Hyundai i20 ఫేస్‌లిఫ్ట్‌ కారు గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..!

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అప్‌డేట్‌ చేసిన హ్యుందాయ్‌ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కారును విడుదల చేసింది. ఈ తాజా వెర్షన్‌లో డిజైన్‌, ఫీచర్లు, భద్రతా ఫీచర్లను అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ కారు ధర 6.99 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. దేశంలో అత్యధికంగా విక్రయాలు నమోదుచేసిన హ్యాచ్‌బ్యాక్‌లలో i20 ఒకటిగా ఉంది. ఈ కారు గురించి తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలున్నాయి.

ధర హ్యుందాయ్‌ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ఫేస్‌లిఫ్ట్‌ ధరలు రూ.6.99 లక్షల (ఎక్స్‌షోరూం) నుంచి రూ.9.98 లక్షలు (ఎక్స్‌షోరూం) వరకు ఉంటుంది. ఈ ధరలు మాన్యువల్‌ గేర్‌బాక్స్‌కు సంబంధించివి, ఆటోమేటిక్‌ వేరియంట్‌ల ధర రూ.9.38 లక్షల నుంచి రూ.11.01 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.

Hyundai i20 Premium hatchback facelift

ఫేస్‌లిఫ్ట్‌ హ్యుందాయ్‌ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ డిజైన్‌ పాత హ్యాచ్‌బ్యాక్‌ కార్ల మాదిరిగానే ఉంటుంది. అయితే తాజా వెర్షన్‌లో LED హెడ్‌లైట్లు, అప్‌డేట్‌ చేసిన ఫ్రంట్‌, వెనుక బంపర్‌లు, సరికొత్త అల్లాయ్‌ వీల్స్‌తో రానుంది. దాంతోపాటు మరికొన్ని కీలక మార్పులు చేశారు.

తాజాగా విడుదల చేసిన హ్యుందాయ్‌ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ 1.2 లీటర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 6000 rpm వద్ద 81.9bhp శక్తి, 4200 rpm వద్ద 117Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT ట్రాన్స్‌మిషన్‌తో కూడిన హ్యుందాయ్‌ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ 6000rpm వద్ద 86.8 bhp శక్తి, 4200 rpm వద్ద 117Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Hyundai i20 Premium hatchback facelift

ఈ హ్యాచ్‌బ్యాక్‌ కీలక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ అసిస్ట్‌ కంట్రోల్‌, వెహికల్‌ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌, యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ డిస్ట్రిబ్యూషన్‌, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌, బర్గ్లర్‌ అలారం, ఎమర్జెన్సీ స్టాప్‌ సిగ్నల్‌, రియర్‌వ్యూ పార్కింగ్‌ కెమెరా, టైర్‌ ప్రజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, హెడ్‌ల్యాంప్ ఎస్కార్ట్‌ ఫంక్షన్‌, ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్‌లు సహా మరిన్ని సేఫ్టీ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

ఫేస్‌లిఫ్ట్‌ హ్యుందాయ్‌ i20 హ్యాచ్‌బ్యాక్‌లో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌, కూల్డ్‌ గ్లోవ్‌బాక్స్‌, నావిగేషన్‌, 120W ఛార్జింగ్‌ పోర్ట్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, 7- స్పీకర్‌ Bose మ్యూజిక్‌ సిస్టమ్‌, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Hyundai i20 Premium hatchback facelift

దీంతోపాటు 52 ఇంగ్లీష్‌ కమాండ్‌లు, ఓవర్‌ ది ఎయిర్‌ అప్‌డేట్‌లు, 10 ప్రాంతీయ, 2 అంతర్జాతీయ భాషలకు UI సపోర్టు చేస్తుంది. దీంతోపాటు C-టైప్‌ ఛార్జర్‌ సహా 60కి పైగా కార్‌ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. వారంటీ పరంగా కొత్త హ్యుందాయ్‌ i20 3 సంవత్సరాలు / 1,00,000 కిలోమీటర్ల వారంటీతో వస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, September 9, 2023, 13:04 [IST]
English summary
Hyundai i20 premium hatchback facelift launched here are the 5 specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+