ఈ కార్లపై భారీ డిస్కౌంట్.. రూ.73,000 వరకు తగ్గింపు, ఈ నెలవరకే ఉండే ఛాన్స్!!
పండుగ సీజన్ మొదలైందంటే దేశీయ మార్కెట్లో ఆటో మేకర్లు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. భారీ ఆఫర్లు ప్రకటించి సేల్స్ పరంగా దూకుడు ప్రదర్శిస్తాయి. ఈ నేపథ్యంలో వినాయక చవితి దగ్గర పడుతుండటంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ భారీ ఆఫర్లను ప్రకటించింది.
దేశీయ మార్కెట్లో పండుగ సీజన్ ప్రారంభమైంది. కార్ల తయారీదారులు తమ పోర్ట్‌ఫోలియోలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ తగ్గింపులను అందిస్తున్నారు. వాటిలో హోండా ఒకటి. ఈ జపనీస్ కార్ల సంస్థ సెప్టెంబర్ నెలలో రూ.73 వేల వరకు ఆఫర్లను అందిస్తోంది. మరి హోండాకు చెందిన ఏయే కార్లపై ఈ ఆఫర్లు వర్తిస్తున్నాయో పూర్తి సమాచారం ఈ కథనంలో..

ప్రస్తుతం, హోండా సిటీ(Honda City) పెట్రోల్ వేరియంట్‌లపై మాత్రమే ఆఫర్లను ప్రకటించింది. పలు మోడళ్లపై గరిష్ఠంగా రూ. 73,000 తగ్గింపును ఇస్తోంది. ఇందులో కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 28,000, రూ. 20,000 హోండా టు హోండా ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 వరకు నగదు తగ్గింపు పొందవచ్చు.
హోండా సిటీ మోడల్ పై ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 10,000 తగ్గింపు ప్రకటించింది. ఇంకా అదనంగా లాయల్టీ బోనస్ పేరుతో రూ. 5,000 తగ్గిస్తోంది. ఇంకా హైబ్రిడ్ వేరియంట్‌లపై రూ. 40,000 వరకు మాత్రమే నగదు తగ్గింపును పొందే అవకాశం ఉంది.

మరోవైపు హోండా అమేజ్(Honda Amaze) పై ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చు. ఈ కార్లపై రూ. 21,000 రూ. వరకు తగ్గింపును ప్రకటించింది. రూ. 10,000 వరకు నగదు తగ్గింపు ఉంది. ఇంకా కార్పొరేట్ తగ్గింపు రూ. 6,000, లాయల్టీ బోనస్ కింద రూ. 5,000 వరకు తగ్గింపును ఇస్తోంది.
ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 5వ జనరేషన్ హోండా సిటీ కారు ధర రూ.11.57 లక్షల నుంచి రూ.16.05 లక్షలు (ఎక్స్‌షోరూం) వరకు ఉంది. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 121 PS శక్తి, 145 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ / CVT గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది లీటరుకు 17.8 నుంచి 18.4 km మైలేజ్ ఇస్తుంది.

హోండా అమేజ్ సెడాన్ E, S, VX వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 90 PS శక్తిని, 110 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, గోల్టెన్ బ్రౌన్ మెటాలిక్, మెట్రోయిడ్ గ్రే మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. 18.3 నుంచి 18.6 kmpl మైలేజీని ఇస్తుంది. ప్రస్తుతం భారత్‌లో ఈ కారు ధర రూ.7.05 లక్షల నుంచి రూ.9.66 లక్షలుగా ఉంది.
అయితే హోండా సంస్థ ఈ ఆఫర్లపై కొన్ని పరిమితులు విధించింది. ఈ ఆఫర్లు కేవలం సెప్టెంబర్, 30, 2023 వరకు వర్తిస్తాయి. ఇంకా ఈ ఆఫర్లు మీరు ఎంచుకునే వేరియంట్, కలర్, డీలర్‌షిప్ మరియు ఇతర అంశాలను బట్టి మారుతాయని సంస్థ వెల్లడించింది.
సెప్టెంబర్ నెలలో ప్రకటించిన రూ.73,000 తగ్గింపును హోండా సంస్థ ప్రకటించింది. దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో సిటీ, అమేజ్ సెడాన్ కార్లను కొనుగోలు చేస్తారని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే వినియోగదారులు హోండా ప్రకటన, డిస్కౌంట్లపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కార్ల కచ్చితమైన ధర కోసం మీ దగ్గరలోని హోండా డీలర్‌ను సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications








