Maruti Gypsy EV ఇండియన్ ఆర్మీ ఆలోచనకు ఫిదా అవ్వాల్సిందే.. పాత వాటితో కొత్త ఈవీ వెహికిల్స్ తయారు..!

ఇండియ‌న్ ఆర్మీలో కొత్త వాహనాలు వచ్చి చేరాయి. తాజాగా ఆర్మీలో కొత్త ఎల‌క్ట్రిక్ జిప్సీ(Electric Gypsy) వాహ‌నాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఐఐటీ ఢిల్లీ, ట్యాడ్‌పోల్ ఈవీ స్టార్ట‌ప్‌ల‌తో క‌లిసి వీటని రూపొందించింది. పాత జిప్సీ వాహ‌నాల‌కు ఎల‌క్ట్రిక్ మోటార్లను బిగిస్తూ సరికొత్త జిప్సీ వాహ‌నాలుగ మార్చింది. అధ్బుతమైన లుక్ లో వీటిని తయారు చేశారు ఆ వివరాలు మీకోసం..

భారత సైన్యం కోసం ముఖ్యమైన నూతన విధాన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మరిన్నీ ఉపయోగకరమైన నిర్ణయాలను ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ (ACC)లో తీసుకుంటారు.
ఆర్మీలో ఇది ఒక ఉన్నత-స్థాయి ద్వివార్షిక కార్యక్రమం. ఇందులో సంస్థాగత అభివృద్ధితో పాటు ఇతర అనేక చర్చల్నీ జరపనున్నారు.

maruti gypsy

మొట్టమొదటిసారిగా, అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని హైబ్రిడ్ ఫార్మాట్‌లో ACC నిర్వహణ జరుగుతోంది. ఇందులో ఆర్మీ కమాండర్లు మరియు ఇతర సీనియర్ కార్యకర్తలు మొదటి రోజు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంటారు. అనంతరం వివరణాత్మక చర్చలకు అవసరమయ్యే విషయాలపై చర్చించేందుకు ఢిల్లీకి వెళతారు.

శుక్రవారం నుంచి న్యూఢిల్లీలో జరుగుతున్న ఆర్మీ కమాండర్ల సదస్సులో రెట్రోఫిటెడ్ ఎలక్ట్రిక్ జిప్సీలను ఇండియన్ ఆర్మీ అధికారులు ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ ఆర్మీ సెల్, IIT-ఢిల్లీ మరియు టాడ్‌పోల్ ప్రాజెక్ట్స్ స్టార్టప్ గా పనిచేశాయి. ఇందులో భాగంగా పాత మిలిటరీ జిప్సీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలుగా తయారు చేయబడ్డాయి.

మారుతి జిప్సీ SUV ఇండియన్ ఆర్మీ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్‌లో భాగంగా IIT-ఢిల్లీ ఆధారిత స్టార్టప్ ద్వారా EVలుగా రీట్రోఫిట్ చేయబడింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)-ఢిల్లీ ఆధ్వర్యంలో ఈ స్టార్టప్ EV రెట్రోఫిట్టింగ్‌కు ఇండియన్ ఆర్మీ శ్రీకారం చుట్టింది.. టాడ్‌పోల్ ప్రాజెక్ట్స్ వెబ్‌సైట్ ప్రకారం, పాత ఇంజన్‌ను తొలగించడం వాహనాన్ని ఎలక్ట్రిక్‌గా మార్చడం వంటి పనులను స్టార్ట్-అప్ చేస్తుంది.

ఈ ప్రక్రియలో పాత ఇంజన్ భాగాలను మార్చుకోవడం, తగిన బ్యాటరీ ప్లేస్‌మెంట్ స్పాట్‌లను గుర్తించడం వంటివి చేయనున్నారు. కొన్ని వాహనాల్లో బ్యాటరీలను ఇన్‌స్టాల్ చేయడం అలానే వాటిలో ఉన్న డ్రైవ్‌ట్రెయిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో కనెక్ట్ చేయడం వంటివి చేస్తున్నారు. పనికిరాని పాత ICE వాహనాల జీవితాన్ని మరింత కాలం పొడిగించడానికి ఇది మంచి మార్గంగా ఆర్మీ భావిస్తోంది.

వాహనాలను అలా పాత బడిన తర్వాత మూలకు వేయడానికి బదులుగా, ఇలాంటి EVలుగా రూపకల్పన చేయడం శుభపరిణామంగా చెప్పవచ్చు. అలానే మిలిటరీ ప్రదర్శించిన మారుతి జిప్సీ ఎలక్ట్రిక్ చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఇది జీరో-ఎమిషన్ పవర్ట్రెయిన్లతో ఇప్పటికే ఉన్న వాహనాలను తిరిగి ఉపయోగించడాన్ని సూచిస్తుంది. భారత సైన్యంలో జిప్సీలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. నిమిషాల వ్యవధిలో వాటిని విడదీసి తిరిగి అసెంబ్లింగ్ చేస్తుంది.

అన్ని బ్యాటరీ మాడ్యూల్స్ IP65/67 వద్ద రేట్ చేయబడ్డాయి. 30 కిలోవాట్ల ఈవీ కిట్లు, 1 కిలోవాట్ నుంచి 37 కిలోవాట్ల (49.6 బీహెచ్పీ) ఎలక్ట్రిక్ మోటార్లు అందుబాటులో ఉన్నాయి. దీని ఛార్జింగ్ కోసం 2 నుంచి 6 గంటలు పట్టనుంది. టాడ్ పోల్ మోటార్ పై 2 సంవత్సరాల వారంటీ, బ్యాటరీ 3 నుంచి 5 సంవత్సరాల వారంటీతో రానుంది. ఇది 7 సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది.

ఇక ఆర్మీ కాన్ఫరెన్స్ మొదటి రోజు వివిధ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ వ్యక్తపరచిన ఎజెండా పాయింట్లను చర్చిస్తారు. అనంతరం కమాండర్-ఇన్-చీఫ్ అండమాన్ మరియు నికోబార్ కమాండ్ నుంచి అప్‌డేట్ ఉంటుంది. ఆ తర్వాత ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోని ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ల సెషన్‌లు ఉంటాయి.

అగ్నిపథ్ పథకం, డిజిటలైజేషన్, ఆటోమేషన్ కార్యక్రమాలు, ఆర్మీలోని వివిధ ఇంజనీర్ పనులు, ఇతర పని అంశాలు వీటితో పాటు బడ్జెట్ నిర్వహణ పురోగతితో పాటు కొత్తగా రూపొందించబడిన కార్యకలాపాల పురోగతిని ఫోరమ్ సమీక్షిస్తుంది. వీటిలో తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా ఉండనున్నాయి. ఇది ఆర్మీలోని వివిధ విభాగాలకు ఉపయోగపడనుంది.

More from DriveSpark

Article Published On: Sunday, April 23, 2023, 10:00 [IST]
English summary
Indian army maruti gypsy coverted into ev details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+