కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు - వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ దేశీయ మార్కెట్లో తన ఐ20 ధరలను గరిష్టంగా రూ. 21,000 వరకు పెంచినట్లు తెలిపింది. ఈ కొత్త సంవత్సరం కంపెనీ తన ఐ20 ధరలను పెంచడం ఇదే మొదటి సారి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు

హ్యుందాయ్ ఐ20 యొక్క అన్ని i20 టర్బో మరియు N లైన్ వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 21,500 మరియు రూ. 16,500 చొప్పున పెంచింది. అయితే 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో కూడిన మాగ్నా మరియు స్పోర్ట్జ్ ట్రిమ్స్ ధరలు రూ. 11,500 వరకు పెరిగాయి. అదే సమయంలో ఆస్టా మరియు ఆస్టా (ఓ) ట్రిమ్‌ ధరలు రూ. 16,600 వరకు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.

కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు
Hyundai i20 New Price
Variants New Prices Old Prices Differences
Magna 1.2 MT ₹7.18 Lakh ₹7.07 Lakh ₹11,500
Sportz 1.2 MT ₹8.09 Lakh ₹7.97 Lakh ₹11,500
Asta 1.2 MT ₹9.01 Lakh ₹8.84 Lakh ₹16,600
Sportz 1.2 iVT ₹9.11 Lakh ₹8.99 Lakh ₹11,500
Asta (O) 1.2 MT ₹9.75 Lakh ₹9.58 Lakh ₹16,600
Sportz 1.0 DCT ₹10.11 Lakh ₹9.90 Lakh ₹21,500
Asta 1.2 iVT ₹10.77 Lakh ₹10.60 Lakh ₹16,600
Asta (O) 1.0 DCT ₹11.68 Lakh ₹11.47 Lakh ₹21,500
N Line N6 iMT ₹10.16 Lakh ₹10.00 Lakh ₹16,500
N Line N8 iMT ₹11.19 Lakh ₹11.02 Lakh ₹16,500
N Line N8 DCT ₹12.12 Lakh ₹11.96 Lakh ₹16,500
కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు

కంపెనీ యొక్క N లైన్ N6 iMT, N లైన్ N8 iMT మరియు N లైన్ N8 DCT ధరలు రూ. 16,500 వరకు పెంచబడ్డాయి. గరిష్టంగా ఐ20 యొక్క స్పోర్ట్స్ 1.0 DCT వేరియంట్ ధర రూ. 21,000 పెరిగింది. ధరల పెరుగుదలకు ముందు మాగ్నా 1.2 MT ధర రూ. రూ. 7.07 లక్షలు, కాగా స్పోర్ట్స్ 1.0 DCT వేరియంట్ ధర రూ. 9.90 లక్షలు.

కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు

ధరల పెరుగుదల తరువాత ఐ20 ఆస్టా (ఓ) 1.0 DCT ధర రూ. 11.68 లక్షలకు చేరింది. కంపెనీ ప్రస్తుతం కేవలం ధరల పెరుగుదలతో పాటు కొన్ని వేరియంట్స్ కూడా నిలిపివేసింది. ఇందులో భాగంగానే హ్యుందాయ్ i20 యొక్క టర్బో వేరియంట్‌లలో 6-స్పీడ్ iMT గేర్‌బాక్స్‌ వేరియంట్ నిలిపివేయబడింది. కావున ఈ వేరియంట్స్ డ్యూయల్-క్లచ్ (DCT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు

హ్యుందాయ్ ఐ20 N లైన్ iMT గేర్‌బాక్స్ ఆప్సన్ తో విక్రయించబడుతూ ఉంటుంది. హ్యుందాయ్ i20 రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి 83 hp పవర్ మరియు 114.7 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, మరొకటి 120 hp పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్. ఇవి రెండూ మంచి పనితీరుని అందిస్తాయి.

కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు

హ్యుందాయ్ కంపెనీ యొక్క ఐ20 ఎన్-లైన్ దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో భాగంగానే గతంలోనే థండర్ బ్లూ, టైటాన్ గ్రే, పోలార్ వైట్ మరియు కొత్త స్టార్రీ నైట్ కలర్ ఆప్సన్స్ తో మాత్రమే కాకుండా ఫైరీ రెడ్ సింగిల్-టోన్ కలర్ ఆప్సన్స్ లో కూడా పరిచయం చేసింది. అయితే ఇప్పుడు ధరల పెరుగుదలకు అడుగులు ముందుకు వేసింది.

కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు

2023 లో ధరల పెరుగుదల చేసిన కంపెనీలో హ్యుందాయ్ కూడా ఒకటిగా ఉంది. అయితే ఈ కొత్త సంవత్సరంలో మరియు రానున్న పండుగల సీజన్లలో ధరల పెరుగుదల వల్ల అమ్మకాలు తగ్గుతాయా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే మహీంద్రా వంటి కంపెనీలు కూడా ఉత్పత్తుల ధరలను అమాంతంగా పెంచింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 31, 2023, 16:30 [IST]
English summary
Hyundai i20 prices hiked details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+