హ్యుందాయ్ వెర్నా క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్.. అడల్ట్స్‌ ప్రొటెక్షన్‌లో భేష్

దేశీయ మార్కెట్లో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న కంపెనీలల్లో ఒకటి హ్యుందాయ్(Hyundai) మోటార్స్. హ్యుందాయ్‌ బ్రాండ్‌కు చెందిన మోడల్స్‌లో వెర్నా(Hyundai Verna) సెడాన్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. తాజాగా గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో సేఫ్టీ విషయంలో హ్యుందాయ్‌ వెర్నా బెస్ట్‌ అని నిరూపించుకుంది.

ఇటీవల, హ్యుందాయ్ వెర్నాకు గ్లోబల్ NCAP(Global NCAP) క్రాష్‌ టెస్ట్‌ జరిగింది. ఈ కారు అడల్ట్‌ సేఫ్టీ విభాగంలో 34కి 28.18 పాయింట్లు సాధించింది. ఇంకా పిల్లల రక్షణ విభాగంలో 49కి 42 పాయింట్లు రావడంతో సేఫ్టీలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సంపాదించి ఔరా అనిపించింది. అయితే 5 స్టార్‌ రేటింగ్ సాధించినప్పటికీ ఈ కారులో గ్లోబల్ NCAP కొన్ని లోపాలను గుర్తించింది.

Hyundai-Verna-Global-NCAP-Crash-Test

హ్యుందాయ్ వెర్నా బాడీ షెల్, ఫుట్‌వెల్ స్థిరంగా లేవని గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో తేలింది. అంతేకాకుండా అధిక భారాన్ని తట్టుకునే శక్తి కూడా హ్యుందాయ్‌ వెర్నా కారుకు లేదని చెబుతున్నారు. అయితే వెర్నాకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ రావడానికి దాని సేఫ్టీ ఫీచర్లు ప్రధానంగా నిలిచాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

అంతే కాకుండా హ్యుందాయ్‌ వెర్నాలో ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ESC (ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, TPMS (టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లతో ఇది 5 స్టార్‌ రేటింగ్‌ను పొందింది.

Hyundai-Verna-Global-NCAP-Crash-Test

ఇంకా ఇది బ్లైండ్-స్పాట్ అలర్ట్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉండటం ప్రత్యేకత. గ్లోబల్‌ NCAP లో ESC పనితీరులో వెర్నాలో పాయింట్లు సాధించింది. గ్లోబల్ NCAP నిబంధనలకు లోబడి ఉంది. ఇంకా ఇది పాదచారుల రక్షణ నిబంధనలను కూడా పాటించింది.

కాగా మిడ్‌సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో వెర్నాతో పాటు, స్లావియా, వర్టస్‌లు కూడా గ్లోబల్ NCAP క్రాష్‌ టెస్ట్‌లో పాల్గొన్నాయి. ఈ మూడు కార్లు 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. మిగతా రెండు కార్లు అడల్ట్‌ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో మెరుగైన ఫలితాలు సాధించడమే కాకుండా.. స్థిరమైన బాడీ షెల్‌ను కూడా కలిగి ఉన్నాయి.

Hyundai-Verna-Global-NCAP-Crash-Test

దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా EX, S మరియు SX వేరియంట్‌లలో లభిస్తుంది. ధర రూ. 10.96 లక్షల నుండి రూ. 17.38 లక్షల(ఎక్స్-షోరూమ్)లో అందుబాటులో ఉంది. టైటాన్ గ్రే, టెల్లూరియన్ బ్రౌన్, టైఫూన్ సిల్వర్, ఫియరీ రెడ్, అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, స్టార్రీ నైట్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

హ్యుందాయ్ వెర్నా డ్యూయల్ స్క్రీన్ సెటప్ (10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే) ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది.

హ్యుందాయ్‌ వెర్నా రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.5 లీటర్ టర్బోచార్జ్‌డ్‌, పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 160 PS శక్తిని మరియు 253 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్‌ వెర్నా 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

మరొక ఇంజిన్‌ 1.5-లీటర్ న్యాచురల్లీ అస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్, గరిష్ఠంగా 115 PS శక్తిని, 144 Nm గరిష్ఠ టార్క్‌ను విడుదల చేస్తుంది. 6 స్వీడన్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. హ్యుందాయ్‌ వెర్నా వేరియంట్‌లను బట్టి 18.6 - 20.6 kmpl మైలేజ్‌ని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 4, 2023, 9:30 [IST]
English summary
Hyundai verna scores 5 star rating in global ncap crash test
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+