం వైట్ పెర్ల్, లూనార్ సిల్వర్ మెటాలిక్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్ ఇంకా ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్ ఉన్నాయి. టాప్ - ఎండ్ వేరియంట్లలో మూడు డ్యూయల్ టోన్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








