Hyundai Motors జూన్‌ సేల్స్‌లో అదరగొట్టిన హ్యుందాయ్‌ కార్లు.. జూలైలో వచ్చే కారుతో సునామీ సృష్టించే ఛాన్స్!!

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) జూన్ 2023 నెలలో మంచి అమ్మకాలను సాధించింది. ఇందుకు సంబంధించిన సేల్స్ వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. గత నెలలో మొత్తం 65,601 యూనిట్లను విక్రయించడం ద్వారా మార్కెట్‌లో తమ మార్క్‌ని నిలబెట్టుకోగలిగామని తెలిపింది.

అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీదారులలో ఒకటైన హ్యుందాయ్ 2022 జూన్ నెలలో 62,351 యూనిట్లను విక్రయించింది. గత నెల అమ్మకాలతో పోలిస్తే 5.21 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో హ్యుందాయ్ 50,001 యూనిట్ల దేశీయ అమ్మకాలను విక్రయించగా, మరో 15,600 యూనిట్ల ఎగుమతులు ఉన్నాయి. గత ఏడాది జూన్ లో 49,001 యూనిట్లను విక్రయించింది. గత నెల అమ్మకాలతో పోలిస్తే 2.04 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Hyundai-Car-Sales

ఎగుమతుల విషయానికొస్తే 2022 జూన్ నెలలో మొత్తం 13,350 యూనిట్లను ఎగుమతి చేసింది. గత నెల ఎగుమతులతో పోలిస్తే 16.85 శాతం వృద్ధిని హ్యూందాయ్ సాధించింది. జూన్ 2023 నెలలో హ్యుందాయ్ 50,000 కి పైగా దేశీయ అమ్మకాలను సాంధించడం పట్ల హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీఓఓ తరుణ్ గార్గ్ సంతోషం వ్యక్తం చేశారు.

కంపెనీకి ఉన్న సానుకూల కస్టమర్ల నమ్మకంతో ఈ సేల్స్ సాధ్యమయ్యాయని ఆయన అన్నారు. హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ క్రెటా మరియు హ్యుందాయ్ టక్సన్ 23లు ఈ సంవత్సరంల మొదటి అర్ధభాగంలో ఆయా సెగ్మెంట్లలో టాప్ స్థానంలో నిలిచాయని తరుణ్ గార్గ్ వెల్లడించారు. జూలై 10న విడుదల కాబోతున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్‌తో మంచి సేల్స్ సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జూలై 10 న ఎక్స్‌టర్‌ మైక్రో ఎస్‌యూవీని విడుదల చేయడం ద్వారా రాబోయే నెలల్లో బ్రాండ్ తన అమ్మకాలను మరింత పెంచుకోవాలని హ్యూందాయ్ చూస్తోంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత టాటా పంచ్, సిట్రోయెన్ సి3 మరియు మారుతి ఇగ్నిస్ వంటి వాటికి గట్టీ పోటీ ఇవ్వనుంది.

కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ EX, S, SX, SX (O) మరియు SX (O) కనెక్ట్ అనే 5 వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ కనెక్టివిటీ ఫీచర్లు, 90 ఎంబెడెడ్ వాయిస్ కమాండ్లు మరియు ఓవర్-ది-ఎయిర్ (ఒటిఎ) ఇన్ఫోటైన్మెంట్ మరియు మ్యాప్ అప్డేట్స్ సపోర్ట్ ఉన్నాయి.

ఈ కారులోని ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ఇన్-బిల్ట్ నావిగేషన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే సిస్టమ్లను సపోర్ట్ చేస్తుంది. దీంతో 10 ప్రాంతీయ, రెండు గ్లోబల్ భాషల్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్‌ కనెక్టివిటీ వంటి మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

జూన్‌ నెలలో వాహనాల సేల్స్ ఊహించినంతగా జరగలేదు. కార్లు, బైక్స్ ఇతర కమర్షియల్ వాహనాలు కొద్దిపాటి సేల్స్‌ని మాత్రమే సాధించాయి. ఎలక్ట్రిక్ టూవీలర్స్ కూడా ఆశించినంత మార్కెట్‌ను సాధించలేదు. అయితే జూలైలో విడుదల కాబోతున్న కార్లతో మార్కెట్ మళ్లీ పుంజుకుందని మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సరికొత్త హ్యూందాయ్ ఎక్స్‌టర్‌ జూలైలో మంచి సేల్స్ సాధించే అవకాశం లేకపోదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 4, 2023, 10:38 [IST]
English summary
Hyundai car sales in july details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+