5 లక్షల కార్లను వెనక్కి పిలిచిన కంపెనీ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

కొన్ని కొన్ని సార్లు కార్ల కంపెనీలు తయారీలో ఏదైనా మార్పు జరిగితే వాటిని రీకాల్ చేస్తాయి. ఇలాంటి సందర్భాలు ఇప్పటికి చాలా చూశాము. అలానే జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు హోండాసిటీ భారీ సంఖ్యలో కార్లను వెనక్కి తీసుకురావలని నిర్ణయించింది. ఇప్పటికే విక్రయించిన కార్లను సర్వీస్ సెంటర్లకు తీసుకురావాలని కంపెనీ తన వినియోగదారులకు సూచించినట్లు సమాచారం. దానికి కారణం ఏమిటో తెలుసా..

కారు కొనుగోలు చేసేముందు భద్రతా పరమైన ఫీచర్లపై కస్టమర్లు ఎక్కువగా దృష్టి సారిస్తారు. యాక్సిడెంట్ సమయాల్లో అధునాతన ఫీచర్లతో ఉన్న కార్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చనే భావన వినియోగదారుల్లో బలంగా నాటుకుపోయింది. హోండా కంపెనీ విక్రయించిన కొన్ని కార్లలో సేఫ్టీ సమస్యలు ఉన్నట్లు గుర్తించింది.

హోండా సిటీ సీఆర్

సీటు బెల్ట్..

ప్రధానంగా ముందు సీటు బెల్ట్‌లతో సమస్య ఏర్పడిందని సంస్థ గుర్తించింది. ఇందుకోసం 5 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నామని అందుకు వినియోగదారులు సహకరించాలని హోండా సిటీ కోరింది.
ప్రతి కారులో ప్రమాదాలను నివారించడానికి సీటు బెల్ట్ ఒక ముఖ్యమైన సాధనమని.. దానిని సరిగ్గా ధరించడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చని సంస్థ అభిప్రాయపడింది.

హోండా రీకాల్ తో కారు ఎక్కడ రీకాల్ చేయాలనీ భారత వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రీకాల్ కేవలం USA, కెనడాకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ తెలిపింది. హోండా డీలర్‌షిప్ సిబ్బంది ఇప్పటికే తమ వినియోగదారులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారని పేర్కొంది. కొన్ని సెలెక్టెడ్ వెహికిల్స్ పై మాత్రమే ఈ చర్యలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

హోండా సిటీ కారు

పలు కార్ల రీకాల్..

2017 నుంచి 2020 CR-V, 2018 నుంచి 2019 అకార్డ్, 2018 నుంచి 2020 ఒడిస్సీ, 2019 ఇన్‌సైట్, 2019 నుంచి 2020 వరకు అక్యురా RDX మోడల్స్ ని రీకాల్ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. కొన్ని రోజుల్లో కంపెనీ ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో CR-V అమ్మకాలు నిలిపివేయబడ్డాయి. అంతకు ముందు రూ.28.34 లక్షల ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉండేది. ఇది పెట్రోల్ డీజిల్ ఇంజన్ ఎంపికలతో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 118 నుంచి 152 bhp గరిష్ట శక్తిని 189 నుంచి 300 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది FWD (ఫ్రంట్ వీల్ డ్రైవ్)AWD (ఆల్ వీల్ డ్రైవ్) సాంకేతికతను పొంది ఉంది.

హోండా అకార్డ్

రానున్న రోజుల్లో సమస్యలు ఉండవు..

హోండా ఫ్లాగ్‌షిప్ 'అకార్డ్'ని కూడా విక్రయించడం లేదు. ఇది రూ.38 నుంచి రూ.43.21 లక్షల ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఐదు సీట్ల ఎంపికను కలిగి ఉన్న ఈ కారు 10.7 నుంచి 23.1 kmpl మైలేజీని అందించగలదు. అలాగే 1993 cc నుంచి 3471 cc పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇప్పుడు ఈ కారును కూడా రీకాల్ చేస్తున్నారు.

హోండా కంపెనీ అప్‌డేటెడ్ ఒడిస్సీ కారును యుఎస్, కెనడా మార్కెట్‌లలో విక్రయిస్తోంది. ఇది 3.5 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ SOHC i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 280 HPని ఉత్పత్తి చేస్తుంది. అలానే10 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. అలాగే, గతేడాది హోండా కంపెనీ ఇన్‌సైట్ కారును అమ్మకానికి నిలిపివేసినట్లు తెలిసింది.

అలాగే, హోండా అప్‌డేట్ చేయబడిన అకురా RDXని విక్రయిస్తోంది. ఇది ఐదు సీట్ల ఎంపికలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఫ్రంట్ సీట్ బెల్ట్ సమస్యను పరిష్కరించడానికి పెద్ద సంఖ్యలో రీకాల్ చేయడం మంచి నిర్ణయమని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో కొత్త కార్ల తయారీకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనేది వినియోగదారుల అభిప్రాయం.

More from DriveSpark

Article Published On: Thursday, March 16, 2023, 20:15 [IST]
English summary
Honda issues recall for 5 lakh cars due to seat belts safety issue
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+