హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు రివ్యూ వీడియో... ఈ సెగ్మెంట్‌లోనే బెస్ట్ కారు..!!
మైక్రో SUV సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను విడుదల చేసింది. ఈ కారు డిజైన్, ఫీచర్లు, ధర.. టాటా పంచ్ సహా ఇతర కార్లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. డ్రైవ్‌స్పార్క్ బృందానికి ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం లభించింది. మాసభ్యుడు ఈ కారును జైపూల్ పరిసర ప్రాంతాల్లో నడిపించారు. అనంతరం తన అద్భుతమైన అనుభవాన్ని వీడియోగా రికార్డు చేశాడు. ఆవీడియోను మీకు అందిస్తున్నాం.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV డ్యాష్‌బోర్డులో 8 అంగుళాల టచ్‌స్ర్కీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటోప్లే, ఆపిల్ కార్‌ప్లేను సపోర్టు చేస్తుంది నావిగేషన్‌ను కూడా సపోర్టు చేస్తుంది. 4.2 అంగుళాల MID, వాయిస్ యాక్టివేటెడ్ కమాండ్‌లతో పనిచేసే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్. ఆటోమేటిక్ క్రైమెట్ కంట్రోల్ వ్యవస్థ, వైర్‌లెస్ ఛార్జింగ్, టూ వే డ్యాష్‌కామ్, ఓవర్ ది ఎయిర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. పెట్రోల్, CNGలతో నడుస్తుంది. పెట్రోల్ మోడ్‌లో కప్పా సీరిస్ ఇంజిన్ 81.8bhp శక్తి, 113.8Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNGలో 67.7bhp శక్తి, 95.2Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌లను ఆప్షన్‌లలో వస్తుంది. కానీ CNG వెర్షన్ కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 19.4 kmpl మైలేజీని ఇస్తుంది. అయితే AMT (ఆటోమేటిక్ గేర్‌బాక్స్)లో 19.2 kmpl మైలేజీ మాత్రమే ఇస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ భద్రత విషయానికి వస్తే.. ఈ మైక్రో SUV 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్), హిల్ అసిస్ట్ కంట్రోల్, EBDతో కూడిన ABS, రేర్ పార్కింగ్ సెన్సార్లు-కెమెరా, వెనుక ఉన్న మూడు సీట్లకు సీట్‌బెల్ట్‌లు, అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








