మంచి మైలేజ్ ఇచ్చే డీజిల్ కారు నిలిపివేత..ఎందుకో తెలుసా..?
హ్యుందాయ్ నుంచి ఇకపై i20 డీజిల్ ఇంజన్ కార్లను భారత్ లో నిలిపివేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. డీజిల్ హ్యాచ్ బ్యాక్ లకు తగ్గుతున్న డిమాండ్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త BS6 ఫేజ్ 2 నిబంధనలకు మార్పుతో ఈ చర్యకు పూనుకున్నట్లు వివరించింది. కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా పెట్రోల్ ఇంజన్ లు అప్‌గ్రేడ్ చేయనున్నట్లు హ్యుందాయ్ పేర్కొంది.
తక్కువ ధరలో దేశంలో విక్రయించబడే కార్లలో హ్యుందాయ్ కూడా ఉంది. అయితే డీజిల్ హ్యాచ్ బ్యాక్ లలో డీజిల్ వేరియంట్ ను ఇకపై చూడబోము. అలానే కంపెనీ తన వెబ్‌సైట్ లో i20 డీజిల్ వేరియంట్ లకు సంబంధించి ఆర్డర్ ఆప్షన్ ను తొలగించింది. డీలర్ షిప్ లు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి.

అప్ గ్రేడ్ వెర్షన్ తో..
డీజిల్ వేరియంట్ లను తొలగించడమే కాకుండా, హ్యుందాయ్ ఐ20 పెట్రోల్ వెర్షన్‌లు అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్ లను పొందుతాయని చెప్పింది. నూతన ప్రమాణాల ప్రకారం BS6 ఫేజ్ 2, RDE నియమాలకు అనుగుణంగా 1.2-లీటర్ సహజ ఆస్పిరిటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ తో ఇప్పుడు కార్లు వస్తున్నాయి. రెండు ఇంజన్లలో పవర్ ఫ్రంట్ లో ఎటువంటి మార్పులు లేవని సంస్థ తెలిపింది.
1.2 మోటార్ 82 bhp వద్ద 115 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలానే 1.0 టర్బో ఇంజన్ 118 bhp వద్ద 172 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 1.2-లీటర్ వెర్షన్ లో 5-స్పీడ్ మాన్యువల్, CVT టర్బో పెట్రోల్‌పై 7-స్పీడ్ DCT రానున్నాయి. హ్యుందాయ్ ఈ సంవత్సరం ప్రారంభంలో i20లో 1.0 IMTని నిలిపివేసింది.
మైలేజ్ లో తోపు..
i20 డీజిల్ 1.5-లీటర్ నాలుగు-సిలిండర్ ఆయిల్ బర్నర్ తో శక్తిని పొందుతుంది. ఈ మోటార్ 99 bhp వద్ద 240 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పని చేస్తుంది. i20 డీజిల్ వెర్షన్ లీటర్ కు 25.2 కిలో మీటర్ల మైలేజ్ ను అందిస్తుంది. ప్రత్యేకించి ఇది సమర్థవంతమైనదిగా ప్రసిద్ధి చెందింది.
కొత్త ఉద్గార నిబంధనల ప్రకారం అప్‌గ్రేడ్ చేయబడిన హ్యుందాయ్ వెన్యూ ఫేస్ లిఫ్ట్ లో ఇదే స్థాయి మైలేజ్ ఇవ్వనుంది. i20 డీజిల్ నిలిపివేయడంతో దేశంలో ప్రస్తుతం విక్రయించబడుతున్న ఏకైక డీజిల్ హ్యాచ్ బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ నిలువనుంది. ఇది కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్ గ్రేడ్ చేయబడింది.

వివిధ ధరల్లో..
హ్యుందాయ్ i20 ఎంట్రీ-లెవల్ 1.2 మాగ్నా ట్రిమ్ ధర 7.19 రూపాయల నుంచి మొదలవుతుంది. టాప్-స్పెక్ 1.2 Asta (O) డ్యూయల్-టోన్ ధర 9.90 లక్షలుగా ఉంది.1.0 టర్బో శ్రేణి Sportz DCT 10.11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. Asta (O) DCT డ్యూయల్-టోన్ ధర 11.83 లక్షలుగా ఉంది. హ్యుందాయ్ i20 N లైన్ ధర 10.16 లక్షల నుంచి 12.27 లక్షల మధ్య ఉంది. పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో దాదాపు ప్రతి ఆటోమొబైల్ కంపెనీ కూడా ఒక ఉత్పత్తిని విక్రయిస్తోంది. భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలు అత్యధికంగా డిమాండ్ ఉండేది. వెన్యూ రాకతో ఈ విభాగంలో పోటీ మరింత బలంగా మారింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్ విపరీతంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది మరియు హ్యుందాయ్ కార్లు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యుందాయ్ కార్లలో ఒకటిగా మారింది.


Click it and Unblock the Notifications








