Hyundai Exter కావాలంటే సంవత్సరం వరకు ఆగాల్సిందే.. ఈ కారు ఎందుకంత ప్రత్యేకం..!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఇటీవల భారత్ మార్కెట్‌లో ఎక్స్‌టర్ మైక్రో SUVను విడుదల చేసింది. మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్ ఇతర సంస్థలకు గట్టిపోటీనిచ్చే విధంగా ఈ కారును లాంచ్ చేసింది. ఎక్స్‌టర్ కారు ప్రారంభ ధర రూ.5,99,900 (ఎక్స్‌షోరూం). కొత్త హ్యుందాయ్ రాకతోనే భారీగా వినియోగదారులను ఆకర్షించింది.
ప్రస్తుతం ఎక్స్‌టర్ మైక్రో SUVకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ కారు 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి EX, EX(O), S, S(O), SX, SX(O), మరియు SX(O) వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్‌టర్ EX, EX(o) వేరియంట్‌ల వెయిటింగ్ పీరియడ్ 1 సంవత్సరం వరకు ఉంది. ఇతర వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ 5 నుంచి 6 నెలల వరకు ఉంది.

ఇటీవలే భారత్ మార్కెట్‌లోకి వచ్చిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV... టాటా పంచ్, సిట్రోయెన్ C3, మారుతి ఇగ్నిస్ వంటి కార్లతో పోటీ పడుతోంది. తమిళనాడు శ్రీపెరంబదూరులోని హ్యుందాయ్ కార్ల తయారీ ప్లాంట్‌లో ఎక్స్‌టర్ మైక్రో SUV కార్ల ఉత్పత్తి ప్రారంభమైంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు 1.2 లీటర్, 4 సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. పెట్రోల్, CNG వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌టర్ పెట్రోల్ ఇంజిన్ 81.8bhp శక్తి, 113Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNG వెర్షన్‌లో 67.7bhp శక్తి, 95.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV పెట్రోల్ వెర్షన్ 5- స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. CNG వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌టర్ పెట్రోల్ వెర్షన్ మాన్యువల్ గేర్‌బాక్స్ 19.4kmpl మైలేజీని ఇస్తుంది. అదే ఆటోమేటిక్ టాన్స్‌మిషన్ వేరియంట్ 19.2kmpl మైలేజీని ఇస్తుంది. మరియు CNG వేరియంట్ 27.1kmpl మైలేజీని అందిస్తుంది.
ఈ కారు డిజైన్ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది. కారు ఫ్రంట్‌లో పారామెట్రిక్ ఫ్రంట్ గిల్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్‌లు, LED DRL క్లామ్‌షెల్ బానెట్, H ఆకారంలో ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. సైడ్ డిజైన్ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

హ్యుందాయ్ SUVలో డ్యాష్‌క్యామ్, షార్క్ ఫిన్ యాంటెనా, వైర్‌లెట్ ఛార్జింగ్ ప్యాడ్, పుట్‌వెల్ లైటింగ్, పాడిల్ షిప్టర్లు, ఆన్‌బోర్డు నావిగేషన్ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నయి. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా కొన్ని ఫీచర్లను ఎక్స్‌టర్ కలిగి ఉంది. దీంతోపాటు 4.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిండ్ ఆటోతో కూడిన 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఎక్స్‌టర్ సొంతం.
దీంతోపాటు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్, వెనుక AC వెంట్‌లు, డ్రైవర్, ప్యాసింజర్ సహా సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉన్న తొలి మైక్రో ఎస్‌యూవీగా ఎక్స్‌టర్ ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), VSM, హిల్ అసిస్ట్ కంట్రోల్ సహా 26 సెక్యురిటీ ఫీచర్లను కలిగి ఉంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ 6 మోనోటోన్ మరియు 3 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లతో అందించబడుతుంది. ఇందులో కస్టమర్లు తమకు నచ్చిన రంగులను ఎంచుకోవచ్చు. ఈ కారు ప్రారంభంతోనే ధర, డిజైన్, ఫీచర్ల పరంగా భారీగా వినియోగదారులను ఆకట్టుకుంది. ఈ సెగ్మెంట్‌లో ఇతర కార్లకు కచ్చితంగా గట్టిపోటీ ఇవ్వనుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైక్రో SUV బేస్ వేరియంట్ EX ధర రూ.5.99 లక్షలు, EX(O) ధర రూ.6.25 లక్షలు, S ధర రూ.7.27 లక్షలు, S(O) ధర రూ.7.42 లక్షలు, SX ధర రూ.8 లక్షలు, SX(O) ధర రూ.8.64 లక్షలు, మరియు SX(O) మరో వేరియంట్ ధర 9.32 లక్షలు. అన్ని ధరలు ఎక్స్‌షోరూంగా ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








