ఆటో ఎక్స్‌పో 2023 లో అడుగుపెట్టనున్న హ్యుందాయ్ కార్లు - వివరాలు

ఈ నెల జరగనున్న 2023 ఆటో ఎక్స్‌పో కోసం చాలా దేశాల వాహన తయారీ సంస్థలు ఎదురు చూస్తున్నాయి. ఇందులో హ్యుందాయ్ కంపెనీ తన ఆధునిక కార్లను కూడాఆవిష్కరించనుంది. ఇందులో ఐయోనిక్ 5, ఐయోనిక్ 6 మరియు హ్యుందాయ్ నెక్సో FCEV వంటివి ఉన్నాయి.

హ్యుందాయ్ ఐయోనిక్ 5:

సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ త్వరలో జరగనున్న 'ఆటో ఎక్స్‌పో' లో ఐయోనిక్ 5 విడుదల చేయనుంది. ఇది కియా ఈవి6 మాదిరిగానే అదే ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (e-GMP) పై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, ఐయోనిక్ 5 మోడల్‌ను CKD (కంప్లీట్ నాక్డ్ డౌన్) యూనిట్‌గా భారతదేశానికి తీసుకురావడం వలన కొంత తక్కువ ధరకు లభించే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

ఆటో ఎక్స్‌పో 2023 లో అడుగుపెట్టనున్న హ్యుందాయ్ కార్లు

హ్యుందాయ్ కంపెనీ తన ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారుని గ్లోబల్ మార్కెట్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్సన్స్ తో విక్రయిస్తోంది. ఇందులో ఒకటి 58kWh బ్యాటరీ ప్యాక్ కాగా, మరొకటి పెద్ద 72.6kWh బ్యాటరీ ప్యాక్. అంతే కాకుండా హ్యుందాయ్ ఐయోనిక్ 5 2WD మరియు AWD ఆప్సన్స్ లో విక్రయిస్తోంది. 2WD వేరియంట్ 215bhp పవర్ మరియు 350Nm టార్క్‌తో ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది.

ఇక ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ యొక్క AWD వేరియంట్ ప్రతి యాక్సిల్‌కు శక్తినిచ్చే రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది. ఈ వేరియంట్ యొక్క కంబైన్డ్ పవర్ అవుట్‌పుట్ 302bhp మరియు 605Nm టార్క్. ఈ ఎలక్ట్రిక్ కారు 72.6kWh బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉండటం వల్ల లాంగ్-రేంజ్ వేరియంట్ అని పిలువబడుతుంది. ఇది ఒక ఛార్జ్ తో గరిష్టంగా 481 కిమీ పరిధిని అందిస్తుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

హ్యుందాయ్ ఐయోనిక్ 6:

హ్యుందాయ్ కంపెనీ' 2023 ఆటో ఎక్స్‌పో' లో తన ఐయోనిక్ 6 (Ioniq 6) ఫుల్-సైజ్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ Kona EV మరియు Ioniq 5 తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ప్రోఫెసీ కాన్సెప్ట్‌కి దగ్గరగా ఉంటుంది. ఇది హ్యుందాయ్ గ్రూప్ యొక్క e-GMP స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించుకుంటుంది.

హ్యుందాయ్ ఐయోనిక్ 6 ఫుల్ సైజ్ సెడాన్ కావున ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది పరిమాణం పరంగా టెస్లా మోడల్ 3, పోలెస్టార్ 2 మరియు బిఎమ్‌డబ్ల్యూ i4 వంటి వాటికి దగ్గరగా ఉంటుంది. ఇది 53kWh మరియు పెద్ద 77kWh అనే రెండు బ్యాటరీ ఫ్యాక్స్ కలిగి ఉంటుంది. సింగిల్ మోటార్ RWD సెటప్ మరియు హైయ్యర్ వేరియంట్‌లు డ్యూయల్ మోటార్ AWD ఆప్సన్ పొందుతుంది.

హ్యుందాయ్ నెక్సో FCEV:

హ్యుందాయ్ కంపెనీ 'ఆటో ఎక్స్‌పో 2023' లో ప్రదర్శించే మరో మోడల్ నెక్సో ఫ్యూయల్-సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (FCEV). ఇది దేశీయ మార్కెట్లో ప్రదర్శనకు రావడం ఇది మూడవ సారి. గతంలో 2018 మరియు 2020 లో ప్రదర్శించబడింది. ఇది మిడ్ సైజ్ SUV విభాగంలో ఉంటుంది. అంతే కాకుండా ఈ SUV ఫ్యూయెల్ సెల్ స్టాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ SUV గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

ఇప్పటికే చాలామంది వాహన ప్రేమికులు ఎప్పుడెప్పుడు ఆటో ఎక్స్‌పో ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇందులో అనేక కార్లు, బైకులు విడుదల కానున్నాయి. గత సంవత్సరం కరోనా వల్ల ఆగిపోయిన ఈ ఆటో ఎక్స్‌పో లో అనేక అధునాతన ఉత్పతులు కనిపించనున్నాయి. త్వరలో జరగబోయే ఆటో ఎక్స్‌పో 2023 లో అడుగుపెట్టే వాహనాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, January 6, 2023, 6:30 [IST]
English summary
Hyndai ioniq 5 launch 2023 auto expo and ioniq 6 nexo details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+