Honda Elevate SUV విడుదల.. ఆకర్షణీయమైన డిజైన్, ADAS సహా..

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా తమ తాజా SUV Elevateను భారత్‌లో లాంచ్‌ చేసింది. భారత్‌లోనే తొలిసారిగా లాంచ్‌ చేసినట్లు సంస్థ తెలిపింది. జులై నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ కారు డిజైన్‌, ఫీచర్లు సహా మరిన్ని వివరాలు మీకోసం.

హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీ 5వ తరం హోండా సిటీలో ఉన్నట్లుగానే 1.5 లీటర్ల, DOHC, 4- సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ 6600rpm వద్ద 119.4bhp మరియు 4300rpm వద్ద 145Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలివేట్ ఇంజిన్‌ రెండు ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో వస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ మరియు సీవీటీ గేర్‌ బాక్స్‌ను కలిగి ఉంటుంది.

Honda Elevate SUV

హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీ కారు 4,312mm పొడవు, 1,790mm వెడల్పు, 1,650mm ఎత్తును కలిగి ఉంటుంది. 2,650mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. అంటే హ్యుందాయ్‌ క్రెటా కంటే హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీ కారు 12mm పొడవు, 15mm ఎత్తు మరియు 40mm పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

హోండా ఎలివేట్‌ SUV కారు 480 లీటర్ల బూట్‌స్పేస్‌ను కలిగి ఉంటుంది. మరియు 220mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో వస్తుంది. హోండా ఎలివేట్‌ కారు కొలతలు పెద్దగా ఉన్నప్పుటికీ 5.2 మీటర్ల టర్నింగ్‌ రేడియస్‌తో నగరంలో ప్రయాణించేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నాం.

Honda Elevate SUV

హోండా ఎలివేట్‌ SUV కారు కీలక ఫీచర్లను కలిగి ఉంది. 7 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, మరియు వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌తో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్‌, లేన్ వాచ్‌ కెమెరా, రేర్‌ వ్యూ కెమెరా, కార్‌టెక్‌, ADAS (అడ్వాన్సడ్‌ డ్రైవర్ అసిస్టెంట్‌ సిస్సమ్‌) ఫీచర్లు ఉంటాయి.

Honda Elevate SUV

ఈ ADASలో కొలిజిన్‌ మిటిగేషన్‌ సిస్టమ్‌, లేన్‌ కీపింగ్‌ అసిస్ట్‌, హై బీమ్‌ అసిస్ట్‌, రోడ్‌ డిపాచర్‌ మిటిగేషన్‌, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, లేన్‌ వాచ్‌ సహా మరిన్ని ఫీచర్లు హాండా ఎలివేట్ ఎస్‌యూవీ సొంతం. ఈ ఫీచర్లతోపాటు మరిన్ని కీలక భద్రతా ఏర్పాట్లు హోండా ఎలివేట్ ఎస్‌యూవీ కలిగి ఉంది.

6 ఎయిర్‌ బ్యాగ్‌, EBDతో కూడిన ABS (యాంటీ బ్రేకింగ్‌ సిస్టమ్‌), హిల్‌ అసిస్టెంట్‌, రేర్‌ పార్కింగ్‌ సెన్సార్‌, ట్రాక్సన్‌ కంట్రోల్, హెహికల్ స్టెబిలిటీ అసిస్టెంట్‌, సీల్‌ బెల్ట్‌ రిమైండర్ సహా అనేక కీలక సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. 2026లో హోండా ఎలివేట్‌ ఎస్‌యూవీ బ్యాటరీ ఆపరేటెడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ వాహనం గురించి మరే ఇతర సమాచారం వెల్లడించలేదు.

Honda Elevate SUV

హోండా ఎలివేట్‌ SUV పొడవైన ఆక్టాగోనల్‌ ఫ్రంట్‌ గ్రిల్‌ ఆకర్షణీయమైన LED హెడ్‌ లైట్లతో రానుంది. ఫ్రంట్‌ గ్రిల్‌ పైనున్న క్రోమ్‌ బార్‌ ద్వారా రెండు ఎల్‌డీఈ లైట్లు కనెక్ట్‌ చేయబడతాయి. ఫాక్స్‌ స్కిడ్‌ ప్లేట్లు, క్లామ్‌షెల్‌ బానెట్‌, డోన్‌ మౌటెండ్‌ రేర్‌ వ్యూ మిర్రర్‌.. హోండా ఎలివేట్ ఎస్‌యూవీ కారును మంచి ఆకర్షణీయంగా మార్చాయి. డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌, సిల్వర్‌ రూఫ్‌ రెయిల్స్‌, షార్క్ ఫిన్‌ యాంటీనా మరియు స్లీక్‌ లుకింగ్‌ ఎల్‌ఈటీ లైట్లును కలిగి ఉంటుంది.

Honda Elevate SUV

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 6, 2023, 16:18 [IST]
English summary
Honda elevate suv unveiled in india with attractive adas security features
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+