ఐయోనిక్ 5 లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన హ్యుందాయ్.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ కారు 'ఐయోనిక్ 5' విడుదల గురించి అధికారికంగా వెల్లడించి. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఐయోనిక్ 5 లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన హ్యుందాయ్.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

ఈ నెలలో ఎంతో అట్టహాసంగా జరగనున్న '2023 ఆటో ఎక్స్‌పో' లో హ్యుందాయ్ కంపెనీ యొక్క ఐయోనిక్ 5 విడుదల కానుంది. అంటే ఈ కారు జనవరి 11 న అధికారికంగా మార్కెట్లో విడుదల కానుంది. కంపెనీ ఇప్పటికే గత సంవత్సరం చివరిలో (2022 డిసెంబర్) దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది.

ఐయోనిక్ 5 లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన హ్యుందాయ్.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 1 లక్ష చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. అంతే కాకుండా కంపెనీ ఈ కారు యొక్క ధరలను కూడా ఈ నెలలో లాంచ్ సమయంలో వెల్లడించే అవకాశం ఉంటుంది.

ఐయోనిక్ 5 లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన హ్యుందాయ్.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ ఐయోనిక్ 5 CKD (కంప్లీట్ నాక్డ్ డౌన్) గా వస్తుంది మరియు భారతదేశంలో స్థానికంగా అసెంబ్లింగ్ చేయబడుతుంది. కావున ధర CBU (కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్) గా విడుదల చేయబడిన Kia EV6 ఎలక్ట్రిక్ SUV కంటే తక్కువగా ఉంటుంది. కంపెనీ ఈ కొత్త ఐయోనిక్ 5 ని రూ. 45 లక్షల నుంచి రూ. 50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదల చేసే అవకాశం ఉంటుంది.

ఐయోనిక్ 5 లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన హ్యుందాయ్.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) పై ఆధారపడి ఉంటుంది. ఈ లేటెస్ట్ వెహికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్‌లతో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు మరియు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు రేక్డ్ రియర్ విండ్‌షీల్డ్ వంటివి కూడా ఉన్నాయి.

ఐయోనిక్ 5 లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన హ్యుందాయ్.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపల డార్క్ పెబుల్ గ్రే ఇంటీరియర్ థీమ్, స్లైడింగ్ సెంటర్ కన్సోల్, స్లైడింగ్ గ్లోవ్-బాక్స్, లెవెల్ 2 ADAS వంటి వాటితో పాటు రెండు 12.3 ఇంచెస్ స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్‌) ఉన్నాయి.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 వెహికల్ టు లోడ్ టెక్నాలజీ, ఎనిమిది-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, మూవబుల్ సెంటర్ కన్సోల్‌ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఐయోనిక్ 5 లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన హ్యుందాయ్.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న హ్యుందాయ్ ఐయోనిక్ 5 కొలతల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. దీని పొడవు 4,635 మిమీ, వెడల్పు 1,890 మిమీ, ఎత్తు 1,625 మిమీ మరియు వీల్‌బేస్ 3,000 మిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ కారు మాట్ గ్రావిటీ గోల్డ్, ఆప్టిక్ వైట్ మరియు మిడ్నైట్ బ్లాక్ పెర్ల్ అనే మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి రానుంది.

ఐయోనిక్ 5 లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన హ్యుందాయ్.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

హ్యుందాయ్ కంపెనీ తన ఐయోనిక్ 5 యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 72.6kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 214 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 631 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. అయితే ఇది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 350kw DC ఛార్జర్‌ ద్వారా 18 నిముషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

ఐయోనిక్ 5 లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన హ్యుందాయ్.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, డిస్క్ బ్రేక్‌లు మరియు లేన్ ఫాలో అసిస్ట్, లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వంటి ADAS ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

ఐయోనిక్ 5 లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన హ్యుందాయ్.. ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఇప్పటికే ఇది 2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు వరల్డ్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ మరియు వరల్డ్ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. కావున తప్పకుండా భారతీయ మార్కెట్లో ఇది మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము. అంతే కాకుండా కంపెనీ 2023 ఆటో ఎక్స్‌పోలో ఐయోనిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్‌ను కూడా ప్రదర్శిస్తుంది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త ఐయోనిక్ 5 గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, January 6, 2023, 9:53 [IST]
English summary
Hyundai ioniq 5 launch date revealed details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+