హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6.. ధరలు, డిజైన్ మరియు పవర్‌ట్రెయిన్

ఇటీవల అట్టహాసంగా జరిగిన 2023 ఆటో ఎక్స్‌పో లో అనేక కొత్త మోడల్స్ అడుగుపెట్టాయి. ఇందులో హ్యుందాయ్ కంపెనీ తన ఆధునిక ఎలక్ట్రిక్ కారు ఐయోనిక్ 5 విడుదల చేసింది. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న కియా ఈవి 6 కంటే తక్కువ ధర వాడి అందుబాటులో ఉంటుంది.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6.. ధరలు, డిజైన్ మరియు పవర్‌ట్రెయిన్

హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6: ధరలు

హ్యుందాయ్ కంపెనీ తన 'ఐయోనిక్ 5' ఎలక్ట్రిక్ కారుని రూ. 44.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదల చేసింది. ఈ ధరలు మొదటి 500 మంది కస్టమర్లలకు మాత్రమే వర్తిస్తాయి. కావున మొదట్లో కొనుగోలు చేసే 500 మంది కష్టమరలకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయి. ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ కారు కంపెనీ యొక్క రెండవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న కియా ఈవి6 కంటే రూ 16 లక్షలు తక్కువ.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6.. ధరలు, డిజైన్ మరియు పవర్‌ట్రెయిన్

కియా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ కారు EV6 ధర కూడా 2023 జనవరిలో పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 1 లక్ష వరకు పెరిగింది. ధరల పెరుగుదల తరువాత కియా EV6 జిటి లైన్ ఆర్డబ్ల్యుడి ధర రూ. 60.95 లక్షలు, కాగా జిటి లైన్ ఎడబ్ల్యుడి రూ. 65.95 లక్షలు. గతంలో ఈ ధరలు రూ. 59.65 (జిటి లైన్ ఆర్డబ్ల్యుడి) మరియు రూ. 64.95 లక్షలు (జిటి లైన్ ఎడబ్ల్యుడి).

హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6.. ధరలు, డిజైన్ మరియు పవర్‌ట్రెయిన్

హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6: పవర్‌ట్రెయిన్

హ్యుందాయ్ కంపెనీ తన ఐయోనిక్ 5 యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 72.6kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 214 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 631 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. అయితే ఇది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 350kw DC ఛార్జర్‌ ద్వారా 18 నిముషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6.. ధరలు, డిజైన్ మరియు పవర్‌ట్రెయిన్

కియా ఈవి6 ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 528 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని సర్టిఫైడ్ చేయబడింది. దీని కోసం కంపెనీ 77.4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చింది. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. 350 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోగలదు. అదే సమయంలో ఇది 50 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ ద్వారా కేవలం 73 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోగలదు.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6.. ధరలు, డిజైన్ మరియు పవర్‌ట్రెయిన్

హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6: డిజైన్

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) పై ఆధారపడి ఉంటుంది. ఈ లేటెస్ట్ వెహికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్‌లతో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు మరియు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు రేక్డ్ రియర్ విండ్‌షీల్డ్ వంటివి కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6.. ధరలు, డిజైన్ మరియు పవర్‌ట్రెయిన్

కొత్త కియా ఈవి6 అద్భుతమైన డిజైన్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారులో వాలుగా ఉండే రూప్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ లైట్ మరియు పెద్ద రియర్ విండ్‌స్క్రీన్‌ వంటివి ఉంటాయి. ఇక్కడ స్పోర్టీ అల్లాయ్ వీల్స్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. రియర్ ప్రొఫైల్ లో డ్యూయెల్ టోన్ బంపర్, బూట్ లిప్ స్పాయిలర్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6.. ధరలు, డిజైన్ మరియు పవర్‌ట్రెయిన్

హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6: ఫీచర్స్

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపల డార్క్ పెబుల్ గ్రే ఇంటీరియర్ థీమ్, స్లైడింగ్ సెంటర్ కన్సోల్, స్లైడింగ్ గ్లోవ్-బాక్స్, లెవెల్ 2 ADAS వంటి వాటితో పాటు రెండు 12.3 ఇంచెస్ స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్‌) ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 vs కియా ఈవి6.. ధరలు, డిజైన్ మరియు పవర్‌ట్రెయిన్

కియా ఈవి6 ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇవి రెండూ కూడా ఒకే ప్యానెల్ లో అమర్చబడి ఉన్నాయి. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, స్మార్ట్ పవర్ టైల్ గేట్, షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 16, 2023, 13:35 [IST]
English summary
Hyundai ioniq 5 vs kia ev6 comparison range price features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+