Honda Elevate SUV హోండా ఎలివేట్‌ సరికొత్త రికార్డు.. కేవలం 100 రోజుల్లోనే 20,000 కార్లు సేల్.!!

ఇటీవల భారత మార్కెట్లోకి హోండా కార్స్ ఇండియా నుంచి విడుదలైన కొత్త హోండా ఎలివేట్ ఎస్‌యూవీ సేల్స్‌లో దూసుకుపోతోంది. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 20,000 యూనిట్ల విక్రయాలను సాధించి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ మేరకు హోండా కార్స్‌ ఇండియా ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హోండా కార్స్‌ ఇండియా తన సరికొత్త ఎస్‌యూవీ Honda Elevate ని సెప్టెంబర్‌ 2023 లో లాంచ్‌ చేసింది. ఈ సరికొత్త కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా కార్లతో పాటు ఇతర ప్రసిద్ధ SUVలకు భారత మార్కెట్లో గట్టి పోటీగా నిలిచింది. ఈ క్రమంలో ప్రారంభించిన 100 రోజుల్లోనే 20,000 యూనిట్ల మైలురాయిని చేరుకున్నట్లు హోండా సంస్థ తెలిపింది.

Honda-Elevate-SUV

కాగా గత మూడు నెలల్లో హోండా బ్రాండ్ అమ్మకాలలో హోండా ఎలివేట్ 50 శాతానికి పైగా సేల్స్‌ను సాధించింది. సరికొత్త పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్‌లు, ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్, అధునాతన ఫీచర్లతో హోండా ఎలివేట్‌ను సంస్థ ప్రవేశపెట్టింది. ఇక ఇందులోని వేరియంట్లు, ఫీచర్లను పరిశీలిస్తే..

కొత్త హోండా ఎలివేట్ SUVను.. SV, V, VX మరియు ZX ట్రిమ్ స్థాయిలలో సంస్థ ప్రవేశపెట్టింది. డిజైన్‌ పరంగా హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీ.. దాని LED DRLతో కొత్త బోల్డ్ LED హెడ్‌లైట్‌ల ద్వారా హైలైట్‌ అవుతూ ఎక్స్‌టీరియర్‌ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

హోండా ఎలివేట్‌ SUV లోపలి భాగంలో 10.25-అంగుళాల HD ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేతో కూడిన డ్యూయల్ డిస్‌ప్లే డాష్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఫీచర్‌తో వస్తుంది. దీనిని 8-స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌కు కనెక్ట్ చేశారు.

కొత్త హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీలో 7-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, సింగిల్-పేన్ సన్‌రూఫ్, ఖరీదైన సీటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను చూడవచ్చు. కాగా ఈ సరికొత్త హోండా ఎలివేట్ SUVని థాయ్‌లాండ్‌కు చెందిన హోండా R&D ఆసియా పసిఫిక్ అభివృద్ధి చేసింది.

ఇంజిన్‌ విషయానికొస్తే కొత్త హోండా ఎలివేట్ SUV 1.5-లీటర్, DOHC, 4-సిలిండర్, నేచురల్లీ అస్పిరేటెండ్‌ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌ను 5వ తరం హోండా సిటీలో కూడా చూడవచ్చు. ఈ ఇంజిన్ 6,600rpm వద్ద 119.4 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా 4,300rpm వద్ద 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా ఎలివేట్ SUVలో ఈ 1.5-లీటర్ ఇంజిన్‌తో ట్రాన్స్‌మిషన్ ఎంపికలు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు CVT గేర్‌బాక్స్‌తో వస్తాయి. హోండా ప్రకారం ఎలివేట్ SUV మాన్యువల్ వేరియంట్ 15.31 kmpl మైలేజ్‌ని అందిస్తుంది. కాగా CVT వేరియంట్ 16.92 kmpl మైలేజ్‌ని ఇస్తుంది.

హోండా ఎలివేట్ SUV రియల్ వరల్డ్ మైలేజ్ గణాంకాలను పరిశీలిస్తే.. ఎలివేట్ పెట్రోల్ MT మోడల్ పట్టణ ప్రాంతాల్లో 11.36 kmpl మైలేజీని అందిస్తుండగా.. హైవేపై 18.50 kmpl మైలేజీని అందిస్తుంది. భారత మార్కెట్లో దీని ధర వేరియంట్ల ప్రకారం రూ. 10,99,900 నుంచి రూ. 15,99,900 గా ఉంది. ఈ ధరలు ఈ నెలాఖరు వరకు మాత్రమే వర్తిస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, December 18, 2023, 9:41 [IST]
English summary
Honda elevate suv records 20000 units sales in 100 days check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+