తక్కువ ధరలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ కారు విడుదల

భారతదేశంలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సరసమైన హ్యాచ్‌బ్యాక్‌గా మంచి ప్రజాదరణ పొందింది. సరసమైన ధరలో, ఆకర్షణీయమైన ఫీచర్లు, డిజైన్లతో కస్టమర్ల దృష్టిని తమ వైపుకు తిప్పుకోవడంలో హ్యుందాయ్ పంథానే వేరు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్ లో సరికొత్త వేరియంట్‌ ను సంస్థ తీసుకువచ్చింది. ఆ కారు వివరాలు మీకోసం...

రెండు నెలల క్రితం దేశీయ మార్కెట్ లోకి గ్రాండ్ i10 NIOS ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ను హ్యుందాయ్ విడుదల చేసింది. తాజాగా గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ అనే కొత్త వేరియంట్‌ ను పరిచయం చేసింది. మాగ్నా ధర వేరియంట్ కంటే ఎక్కువ స్పోర్ట్జ్ వేరియంట్ కంటే తక్కువగా దీని ప్రైస్ ఉండనుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ట్రిమ్స్ లో ఈ కారు అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ.7.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

అదిరే ఫీచర్లతో..

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ ఈ కారులో తొలగించబడింది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్పోర్ట్జ్ వేరియంట్‌ లో ఈ ఫీచర్ ఉంది. ఈ ఒక్క మార్పు తప్పా మిగతా అన్నీ ఫీచర్స్ ఈ కారులో అందుబాటులో ఉన్నాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, కీలెస్ ఎంట్రీ, అరుదైన AC వెంట్లు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు వంటి అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇక కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ భద్రతా లక్షణాల విషయానికి వస్తే.. ఇది 4 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, హై స్పీడ్ హెచ్చరిక వంటి అధునాతన భద్రతా ప్రమాణాలను ఈ కారు కలిగి ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్

ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్..

ఈ కొత్త వేరియంట్ ఇంజన్ పనితీరులో ఎలాంటి మార్పులు చేయలేదు. 1.2-లీటర్ సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారు పనిచేస్తుంది. 83 bhp వద్ద 114 గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడ్ లో కొనుగోలు చేసేందుకు ఈ కారు అందుబాటులో ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వేరియంట్‌లు రూ. 5.68 లక్షల నుంచి రూ. 8.46 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ధర అందుబాటులో ఉన్నాయి.

గ్రాండ్ i10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ 'మాగ్నా' వేరియంట్ రూ. 6.61 లక్షల ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది డెలివరీకి రెండు నెలల సమయం పడుతుంది. పోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, ఆక్వా టీల్, టైటాన్ గ్రే వంటి ఆరు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. 1197 cc ఇంజన్ గరిష్టంగా 81.80 bhp వద్ద 113.8 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

హ్యుందాయ్ గ్రాండ్

స్పోర్ట్ వేరియంట్..

స్పోర్ట్జ్ వేరియంట్ రూ.7.20 లక్షల ధరతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. పదికి పైగా కొత్త ఫీచర్లను పొందుతుంది. ఇందులో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్ అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్, ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఫ్రంట్ & రియర్ పవర్ విండోస్, వీల్ కవర్లు, ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్, ఇగ్నిస్, టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లకు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ గట్టి పోటీని ఇవ్వనుంది. దీని ధర తక్కువగా ఉండటం వల్ల వినియోగదారులను కచ్చితంగా ఆకర్షిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. డెలివరీ ప్రారంభం అనంతరం ఈ కారు పనితీరు మరింత తెలిసే అవకాశం ఉంది. అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో కారును సొంతం చేసుకోవాలని అనుకునే వారు ఈ కారు కోసం వెయిట్ చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, March 16, 2023, 12:33 [IST]
English summary
Hyundai realese grand i10 nios sportz executive variant full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+