కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసా..? కేవలం మిల్లీ సెకన్లలో ఓపెన్ అవ్వాలి.. లేకపోతే..
దేశంలో రోడ్లపై ప్రమాదాలు పెరుగుతున్న కొద్దీ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆటో మొబైల్ రంగంలో ఎన్నో విస్తృత మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో ముఖ్యమైనది ఎయిర్ బ్యాగ్స్. కారు ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ తో పాటు ముందు సీటులో ఉన్న ప్రయాణికులను రక్షించడంలో ఎయిర్ బ్యాగులు కీలక పాత్ర పోషిస్తాయి.
గాలితో కూడిన ఈ కుషన్లు సాధారణంగా ముందు సీట్లో డ్యాష్‌బోర్డ్ మరియు స్టీరింగ్ వీల్‌లో ఉంటాయి. 1950వ దశకంలో, ఒక పారిశ్రామిక ఇంజినీర్ ప్రమాదానికి గురయ్యాడు. అక్కడి నుంచి వచ్చిన ఆలోచనే ఈ ఎయిర్ బ్యాగ్స్. అప్పటి నుంచి ఇంజనీర్లు కారు కోసం "సేఫ్టీ కుషన్ అసెంబ్లీ" అభివృద్ధిపై పని చేశారు. తక్కువ వ్యవధిలో, దాని నమూనా ఆమోదించబడింది. అంతే కాకుండా కారులో ఎయిర్‌బ్యాగ్‌లకు ఆదరణ పెరిగింది.

ఎయిర్‌బ్యాగ్‌లను అంతర్నిర్మిత కుషన్‌లు అని అంటారు. ఇవి ప్రమాదానికి గురైనప్పుడు కారు ముందు భాగంలో పడినప్పుడు వాటిలో గాలి చేరి కారులో ఉన్నవారిని రక్షిస్తాయి. గతంలో చాలా కార్లు భద్రతా చర్యగా కేవలం ముందు సీట్లలో మాత్రమే ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చాయి. ఆ తరువాత, కార్ల తయారీదారులు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లను కూడా చేర్చడం ప్రారంభించారు.
ఈ రెండు రకాల ఎయిర్‌బ్యాగ్‌లు ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో దోహదపడ్డాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగ్‌లను ఉపయోగించిన తర్వాత 29 శాతం డ్రైవర్ మరణాలు, 32 శాతం ముందు సీటు ప్రయాణీకుల మరణాలు తగ్గినట్లు తేలింది. సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ప్రమాదాల్లో చాలావరకు గణనీయంగా తగ్గుదలని చూశాయి.

కారులో ఏర్పాటు చేసే ఎయిర్‌బ్యాగ్‌ల్లో సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఇవి ప్రమాద ప్రభావం యొక్క తీవ్రతను గుర్తించగలవు. క్రాష్ తీవ్రంగా ఉంటే మాత్రమే, ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుని సెకన్ల వ్యవధిలోని అవి పూర్తిగా గాలితో నిండుతాయి. అయితే ఎమర్జెన్సీ బ్రేక్ ఉంటే, ఈ ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుంటాయా అని సందేహం రావచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం లేదు. 20Gs కంటే ఎక్కువ లేదా 20 రెట్లు గురుత్వాకర్షణ శక్తి ద్వారా మాత్రమే అవి తెరుచుకుంటాయి.
కారులోని ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థ యాక్సిలరోమీటర్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ సెన్సార్ ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడానికి 12 నుంచి 20 మిల్లీసెకన్లు పడుతుంది. ఇంకా గాలితో పూర్తిగా నిండటానికి దాదాపు 60-65 మిల్లీసెకన్లు పడుతుంది. కార్ల తయారీదారులు వాహనం యొక్క దృక్పథాన్ని ప్రభావితం చేయని విధంగా ఎయిర్‌బ్యాగ్‌లను రూపొందించారు.

కారులో ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం వల్ల తీవ్రమైన ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుతుంది. ఎయిర్ బ్యాగులు పూర్తిగా తెరుచుకోగానే మెడ, తల మరియు వెన్నెముకకు రక్షణగా నిలుస్తుంది. తీవ్రమైన గాయాలు కాకుండా స్వల్ప గాయాలతో మాత్రమే బయటపడే అవకాశం ఉంది. ప్రధానంగా కార్లలో ఐదు రకాల ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.
ఫ్రంటల్ ఎయిర్ బ్యాగ్‌లను స్టీరింగ్ మరియు ఫ్రంట్ డ్యాష్ బోర్డ్‌లో ఏర్పాటు చేశారు. మోకాలి ఎయిర్‌బ్యాగ్‌లను డ్రైవర్‌తో పాటు ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ భద్రత కోసం ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ దిగువన ఉంటుంది. డోర్ మౌంటెడ్ ఎయిర్‌బ్యాగ్‌లను ఇరు వైపులా ముందు డోర్ల వద్ద చూడవచ్చు.

