Honda కార్లపై రూ.73,000 వరకు తగ్గింపు.. ఆ వాహనాలపై మాత్రమే..!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా భారత్‌తో మంచి ఆదరణ పొందుతోంది. ఈ సంస్థ నుంచి తాజాగా ఓ కీలక ప్రకటన వెలువడింది. ఆగస్టు నెల ప్రారంభంలో తన వినియోగదారులకు హోండా గుడ్‌న్యూ్స్‌ చెప్పింది. సిటీ, అమేజ్‌ సెడాన్‌ల కొనుగోలుపై రూ.73,000 వరకు తగ్గింపును పొందవచ్చని తెలిపింది.

5వ జనరేషన్‌ హోండా సిటి కారుపై మొత్తం రూ.73,946 వరకు తగ్గింపును పొందవచ్చని పేర్కొంది. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, లాయల్టీ బోనస్‌ కింద రూ.5000, రూ.10,000 ఎక్స్చేంజ్‌ బోనస్‌, కార్పొరేట్‌ బోనస్‌ రూ.8000, ప్రత్యేక కార్పొరేట్‌ బోనస్‌ రూ.20,000 సహా మరిన్ని తగ్గింపులు పొందవచ్చు.

honda offers upto rs73000 discounts

ప్రస్తుతం భారత మార్కెట్‌లో 5వ జనరేషన్‌ హోండా సిటీ కారు ధర రూ.11.57 లక్షల నుంచి రూ.16.05 లక్షలు (ఎక్స్‌షోరూం) వరకు ఉంది. ఈ కారు 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 121PS శక్తి, 145Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్‌ మాన్యువల్‌ / CVT గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. 17.8 - 18.4 kmpl మైలేజీని ఇస్తుంది.

హోండా సిటీ హైబ్రిడ్‌ V వేరియంట్‌పై రూ.40,000 నగదు తగ్గింపు పొందవచ్చు. ఈ సెడాన్‌ ఎక్స్‌షోరూం ధర రూ.18.89 లక్షల నుంచి రూ.20.39 లక్షల మధ్య ఉంది. ఈ కారు 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ట్విన్ ఎలక్ట్రిక్‌ మోటార్లను కలిగి ఉంది. 126ps శక్తి, 253Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. e-CVT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 27.13 kmpl మైలేజీని ఇస్తుంది.

honda offers upto rs73000 discounts

ఐదో తరం హైబ్రిడ్‌ హోండా సిటీ సెడాన్‌లు సుమారుగా ఇటువంటి ఫీచర్లనే కలిగి ఉంటాయి. టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే సహా యాంబియంట్‌ లైటింగ్‌ను కలిగి ఉంది. భద్రతాపరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్సడ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌) సహా మరిన్ని కీలక ఫీచర్లను కలిగి ఉంది.

ఈ నెలలో హోండా అమేజ్‌ కూడా భారీ తగ్గింపును పొందుతుంది. ఇందులో నగదు తగ్గింపు కింద రూ.10,000, లాయర్టీ బోనస్‌ కింద రూ.5000, కార్పొరేట్‌ తగ్గింపు కింద రూ.6000ను పొందవచ్చు. దీంతోపాటు అదనంగా రూ.23.296 తగ్గింపును పొందుతారు. ప్రస్తుతం భారత్‌లో ఈ కారు ధర రూ.7.05 లక్షల నుంచి రూ.9.66 లక్షలుగా ఉంది.

honda offers upto rs73000 discounts

హోండా అమేజ్‌ సెడాన్‌ E, S, VX వేరియంట్లు రేడియంట్‌ రెడ్‌ మెటాలిక్‌, ప్లాటినం వైట్‌ పెర్ల్‌, గోల్టెన్‌ బ్రౌన్‌ మెటాలిక్‌, మెట్రోయిడ్‌ గ్రే మెటాలిక్‌, లూనార్‌ సిల్వర్‌ మెటాలిక్‌ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ గరిష్ఠంగా 90 PS శక్తిని, 110 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ కారు 5 స్పీడ్‌ మాన్యువల్‌ లేదా CVT గేర్‌బాక్స్‌ ఆప్షన్‌లతో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. 18.3 నుంచి 18.6 kmpl మైలేజీని ఇస్తుంది. ఇందులో 7 అంగుళాల టచ్‌స్ర్కీన్‌ సిస్టమ్‌, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, ఆటో LED ప్రొజెక్టర్‌ హెడ్‌లైట్లు ఉన్నాయి. డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాక్‌లు, ABS సహా మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.

ఆగస్టు నెలలో ప్రకటించిన రూ.73,000 తగ్గింపును హోండా సంస్థ ప్రకటించింది. దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో సిటీ, అమేజ్‌ సెడాన్‌ కార్లను కొనుగోలు చేస్తారని సంస్థ భావిస్తోంది. అయితే వినియోగదారులు హోండా ప్రకటన, డిస్కౌంట్లపై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. అయితే వేరియంట్లు, డీలర్‌, రాష్ట్రాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. కార్ల కచ్చితమైన ధర కోసం మీ దగ్గరలోని హోండా డీలర్‌ను సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Thursday, August 3, 2023, 17:43 [IST]
English summary
Honda motors offers upto rs73000 discounts on several models in august
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+