ఇకపై ప్రతి హ్యుందాయ్‌ కారులోనూ 6 ఎయిర్‌ బ్యాగులు.. ప్రత్యర్థి కంపెనీలకు ఇక గట్టి పోటీ.!!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌.. కస్టమర్ల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ కార్లన్నిటిలోనూ 6 ఎయిర్‌బ్యాగులను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఇటీవల క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో హ్యూందాయ్‌ ఈ చర్య తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్(Hyundai) చాలా ఏళ్లుగా దేశంలో వాహనాలను తయారు చేస్తోంది. మెరుగైన పనితీరు, అద్భుతమైన ఫీచర్లతో హ్యుందాయ్‌.. కస్టమర్లలో విపరీతమైన ఆదరణ పొందుతోంది. అందుకే భారత్‌లో కార్ల విక్రయాల్లో కంపెనీ రెండో స్థానంలో ఉంది. హ్యుందాయ్‌కి ఎప్పుడూ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది.

Hyundai-Verna

రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో విక్రయించే కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌(6 Airbags)లను అమర్చాలని కార్ల తయారీదారులకు కండిషన్‌ పెట్టింది. అత్యధిక భద్రతా ఫీచర్లు ఉన్న కార్లకు అదనపు పాయింట్లు లభిస్తాయని తెలిపింది. దీనికి అనుగుణంగా, హ్యుందాయ్ తన అన్ని కార్లలో 6 ఎయిర్ బ్యాగ్‌లను తప్పనిసరి చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్లలో 6 ఎయిర్‌ బ్యాగులతో పాటు ESC, హిల్ అసిస్ట్, 3-పాయింట్ సీట్ బెల్ట్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ మరియు వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ ఫీచర్లు తప్పనిసరి. కాగా ఇటీవలే హ్యుందాయ్‌ కంపెనీ i20 ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని బేస్ వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నట్లు ప్రకటించింది.

Hyundai-Verna

ఇటీవల జరిగిన గ్లోబల్ NCAP క్రాష్‌ టెస్ట్‌లో హ్యుందాయ్ కొత్త కారు వెర్నా(Hyundai Verna) 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. అదేవిధంగా హ్యుందాయ్ Xter(Hyundai Xter) కూడా తన అద్భుతమైన పనితీరుతో 5 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. కాగా త్వరలో హ్యుందాయ్‌ Xter ఈ కారు భారత్ NCAP క్రాష్‌ టెస్ట్‌లో పాల్గొననుంది.

హ్యుందాయ్‌ వెన్యూ కారులో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నారు. ఈ కారులో ADAS సిస్టమ్, కొలిజన్ వార్నింగ్, ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ మానిటరింగ్, హై-బీమ్ అసిస్ట్, ఇంకా పలు సేఫ్టీ ఫీచర్లను ప్రవేశపెట్టింది.

Hyundai-Creta

కొత్త హ్యుందాయ్ వెన్యూ(Hyundai Venue).. సబ్-4 మీటర్ల SUV సెగ్మెంట్‌లో అటాస్ యాక్టివ్ సేఫ్టీ సూట్‌ను కలిగి ఉన్న మొదటి కారు కావడం చెప్పుకోదగినది. హ్యుందాయ్ క్రెటాలో కూడా కంపెనీ ఈ ఫీచర్‌ను అందించింది. కానీ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే ఆ విభాగంలో అదే లక్షణాలను కలిగి ఉండటం విశేషం.

ఇక హ్యుందాయ్ i20 నియోస్ మరియు ఆరా వెర్షన్ల విషయానికొస్తే.. ఇందులో 1.2-లీటర్ కప్పా 4-సిలిండర్ న్యాచురల్లీ అస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తిని పొందుతున్నాయి. ఇది 82 బీహెచ్‌పీ పవర్ వద్ద 114 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కారు సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

Hyundai-Creta

హ్యుందాయ్ వెన్యూ వెర్షన్‌లు 1.2-లీటర్ కప్పా ఇంజిన్, 1.0-లీటర్ GTA 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. ఈ ఇంజిన్ 118 బీహెచ్‌పీ పవర్ వద్ద 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

ఈ వెన్యూలో 1.5 లీటర్‌ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా హ్యూందాయ్‌ అందించింది. టర్బో డీజిల్ ఇంజన్ విషయానికొస్తే, ఇది 114 bhp శక్తిని మరియు 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఈ డీజిల్ ఇంజిన్ కారులో 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను అందించలేదు.

దేశీయ మార్కెట్లో హై సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్ల కోసం డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో.. హ్యుందాయ్ తన కార్లలో మరిన్ని భద్రతా ఫీచర్లను జోడించడం శుభ పరిణామం. ప్రస్తుతం టాటా కంపెనీ అత్యంత సురక్షితమైన కార్లను విక్రయిస్తోంది. త్వరలో ఆ జాబితాలో హ్యుందాయ్ సంస్థ కూడా చేరనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 2, 2023, 9:46 [IST]
English summary
Hyundai implementing 6 airbags mandatory for all cars full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+