సీట్ మౌంటెడ్ ఎయిర్‌బ్యాగ్‌లు డ్రైవర్ సీట్ల ఔట్‌బోర్డ్ వైపు, ముందు మరియు కొన్నిసార్లు వెనుక ప్యాసింజర్ వైపు భద్రత కోసం ఏర్పాటు చేశారు. రూఫ్ రైల్ ఎయిర్‌బ్యాగ్‌ల ట్రిమ్ వెనుక భాగంలో పొందుపరిచారు. ఇంకా ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్స్‌లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చారు.
గాలితో కూడిన సీటు బెల్టులు, ఫార్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, పనోరమిక్ సన్‌రూఫ్ ఎయిర్‌బ్యాగ్, సీటు కుషన్ ఎయిర్‌బ్యాగ్, బ్యాక్ సీటు ఎయిర్‌బ్యాగ్, ఔటర్ హుడ్ ఎయిర్‌బ్యాగ్, ఫ్లెక్సిబుల్ ఎయిర్‌బ్యాగ్ సీటింగ్ సిస్టమ్,ప్రీక్రాష్ ఎక్స్‌టర్నల్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్, మోటార్‌సైకిల్ ఎయిర్‌బ్యాగ్, సైకిల్ హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్, సైక్లిస్ట్ వెస్ట్ ఎయిర్‌బ్యాగ్ ఇలా మరిన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది.
ఇంకా ఎయిర్‌బ్యాగ్ కు సంబంధించి హెచ్చరికగా లైట్లు వెలుగుతుంటాయి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. ఎయిర్‌బ్యాగ్ బ్యాకప్ బ్యాటరీ క్షీణించినా, సెన్సార్లలో లోపం గుర్తించినా, ఎయిర్‌బ్యాగ్ క్లాక్ స్ప్రింగ్‌కు నష్టం వాటిల్లినా, తడి ఎయిర్‌బ్యాగ్ మాడ్యూల్ దెబ్బతిన్నా వార్నింగ్ లైట్లు వెలుగుతాయి.
కొన్ని సార్లు ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థలో లోపాల కారణంగా ప్రయాణికులకు ప్రమాదంలో గాయాలు కాక తప్పదు. ఇంకా ఇవి క్రాష్ సమయంలో గాయాల తీవ్రతను పెంచుతుంది. అందుకే మీరు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా ఎయిర్‌బ్యాగ్ తనిఖీని నిర్వహించాలి. దాదాపు ప్రతి కారు ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లోని లోపాలను నిర్ధారించే నిర్దిష్ట వ్యవస్థతో తయారుచేస్తున్నారు.
ఈ సిస్టమ్‌లో సర్క్యూట్‌లు మరియు సెన్సార్‌లు సరిగ్గా పనిచేస్తాయో లేదో ఈ టెస్ట్ తనిఖీ చేస్తుంది. అంతేకాకుండా, ఏదైనా ప్రమాద కారకం ఉంటే, అది ఒక నిర్దిష్ట కోడ్‌ను ఫ్లాష్ చేస్తుంది. ఉదాహరణకు, ఎయిర్‌బ్యాగ్ ఇండికేటర్ రెండుసార్లు ఫ్లాష్ అయితే, పాజ్ చేసి, ఆపై మళ్లీ నాలుగు సార్లు ఫ్లాష్ అయితే, అక్కడ సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.
కారులో ఎయిర్‌బ్యాగ్‌ల వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీని వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి. కొన్నిసార్లు ఢీకొన్నప్పుడు, ఎయిర్‌బ్యాగ్‌ని నింపడానికి నైట్రోజన్ వాయువు పేలినప్పుడు, అది లీక్ అయి మంటకు దారి తీస్తుంది. ఇంకో సమస్య ఎయిర్‌బ్యాగ్ యొక్క టాల్కమ్ పౌడర్ కోటింగ్‌కు సంబంధించింది.
ఎయిర్ బ్యాగులు తెెరుచుకున్నప్పుడు ఆ పౌడర్ ద్వారా శ్వాస సంబంధిత సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే మీరు ఎల్లప్పుడూ ఎయిర్ బ్యాగ్‌ల ప్రాముఖ్యతను గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల్లో ఎయిర్ బ్యాగులు మరణాల సంఖ్యను తగ్గించిందనేది వాస్తవం.


Click it and Unblock the Notifications








