Honda Elevate కారు విడుదల.. ADAS సహా ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు.. !
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా తన ఎలివేట్ కారును భారత మార్కెట్ విడుదల చేసింది. ఈ కారు ధర రూ.10,99,900గా వెల్లడించింది. ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా కార్లకు గట్టి పోటీ ఇస్తుందని సంస్థ భావిస్తోంది. డిజైన్, ఇంటీరియర్ పరంగా కారు భాగా ఆకట్టుకుంటుంది.
హోండా ఎలివేట్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. SV, V, VX, ZX వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వేరియంట్ల వారీగా SV (MT) ధర రూ.10.99 లక్షలుగా ఉంది. V (MT) ధర రూ.12,10,900, VX (MT) రూ.13.49,900, ZX (MT)ధర రూ.14,89,900గా ఉంటుంది. అయితే SV వేరియంట్ CVT గేర్‌బాక్స్‌లో అందుబాటులో లేదు. V (CVT) ధర రూ.13,20,900, VX (CVT) రూ.14,59,900, ZX ధర రూ.15,99,900గా ఉంది.

హోండా ఎలివేట్ 1.5 లీటర్ i-VTEC DOHE పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 6600 rpm వద్ద 119.35bhp, 4300rpm వద్ద 145Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ లేదా 7-స్టెప్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
హోండా ఎలివేట్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ గేర్‌బాక్స్ ఇంజిన్ 15.31kmpl మైలేజీని ఇస్తుంది. అదే CVT ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వేరియంట్ 16.92kmpl మైలేజీని ఇస్తుంది. ఈ కారు 4392mm పొడవు, 1790mm వెడల్పు, 1650mm ఎత్తు, 2650mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ కారు 220mm గ్రౌండ్ క్లియరెన్స్, 458 లీటర్ల బూట్‌స్పేస్‌తో వస్తుంది.

హోండా ఎలివేట్ మిడ్ సైజ్ SUV బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ముందుభాగంలో పెద్ద గ్రిల్‌ను కలిగి ఉంటుంది. LED హెడ్‌లైట్లు గ్రిల్‌కు ఇరువైపులా ఉంటాయి. ఇవి క్రోమ్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడతాయి. ఈ కారు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.
మొత్తంగా హోండా ఎలివేట్ క్లాసీ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ కారు వెనుకవైపు పెద్ద విండ్‌షీల్డ్, టెయిల్ లైట్లను పొందుతుంది. ఇది ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. లోపలి భాగం కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేను సపోర్టు చేసే 10.25 అంగుళాల HD ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కనెక్ట్ చేయబడుతుంది.

దీంతోపాటు 7 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, సింగిల్ పేన్ సన్‌రూఫ్, ఆకట్టుకొనే సీట్లు, హోండా కనెక్ట్, వైర్‌లైస్ ఫోన్ ఛార్జర్, రిమోట్ ఇంజిన్, మల్టీ యాంగిల్ కెమెరా, ఆటో వైపర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా హోండా ఎలివేట్ కీలక ఫీచర్లను కలిగి ఉన్నాయి.
6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, లెవల్ 2 ADAS (అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సూట్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ హై బీమ్ అసిస్ట్, రోడ్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మిడ్ సైడ్ SUV సెగ్మెంట్‌లో MG Aster, కియో సెల్టోస్ మాత్రమే ADAS వ్యవస్థను కలిగి ఉన్నాయి. భవిష్యత్‌లో హోండా ఎలివేట్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తామని సంస్థ వెల్లడించింది. ఈ కారు డెలివరీలు ప్రారంభం అయ్యాక.. మరింత మందిని ఆకట్టుకొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








