Honda Elevate రివ్యూ వీడియో.. ADAS, ప్రోగ్రసివ్ క్యాబిన్ సహా..!
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUV సిగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న హోండా సంస్థ ఎలివేట్‌ను లాంచ్ చేసింది. ఈ కారు డిజైన్ సహా అనేక ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ADAS ఫీచర్ సహా అనేక సెక్యూరిటీ ఫీచర్లు ఈ కారు సొంతం.
డ్రైవ్‌స్పార్క్ టీం సభ్యుడు ఉదయ్‌పూర్‌లో హోండా ఎలివేట్ SUV కారును డ్రైవింగ్ చేశారు. అనంతరం కారు పూర్తి రివ్యూ వీడియోను రూపొందించారు. ఎలివేట్ SUV వీడియోను మీకోసం ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నాం. అనంతరం వీడియోపై మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఎలివేట్ ADAS సహా 6 ఎయిర్‌బ్యాగ్స్, EBDతో కూడిన ABS, వెహికల్ స్టెబిలిటీ అసెస్ట్, ఎజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెనుక పార్కింగ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లను కలిగి ఉంటుంది. కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, ఆటో హై బీమ్, లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి.

ఎలివేట్ లోపలి భాగాన్ని హోండా ప్రోగ్రెసివ్ క్యాబిన్ అని పిలుస్తోంది. ఇందులో 10.25 అంగుళాల HD ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. స్టీరింగ్ వీల్ వెనుక ఉన్న ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో స్పీడోమీటర్, 7 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్టు చేస్తుంది. మరియు 8 స్పీకర్ల సౌండ్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








