Kia EV6 కేవలం 4.5 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. 100 కి.మీ రేంజ్.. ధర ఎంతో తెలుసా..?
ఫోర్ వీలర్ విభాగంలో కియా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ దూసుకెళ్తుంది. ఈ సంస్థ భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కార్ బ్రాండ్‌లలో ఒకటిగా అనతి కాలంలోనే ఎదిగింది. ఈ కంపెనీ తన ఈవీ సెగ్మెంట్ లోని 2023 కియా EV6 బుకింగ్‌లను కియా ఇండియా, ఈ రోజు (ఏప్రిల్ 15) నుంచి పునఃప్రారంభించనుంది.
కియా గతేడాది జూన్‌లో సరికొత్త ఈవీ6 ను విడుదల చేసింది. అప్పటి నుంచి భారత్ లో కేవలం 432 యూనిట్ల ఎలక్ట్రిక్ క్రాసోవర్‌లను మాత్రమే ఆ సంస్థ విక్రయించింది. ఈ విభాగంలో కియా అనుకున్న దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా భారతీయ మార్కెట్ లో కార్లను సేల్ చేసింది. జనవరిలో దీని సాధారణ ధర కంటే 1 లక్ష రూపాయలను సంస్థ పెంచింది.

ప్రస్తుతం తీసుకువస్తున్న ఈ అధునాతన ఈవీలో మొదటి 200 మంది కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లను కంపెనీ అందిస్తోంది. ఆ సంస్థ నుంచి లభించే ప్రత్యేక బెనిఫిట్లను సంస్థ కల్పించనుంది. ఈ కారు నచ్చకపోతే 30 రోజుల్లోపు 95% బైబ్యాక్ పాలసీ ఆఫర్ ని ప్రకటించింది. దానితో పాటు 5 సంవత్సరాలు ఉచిత చెక్ అప్, బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిమీ వారంటీని కల్పిస్తుంది.
సరికొత్త టెక్నాలజీ: కియా EV6 సరికొత్త ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP)పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ మోటారు 77.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని అందిస్తుంది. ఈ కారు గరిష్టంగా 528 కి.మీ (WLTP సైకిల్) పరిధిని అందిస్తుంది. అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ కారు రానుంది. ఇది 4.5 నిమిషాల్లో 100 కిమీ పరిధిని అందివ్వనుంది.
భారతదేశంలో, EV6 సింగిల్-మోటార్ తో పాటు డ్యూయల్-మోటార్ వేరియంట్‌లలో అందించబడుతుంది. సింగిల్-మోటార్ RWD వేరియంట్ 226 BHP వద్ద 350 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలానే AWD వెర్షన్ 321 BHP వద్ద 605 Nm ఉత్పత్తి చేయనుంది. Kia EV6 రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది: GT లైన్ రూ.60.95 లక్షలు, GT లైన్ AWD రూ. 65.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.
2022లో ఈవీ ప్రారంభం: జూన్ 2022లో EV6ని ప్రారంభించడం ద్వారా కియా భారతదేశంలో EV రంగంలోకి ప్రవేశించింది. అప్పటి నుండి ఇది దాదాపు 432 యూనిట్లను విక్రయించింది. 2023 కియా EV6 ఇటీవల జరిగిన న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో అందరి దృష్టిని ఆకర్షించింది, 'పెర్ఫార్మెన్స్ కార్ ఆఫ్ ది ఇయర్'తో సహా డిజైన్, పెర్ఫార్మెన్స్ మరియు ఎలక్ట్రిక్ మొబిలిటీలో బహుళ అవార్డులను గెలుచుకుని ప్రపంచ గుర్తింపును సంపాదించింది.
32 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 100 మంది ప్రముఖ అంతర్జాతీయ ఆటోమోటివ్ జర్నలిస్టులతో కూడిన జ్యూరీ నుండి ఈ గుర్తింపు వచ్చింది. ICOTY నుండి గ్రీన్ కార్ అవార్డ్ 2023, 2023 నార్త్ అమెరికన్ యుటిలిటీ వెహికల్ ఆఫ్ ది ఇయర్, 2022 యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్, 2022 కొరియన్ కార్ ఆఫ్ ది ఇయర్, 2022 కార్ ఆఫ్ ది ఇయర్ మరియు SUV ఆఫ్ ది రెడ్ డాట్ వంటి కొన్ని ఇతర ప్రశంసలు ఉన్నాయి.
ఈ కియా EV6 ఐదు కలర్లలో లభించనుంది. రన్‌వే రెడ్, యాచ్ బ్లూ, మూన్స్‌కేప్, అరోరా బ్లాక్ పెర్ల్, స్నో వైట్ పెర్ల్ లలో రానుంది. కియా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించడం ద్వారా లేదా ఎంచుకున్న కియా డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు చేయవచ్చు. ఈ కారుని సొంతం చేసుకోవాలని ఉందా వెంటనే బుక్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








