జూన్‌లోనే Honda Elevate SUV లాంచ్‌ .. సన్‌రూఫ్‌ ఎలా ఉంటుందంటే?

హోండా త్వరలో ఎలివేట్‌ SUVని లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అధికారికంగా లాంచ్ చేసేముందు ఈ కారు కు సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించింది. హోండా ఎలివేట్‌ ప్రొఫైల్‌, సన్‌రూఫ్‌ సహా మరికొన్ని వివరాలను విడుదల చేసింది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌, మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా వంటి మోడళ్లతో హోండా ఎలివేట్‌ పోటీపడాల్సి ఉంది.

హోండా సంస్థ షేర్‌ చేసిన వివరాలను అనుగుణంగా Honda Elevate SUV పనోరమిక్‌ సన్‌రూఫ్‌ కలిగి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. రూఫ్‌ రైల్స్‌, షార్స్‌- ఫిన్‌ యాంటీనా, ORVMలు ఉన్నాయి. కారు వెనుక భాగంలో ఎలివేట్ బ్యాడ్జింగ్‌తో పాటు టెయిల్‌లైట్లను కనెక్ట్‌ చేసే LED లైట్లు ఉన్నాయి.

Honda Elevate SUV

హోండా షేర్‌ చేసిన స్కెచ్‌ ఆధారంగా Honda Elevate షార్ప్‌ లుక్‌ను కలిగి ఉంది. ప్రధానంగా ఎలివేట్ డిజైన్‌ CR-V మోడల్‌పై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ఈ కారు హెడ్‌లైట్లు.. స్లిమ్‌, షార్ప్‌ LED గా ఉండే అవకాశం ఉంది. హోండా ఎలివేట్‌ కారుకు అమర్చిన పెద్ద గ్రిల్‌ మంచి లుక్‌ ఇవ్వనుంది. ఈ SUV మల్టీ స్పోక్‌ అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటే అవకాశం ఉంది.

హోండా షేర్‌ చేసిన చిత్రంలో కారు బయట డిజైన్‌ను కొంత ఊహించగలిగే అవకాశం ఉన్నా.. లోపలి భాగం ఎలా ఉంటుందనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. భారత్‌లో ఉన్న హోండా కార్లలో ఉన్న ఆధునాతన ఫీచర్లతో ఎలివేట్‌ కారు లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు బానెట్‌ ప్రతి కార్నార్‌లో ఫ్లాట్‌ లుక్‌తో రానుంది. మరియు విండో లైన్‌ మరియు గ్లాస్‌హౌస్‌ కొంచెం పెద్దగా కనిపించే అవకాశం ఉంది.

హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీ 1.5 లీటర్‌ 4-సిలిండర్‌ పెట్రోల్ ఇంజిన్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంజిన్‌ 120 bhp శక్తిని ఉత్పత్తి చేయనుంది. e:HEVలో వినియోగించిన టెక్నాలజీని ఉపయోగించి హైబ్రిట్‌ పవర్‌ట్రైన్స్‌తో ఈ ఎలివేట్‌ ఎస్‌యూవీని అందించవచ్చు. అత్యధిక ధర కలిగిన వేరియంట్లలో ADAS ఫీచర్‌ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ తొలిసారిగా సెడాన్‌లో వినియోగించారు.

హోండా తన మార్కెట్‌ నుంచి CR-V మరియు WR-V మోడళ్లను నిలిపివేసిన తర్వాత తొలి SUV గా ఎలివేట్‌ విడుదల కానుంది. హోండాలో గతంలో వచ్చిన కొన్ని మోడళ్లు విఫలమైన నేఫథ్యంలో ఈ ఎలివేట్‌.. ఎస్‌యూవీ ప్లాన్‌కు కీలకం కానుంది. హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీ జూన్‌ 6న అధికారికంగా లాంచ్‌ కానుంది. ఆగస్టు నుంచి సేల్‌ ప్రారంభించే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 15, 2023, 18:52 [IST]
English summary
Honda elevate suv partial details revealed and will launch on june 6
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+