Hyundai Creta: హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ విడుదలకు సిద్ధం.. టెస్టింగ్ ఫొటోలు వైరల్‌!

హ్యుందాయ్‌.. భారత్‌ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ కార్ల తయారీ సంస్థగా ఉంది. ఈ సంస్థ కార్లకు మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం హ్యుందాయ్‌ సంస్థ ఈ క్రెటా (Hyundai Creta facelift) ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అనేకసార్లు టెస్టింగ్‌ చేసింది. తాజా మరోసారి సిమ్లాలో టెస్టింగ్‌ చేసింది.

ఈ టెస్టింగ్‌ సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను జనవరి 16 న మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ద్వారా విక్రయాలు పెరిగే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది.

Hyundai creta facelift SUV

హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ మూడు ఇంజిన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో 1.5 లీటర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజిన్‌లు 114bhp శక్తి, 250Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పాత మోడల్‌లో ఉన్న 1.4 లీటర్ టర్బోఛార్జడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను ఈ సంవత్సరం తొలిభాగంలో నిలివేశారు. ఈ స్థానంలో 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్‌లు 7-స్పీడ్‌ DCT, 6-స్పీడ్‌ మాన్యువల్‌, 6-స్పీడ్‌ iMT, ఆటోమేటిక్‌ టార్క్‌ కన్వర్టర్‌, CVT గేర్‌బాక్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Hyundai creta facelift car

హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో లెవల్‌-2 ADAS సెక్యూరిటీ ఫీచర్‌తో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. దీని ద్వారా ఆటోమేటిక్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌, లేన్‌ కీపింగ్‌ అసిస్ట్‌, లేన్‌ చేంజ్‌ వార్నింగ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు స్డాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్‌ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌ వంటి భద్రతా ఫీచర్లున్నాయి.

దీంతోపాటు డ్యాష్‌బోర్డు్లోనూ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్‌స్పాడ్‌ మానిటర్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, పూర్తి డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, డ్యూయల్‌ జోన్‌ క్రైమేట్‌ కంట్రోల్‌, రీడిజైన్‌ HVAC కంట్రోల్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు మరిన్ని కీలక ఫీచర్లున్నాయి.

Hyundai creta new car

ధర విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న మోడల్‌ కంటే ఫేస్‌లిఫ్ట్ ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం హ్యుందాయ్‌ క్రెటా ప్రారంభ ధర రూ.10.87 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. మరియు టాప్‌ వేరియంట్‌ ధర రూ.19.20 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది.

హ్యుందాయ్‌ క్రెటా మోడళ్లు.. కియా సెల్టోస్‌, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, MG ఆస్టర్‌, హోండా ఎలివేట్‌, టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌లతో పోటీపడనుంది. అయితే విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ మరిన్ని స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్ల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Hyundai creta new model car

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Sunday, December 24, 2023, 15:35 [IST]
English summary
Hyundai creta facelift willbe launched on january 16 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+