టయోటా ఇన్నోవా హైక్రాస్‌ GX లిమిటెడ్ ఎడిషన్ కారు విడుదల.. స్టాండర్డ్‌ మోడల్‌ కంటే తక్కువ ధర..!

భారతదేశంలో అందుబాటులో ఉన్న కార్లలో టయోటా ఇన్నోవా సిరీస్‌ కార్లను మంచి పేరుంది. తాజాగా ఈ సంస్థ టయోటా ఇన్నోవా హైక్రాస్‌ GX లిమిటెడ్ ఎడిషన్‌ను (Innova hycross gx limited edition) లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్‌ GX వేరియంట్‌ కంటే కొత్త వేరియంట్‌లో ఇంటీరియర్‌, ఎక్ట్సీరియర్‌లో కొన్ని మార్పులు చేశారు.

లిమిటెడ్ ఎడిషన్‌ ధర : ఈ కారు ధర రూ.20.07 లక్షల నుంచి రూ.20.22 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్‌ వేరియంట్‌ కంటే రూ.40 వేలు అధిక ధరను కలిగి ఉంది. 7, 8 సీట్ ఆప్షన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ ఇతర టయోటా ఇన్నోవా హైక్రాస్‌ వేరియంట్‌ల మాదిరిగానే ఉంటుంది.

Innova hycross gx limited edition launched in india

ఇన్నోవా హైక్రాస్‌ GX లిమిటెడ్‌ ఎడిషన్‌ గ్రిల్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. ముందు, వెనుక బంపర్‌లు ఫాక్స్‌ సిల్వర్‌ స్కిడ్‌ ప్లేట్‌ను కలిగి ఉంటుంది. టాప్‌ ఎండ్‌ మోడల్స్‌ను కూడా అల్లాయ్ వీల్స్‌ లేకపోవడం నిరాశపరిచింది. అయితే ఈ కారు ఇంటీరియర్‌లో కొన్ని ప్రధాన మార్పులు చేశారు.

డ్యాష్‌బోర్డ్ మరియు సాఫ్ట్‌ టచ్‌, చెస్ట్‌ నట్‌ బ్రౌన్‌ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. విండో చుట్టూ ఫాక్స్‌ వుడ్ ట్రిమ్‌ ఉంది. ఫాబ్రిక్‌ సీట్‌ కవర్లు డ్యూయల్‌ టోన్‌ బ్లాక్‌ మరియు బ్రౌన్‌ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు మరిన్ని మార్పులను లిమిటెడ్‌ ఎడిషన్‌లో గుర్తించవచ్చు.

Innova hycross gx limited edition launched in india

ఇంజిన్‌, పనితీరు : టయోటా ఇన్నోవా హైక్రాస్‌ GX లిమిటెడ్‌ ఎడిషన్‌ 2.0 లీటర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌ కలిగి ఉంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 172 hp శక్తి, 205Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT గేర్‌బాక్స్‌ ఎంపికతో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

స్టాండర్డ్‌ వేరియంట్‌ ధర : ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న టయోటా ఇన్నోవా హైక్రాస్‌ MPV వేరియంట్‌ ధర రూ.18.82 లక్షలు నుంచి రూ.30.26 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. సూపర్‌ వైట్‌, ప్లాటినం వైట్‌ పెర్ల్‌, సిల్వర్‌ మెటాలిక్‌ వంటి వివిధ రంగుల ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

స్టాండర్డ్‌ వేరియంట్‌ కారు ఫీచర్లు : ఇన్నోవా హైక్రాస్‌ 10- అంగుళాల టచ్‌స్ర్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ డిస్‌ప్లే, డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. భద్రతపరంగా ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్‌ బ్రేకింగ్ సిస్టమ్‌), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌) ఉన్నాయి.

ఎప్పుడు అందుబాటులోకి రానుంది : కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్‌ GX లిమిటెడ్ ఎడిషన్, హైబ్రిడ్‌ వెర్షన్ అయినందున తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్‌ నెల చివర నాటికి ఈ లిమిటెడ్ ఎడిషన్‌ కారు కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 22, 2023, 10:13 [IST]
English summary
Innova hycross gx limited edition launched at rs 20 07 lakhs starting price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+