Honda Elevate SUV ఈ ఫొటోలు చూశారా.. మీరు ఇట్టే కారు కొనేస్తారు!!

దాదాపు కొన్ని నెలల నిరీక్షణ తర్వాత, ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా ఎట్టకేలకు భారత్‌లో మిడ్ సైజ్ SUV ఎలివేట్‌ను ఆవిష్కరించింది. ఈ SUV డిజైన్, ఫీచర్ల వివరాలు, ఇతర విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా.. అయితే హోండా ఎలివేట్ యొక్క పూర్తి చిత్ర గ్యాలరీ మీకోసం..

Honda Elevate SUV

హోండా యొక్క మిడ్‌ సెజ్‌ SUV ఎలివేట్‌ మోడల్.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి సెగ్మెంట్ ఛాంపియన్‌లతో పాటు మిడ్ సైజ్ సెగ్మెంట్‌లోని ఇతర SUVలతో నేరుగా పోటీపడుతోంది.

Honda Elevate SUV

హోండా ఎలివేట్ ముందు భాగం చతురస్రాకారంగా నిటారుగా ఉంటుంది. క్లాసీ లుక్‌తో పాటు ముందు భాగంలో క్రోమ్ స్ట్రిప్‌తో కూడిన భారీ దీర్ఘచతురస్రాకార గ్రిల్‌ ఉంటుంది. సెంటర్‌ అండ్‌ మిడిల్‌లో వరుసగా పెద్ద హోండా మోనికర్ ఉన్నాయి. ఇది రెండు ఫాగ్ ల్యాంప్‌లతో పాటు ఫ్రంట్ బంపర్ దిగువన సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ అమర్చబడి ఉంది. బంపర్ దిగువ భాగం మట్టె బ్లాక్ క్లాడింగ్‌తో కప్పి ఉంటుంది.

Honda Elevate SUV

ఎలివేట్ వెనుకవైపు కూడా సమానంగా బోల్డ్‌గా ఉంటుంది. SUV వెనుక చంకీ బంపర్‌తో LED టెయిల్‌ల్యాంప్‌ల సెట్‌ను కలిగి ఉంది. బంపర్ దిగువ భాగంలో సిల్వర్‌ కోటింగ్‌తో ఉంది. వెనుకవైపు డిజైన్ చాలా స్పష్టంగా హుందాగా ఉంటుంది. వైపర్ మరియు వాషర్‌తో పాటు చిన్న స్పాయిలర్‌ను కలిగి ఉంది.

Honda Elevate SUV

ముందుగా చెప్పినట్లుగా ఫ్రంట్‌ భాగంలో ఎలివేట్ ట్విన్ బీమ్ సెటప్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లతో పాటు పైన మందపాటి LED DRL హోండా మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ ఎలివేట్‌ ప్రత్యేకత. అదేవిధంగా వెనుక భాగంలో ఎలివేట్ బూమరాంగ్ స్టైల్ LED టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఇక్కడ బ్రేక్ లైట్లు మాత్రమే LED అని గమనించాలి. రివర్స్ లైట్ మరియు సూచికలు ఇప్పటికీ హాలోజన్ సెటప్‌ను కలిగి ఉన్నాయి.

Honda Elevate SUV

ఇక ఇంటిరీయర్‌ విషయానికొస్తే ఎలివేట్ ట్యాన్ మరియు బ్లాక్ థీమ్‌తో ప్రీమియం లుకింగ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ను కలిగి ఉంది. ఫంక్షనల్‌ డ్యాష్‌బోర్డు డిజైన్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌తో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉండటంతో ఈ ఇంటీరియర్ హైలైట్ చేయబడింది. డ్యాష్‌బోర్డ్ సాఫ్ట్ టచ్ లెదర్‌తో తయారుచేయగా డ్యాష్‌బోర్డ్ లేయర్‌ల మధ్య వుడెన్‌ వర్క్‌ క్లాసీ లుక్‌తో కనిపిస్తుంది.

Honda Elevate SUV

హోండా ఎలివేట్ యొక్క 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఈ సిస్టమ్ Android Auto మరియు Apple Carplay కనెక్టివిటీతో వస్తుంది. హోండా ఎలివేట్ టాన్ లెదర్ సీట్ కవర్‌లతో సౌకర్యవంతమైన విశాలమైన ఫ్రంట్‌ సీట్లను కలిగి ఉంది. వెనుక సీట్లు సమానంగా సౌకర్యవంతంగా ఉండటంతో పాటు లెదర్‌తో వీటిని తయారుచేశారు.

Honda Elevate SUV

హోండా ఎలివేట్‌లో హోండా లేన్‌వాచ్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది ఎడమ ఇండికేటర్‌ని ఉపయోగించినప్పుడు యాక్టివేట్ అవుతుంది. లెఫ్ట్ వింగ్ మిర్రర్ వద్ద ఉన్న కెమెరా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో రాబోయే ట్రాఫిక్ వీక్షణను ప్రొజెక్ట్ చేస్తుంది. దీని ద్వారా బ్లైండ్‌ స్పాట్‌ల ద్వారా కలిగే ప్రమాదాలను నివారించవచ్చు.

Honda Elevate SUV

ఈ హోండా ఎలివేట్ కారులో వైర్‌లెస్ ఛార్జర్‌ను అమర్చారు. మనం ప్రయాణిస్తున్నప్పుడు, ఈ కారులో ఛార్జర్ ప్రాంతంలో ఫోన్‌ను ఉంచితే, అది ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంది. చేతిలో ఛార్జర్ వైర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇందు కోసం మీరు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే ఫోన్ కలిగి ఉండాలి.

Honda Elevate SUV

ఈ కారులో 458 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఇది ఎక్కువ లగేజీని తీసుకెళ్లగలదు. ఇందులో 2 పెద్ద సూట్‌కేసులు మరియు కొన్ని చిన్న లగేజీలను సౌకర్యవంతంగా ఉంచుకోవచ్చని కంపెనీ విడుదల చేసిన ఫోటోను బట్టి మనకు అర్థమవుతుంది.

Honda Elevate SUV

More from DriveSpark

Article Published On: Wednesday, June 7, 2023, 19:25 [IST]
English summary
Honda elevate mid size suv features explained with photo gallery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+