ఆటో ఎక్స్‌పో 2023: హ్యుందాయ్ ఐయోనిక్ 5 ధరలు తెలిసిపోయాయ్

హ్యుందాయ్ ఐయోనిక్ 5 కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లకు ఎట్టకేలకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే కంపెనీ ఈ లేటెస్ట్ 'ఐయోనిక్ 5' ఎలక్ట్రిక్ కారుని 2023 ఆటో ఎక్స్‌పోలో అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ ఐయోనిక్ 5 గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

హ్యుందాయ్ కంపెనీ తన 'ఐయోనిక్ 5' ఎలక్ట్రిక్ కారుని రూ. 44.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదల చేసింది. ఈ ధరలు మొదటి 500 మంది కస్టమర్లలకు మాత్రమే వర్తిస్తాయి. కావున మొదట్లో కొనుగోలు చేసే 500 మంది కష్టమరలకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయి. ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ కారు కంపెనీ యొక్క రెండవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న కియా ఈవి6 కంటే రూ 16 లక్షలు తక్కువ.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ధరలు తెలిసిపోయాయ్

హ్యుందాయ్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ కూడా ఇప్పటికే స్వీకరించడం ప్రారంభించింది. కావున ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 1 లక్ష చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. కొత్త హ్యుందాయ్ ఐయోనిక్ 5 మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి గ్రావిటీ గోల్డ్ మ్యాట్, ఆప్టిక్ వైట్ మరియు మిడ్‌నైట్ బ్లాక్ పెర్ల్ కలర్స్. ఇది అద్భుతమైన డిజైన్, అంతకు మించిన అప్డేటెడ్ ఫీచర్స్ పొందింది.

హ్యుందాయ్ కంపెనీ తన ఐయోనిక్ 5 యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 72.6kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 214 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 631 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. అయితే ఇది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 350kw DC ఛార్జర్‌ ద్వారా 18 నిముషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ధరలు తెలిసిపోయాయ్

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) పై ఆధారపడి ఉంటుంది. ఈ లేటెస్ట్ వెహికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్‌లతో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు మరియు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు రేక్డ్ రియర్ విండ్‌షీల్డ్ వంటివి కూడా ఉన్నాయి.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపల డార్క్ పెబుల్ గ్రే ఇంటీరియర్ థీమ్, స్లైడింగ్ సెంటర్ కన్సోల్, స్లైడింగ్ గ్లోవ్-బాక్స్, లెవెల్ 2 ADAS వంటి వాటితో పాటు రెండు 12.3 ఇంచెస్ స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్‌) ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ధరలు తెలిసిపోయాయ్

హ్యుందాయ్ ఐయోనిక్ 5 యొక్క ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, డిస్క్ బ్రేక్‌లు మరియు లేన్ ఫాలో అసిస్ట్, లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వంటి ADAS ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఇందులో ADAS టెక్నలజీ ఉండటం వల్ల మరింత సురక్షితమైన డ్రైవింగ్ పొందవచ్చు.

'హ్యుందాయ్ ఐయోనిక్ 5' గత 2022 లోనే వరల్డ్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ మరియు వరల్డ్ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కియా ఈవి6 కంటే కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉండటం వల్ల తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' ఫై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 11, 2023, 12:56 [IST]
English summary
Hyundai ioniq 5 launched in 2023 auto expo at rs 44 95 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+