కార్లను అమెజాన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.. త్వరలో ఆ కార్లకు అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్!!
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో (Amazon) అందరికీ అవసరం అయిన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువుల వరకు అన్నింటిని అమెజాన్ సంస్థ డెలివరీ చేస్తోంది. అయితే గురువారం అమెజాన్ సంస్థ కీలక ప్రకటన చేసింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా కార్లను కూడా కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌తో కలిసి అమెజాన్ (Amazon and hyundai) ఈ ప్రకటన చేసింది. వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో హ్యుందాయ్ వాహనాలను అమెజాన్ ప్లాట్‌ఫాం ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని... హ్యుందాయ్, అమెజాన్ సంయుక్త ప్రకటన చేశాయి. కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది.

హ్యుందాయ్ కార్లలో అలెక్సా : తర్వాత జెనరేషన్ వాహనాలు అలెక్సాను కూడా సపోర్టు చేస్తాయని తెలుస్తోంది. అమెజాన్, హ్యుందాయ్‌ల తాజా నిర్ణయం వినియోగదారుల అనుభవాలను మెరుగుపరిచేందుకు, వ్యాపార కార్యకలాపాల శైలిని మార్చడంలో ఉపయోగపడతాయని అమెజాన్ సీఈవో అండీ జాస్సి X (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
హ్యుందాయ్ డిజిటల్ షోరూం: అమెజాన్, హ్యుందాయ్‌ల మధ్య డిజిటల్ షోరూం ఒప్పందం రెండు సంవత్సరాల ముందు కుదిరినట్లు తెలుస్తోంది. దీని ద్వారా అమెజాన్ వినియోగదారులు హ్యుందాయ్ కార్ల ధర సహా ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు మరియు సమీపంలోని డీలర్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ తన మొదటి డిజిటల్ షోరూంను 2018 సంవత్సరంలో అమెజాన్‌లో ప్రారంభానికి తొలి అడుగులు పడినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజిల్స్ ఆటోషోలో తాజా నిర్ణయాన్ని ప్రకటన చేసింది. దీంతోపాటు మరో కీలక ప్రకటన చేసింది. అమెజాన్- హ్యుందాయ్ ఒప్పందంలో భాగంగా 2025 సంవత్సరంలో హ్యుందాయ్ వాహనాల కొనుగోలు దారులు తమ కార్లలో అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుందని తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద కస్టమర్ సెంట్రిక్ సంస్థల్లో ఒకదానితో ఒప్పందం చేసుకోవడం ద్వారా పోర్ట్‌ఫోలియాను విస్తరించడం, సేల్స్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, ఎలక్ట్రిక్ వాహనాలను వైపు తమ లక్ష్యాన్ని మళ్లించడం సహా స్మార్ట్ మొబిలిటీ వంటి అద్భుతమైన అవకాశాలను పొందవచ్చని హ్యుందాయ్ మోటార్స్ సీఈవో జే చాంగ్ వెల్లడించారు.

అమెజాన్ కార్ సేల్స్ సెక్షన్‌లో మోడల్, ట్రిమ్, కలర్, ఫీచర్‌లతో సహా ఇతర ప్రాధాన్యతల ఆధారంగా వారి ప్రాంతాల్లో డెలివరీ తీసుకొనే విధంగా కొనుగోలు చేయవచ్చు. ఇష్టమైన కారును ఎంచుకొని, తక్షణ చెల్లింపు లేదా ఫైనాన్సింగ్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్‌లో ఇప్పటికే : ఆన్‌లైన్‌లోనే వాహనం కొనుగోలు చేసి, డెలివరీ పొందవచ్చు లేదా స్థానిక డీలర్‌షిప్ ద్వారా డెలివరీని కోరవచ్చని అమెజాన్ తెలిపింది. ఇప్పటికే అమెజాన్ కార్లు సహా ఇతర వాహనాలకు సంబంధించి కొన్ని రకాల ఉపకరణాలను (స్పేర్‌పార్ట్స్)ను విక్రయిస్తోంది. మరియు అమెజాన్ వెహికల్ షోరూం సైట్‌ను నిర్వహిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








