Hyundai Exterకు 9 నెలల వెయిటింగ్‌ పిరియడ్‌..ఈ కారు ‌ప్రత్యేకతేేంటి?

భారత్‌ మార్కెట్‌లో హ్యుందాయ్‌ సంస్థ కొన్ని నెలల క్రితం Hyundai Exter మైక్రో ఎస్‌యూవీని విడుదల చేసింది. అప్పటి నుంచే ఈ కారు బాగా ఆకట్టుకుంది. కారు డిజైన్‌, ధర, ఫీచర్లు ఆకర్షించాయి. ఫలితంగా భారీగా డిమాండ్‌ ఏర్పడింది. దీంతో వెయిటింగ్‌ పిరియడ్‌ రోజురోజుకు పెరుగుతోంది.

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ మైక్రో ఎస్‌యూవీ బుకింగ్‌లు ప్రారంభం అయిన తొలి 30 రోజుల్లో 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను సొంతం చేస్తుంది. అనంతరం మరికొన్ని రోజులకే 75 వేల ఆర్డర్లు పొందింది. భారీ డిమాండ్‌ నేపథ్యంలో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌టర్‌ కార్ల ఉత్పత్తిని 30 శాతం పెంచింది. ఈ కారు పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Hyundai Exter Micro SUV waiting period

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ కారు ప్రారంభ ధర రూ.5,99,900 (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ కారు EX, S, SX, SX(O), మరియు SX(O) వేరియంట్లలో లభిస్తుంది. ఎంట్రీ లెవల్‌ మోడళ్లు EX, Sల వెయిటింగ్ పిరియడ్ 9 నెలలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్లు SX, SX(o) 4-5 నెలల వెయిటిండ్‌ పిరియడ్‌ ఉంది. మొత్తం బుకింగుల్లో మూడింట ఒక వంత మంది కస్టమర్లు ఆటోమేటిక్‌ వేరియంట్‌ను బుకింగ్‌ చేసుకుంటున్నారని సంస్థ తెలిపింది.

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ కారు 1.2 లీటర్‌, 4 సిలిండర్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. పెట్రోల్‌, CNG వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌టర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 81.8bhp శక్తి, 113Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNG వెర్షన్‌లో 67.7bhp శక్తి, 95.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Hyundai Exter Micro SUV waiting period

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ మైక్రో SUV పెట్రోల్‌ వెర్షన్‌ 5- స్పీడ్‌ మాన్యువల్‌ లేదా AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. CNG వేరియంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌టర్‌ పెట్రోల్‌ వెర్షన్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ 19.4kmpl మైలేజీని ఇస్తుంది. అదే ఆటోమేటిక్‌ టాన్స్‌మిషన్‌ వేరియంట్‌ 19.2kmpl మైలేజీని ఇస్తుంది. మరియు CNG వేరియంట్‌ 27.1kmpl మైలేజీని అందిస్తుంది.

హ్యుందాయ్‌ SUVలో డ్యాష్‌క్యామ్‌, షార్క్ ఫిన్ యాంటెనా, వైర్‌లెట్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌, పుట్‌వెల్‌ లైటింగ్‌, పాడిల్‌ షిప్టర్లు, ఆన్‌బోర్డు నావిగేషన్‌ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నయి. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా కొన్ని ఫీచర్లను ఎక్స్‌టర్‌ కలిగి ఉంది. దీంతోపాటు 4.2 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోతో కూడిన 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్‌ ఎక్స్‌టర్‌ సొంతం.

Hyundai Exter Micro SUV waiting period

దీంతోపాటు ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, పుష్‌ బటన్‌ స్టార్ట్‌, వెనుక AC వెంట్‌లు, డ్రైవర్‌, ప్యాసింజర్‌ సహా సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉన్న తొలి మైక్రో ఎస్‌యూవీగా ఎక్స్‌టర్‌ ఉంది. ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ESC), VSM, హిల్‌ అసిస్ట్‌ కంట్రోల్‌ సహా 26 సెక్యురిటీ ఫీచర్లను కలిగి ఉంది.

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ మైక్రో SUV బేస్ వేరియంట్‌ EX ధర రూ.5.99 లక్షలు, EX(O) ధర రూ.6.25 లక్షలు, S ధర రూ.7.27 లక్షలు, S(O) ధర రూ.7.42 లక్షలు, SX ధర రూ.8 లక్షలు, SX(O) ధర రూ.8.64 లక్షలు, మరియు SX(O) మరో వేరియంట్‌ ధర 9.32 లక్షలు. అన్ని ధరలు ఎక్స్‌షోరూంగా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Saturday, September 30, 2023, 11:21 [IST]
English summary
Hyundai exter micro suv waiting period extends upto 9 months
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+