Hyundai Exter హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధరలు పెరిగాయ్.. విడుదల తర్వాత తొలిసారిగా..!
భారత్ మార్కెట్‌లో హ్యుందాయ్ సంస్థ కొన్ని నెలల క్రితం హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీని (Hyundai Exter) విడుదల చేసింది. విడుదల సమయంలో నుంచే కారు డిజైన్, ధర, ఫీచర్లు భాగా ఆకర్షించాయి. దీంతో ఈ కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ కార్ల వెయిటింగ్ పిరియడ్ రోజురోజుకు పెరుగుతోంది.
తాజాగా హ్యుందాయ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter Price hike) ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మైక్రో SUVను విడుదల చేశాక తొలిసారిగా ధరలను పెంపును సంస్థ ప్రకటించింది. గరిష్ఠంగా రూ.16,000 వరకు పెరిగింది. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు ప్రారంభ ధర రూ.5,99,900 (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ కారు 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి EX, EX(O), S, SX, SX(O), మరియు SX(O) కనెక్ట్ వేరియంట్లలో లభిస్తుంది. EX MT, Sx(O) కనెక్ట్ AMT వేరియంట్లు మినహా అన్ని వేరియంట్లకు ధరల పెంపు వర్తిస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీ SX(O) కనెక్ట్ MT డ్యూయల్ టోన్ వేరియంట్ ధర గరిష్ఠంగా రూ.16 వేలు పెరిగింది. SX(O) కనెక్ట్ AMT డ్యూయల్ టోన్ వేరియంట్ ధర రూ.5000 పెరిగింది. మిగిలిన అన్ని వేరియంట్ల ధర రూ.10,400 పెరిగింది.

ఈ కారు మొత్తం అట్లాస్ వైట్, కాస్మిక్ బ్లూ, ఫైరీ రెడ్, రేంజర్ ఖాకీ, స్టార్రి నైట్, టైటాన్ గ్రే, అబిస్ బ్లాక్, కాస్మిక్ బ్లూ విత్ అబిస్ బ్లాక్, రేంజర్ ఖాకీ విత్ అబిస్ బ్లాక్ అనే 9 రంగుల్లో లభిస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు 1.2 లీటర్, 4 సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. పెట్రోల్, CNG వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌టర్ పెట్రోల్ ఇంజిన్ 81.8bhp శక్తి, 113Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNG వెర్షన్‌లో 67.7bhp శక్తి, 95.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV పెట్రోల్ వెర్షన్ 5- స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. CNG వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌టర్ పెట్రోల్ వెర్షన్ మాన్యువల్ గేర్‌బాక్స్ 19.4kmpl మైలేజీని ఇస్తుంది. అదే ఆటోమేటిక్ టాన్స్‌మిషన్ వేరియంట్ 19.2kmpl మైలేజీని ఇస్తుంది. మరియు CNG వేరియంట్ 27.1kmpl మైలేజీని అందిస్తుంది.
హ్యుందాయ్ SUVలో డ్యాష్‌క్యామ్, షార్క్ ఫిన్ యాంటెనా, వైర్‌లెట్ ఛార్జింగ్ ప్యాడ్, పుట్‌వెల్ లైటింగ్, పాడిల్ షిప్టర్లు, ఆన్‌బోర్డు నావిగేషన్ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నయి. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా కొన్ని ఫీచర్లను ఎక్స్‌టర్ కలిగి ఉంది. దీంతోపాటు 4.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఎక్స్‌టర్ సొంతం.

దీంతోపాటు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్, వెనుక AC వెంట్‌లు, డ్రైవర్, ప్యాసింజర్ సహా సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉన్న తొలి మైక్రో ఎస్‌యూవీగా ఎక్స్‌టర్ ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), VSM, హిల్ అసిస్ట్ కంట్రోల్ సహా 26 సెక్యురిటీ ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








