'ఆటో ఎక్స్‌పో 2023' లో కనిపించిన కియా 'EV9' - కొత్త డిజైన్ & వివరాలు
2023 ఆటో ఎక్స్‌పోలో ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన కియా మోటార్స్ తన 'EV9 కాన్సెప్ట్' SUV ని ప్రదర్శించింది. ఈ ఆధునిక ఎలక్ట్రిక్ SUV పరిమాణం పరంగా పెద్దదిగా ఉంటుంది. దీని ఉత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా 2023 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.
కియా EV9 కాన్సెప్ట్ చూడటానికి చాలా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది సాధారణ మోడల్స్ మాదిరిగా కాకుండా ఒక చతురస్రాకార రూపాన్ని కలిగి ఉండటం ఇక్కడ చూడవచ్చు. ఇది టైగర్ నోస్ గ్రిల్ కలిగి దానికి కొంత పైన బ్రాండ్ లోగో ఉంటుంది. ఇందులో Z-ఆకారపు హెడ్‌ల్యాంప్ క్లస్టర్ వంటివి కలిసి పోయి ఉంటాయి. ఇక సైడ్ ప్రొఫైల్ లో పెద్ద గ్లాస్‌హౌస్ కూడా చూడవచ్చు. ఇవన్నీ ఈ ఎలక్ట్రిక్ కారుకి కొత్త ఆకర్షణను తీసుకువస్తాయి.

ఈ SUV యొక్క వెనుక భాగంలో నిలువుగా ఉండే ఎల్ఈడీ టెయిల్ లాంప్ ఉంటుంది. మొత్తం మీద ఇది కొత్త డిజైన్ కలిగి ఉన్నప్పటికీ చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. అయితే ఇది ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడిన పెద్ద మోడల్. కావున ఇంటీరియర్ కూడా చాలా ఎక్కువ స్పేస్ కలిగి వాహన వినియోగదారులకు మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.
మనం ఇది వరకు చెప్పుకున్నట్లుగానే ఇది పరిమాణంలో పెద్ద రేంజ్ రోవర్ ని తలపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV పొడవు 4,929 మిమీ, వెడల్పు 2,055 మిమీ మరియు ఎత్తు 1,790 మిమీ వరకు ఉంటుంది. వీల్‌బేస్ కూడా దాదాపు 3,100 మిమీ వరకు ఉంటుంది. ఈ SUV యొక్క లోపలి భాగంలో ట్విన్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ లేఅవుట్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు మినిమలిస్టిక్ డ్యాష్‌బోర్డ్ వంటి ఆధునిక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

అంతే కాకుండా డ్యాష్‌బోర్డ్ చుట్టూ ఫంకీ యాంబియంట్ లైటింగ్‌తో ఆకర్షనీయంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ మూడు వరుసల లేఅవుట్ కలిగి ఉంటుంది. అయితే అవసరమైనప్పుడు ఇక్కడ రెండవ వరుస సీట్లను పూర్తిగా ఫ్లాట్‌గా మడవవచ్చు. కావున లోపల ఎక్కువ స్పేస్ కావాలనుకున్నప్పుడు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఆటోమాటిక్ డ్రైవింగ్ ఫీచర్స్, ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కంపాటబిలిటీ మరియు ఫీచర్ ఆన్ డిమాండ్ వంటి ఫీచర్స్ కూడా పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కియా EV9 కాన్సెప్ట్ లో 77.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. అయితే రేంజ్ మరియు పర్ఫామెన్స్ వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో అధికారికంగా వెల్లడికానున్నాయి. అయితే డిజైన్ మరియు ఇతర ఫీచర్స్ అన్నీ కూడా ప్రదర్శనలో కనిపించిన మోడల్ మాదిరిగానే ఉంటాయి. అయితే దీని సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నిజానికి E-GMP ప్లాట్‌ఫారమ్ 800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. ఇది 350 kW వరకు త్వరిత ఛార్జింగ్‌ను అనుమతిస్తుంది. బ్యాటరీని 10 శాతం నుండి 80 శాతం వరకు వేగంగా ఛార్జ్ చేయడానికి కేవలం 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. EV9 కాన్సెప్ట్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ డ్యూయల్ మోటార్, ఫోర్ వీల్ డ్రైవ్ రేంజ్ టాపర్ మరియు రియర్ యాక్సిల్‌కు శక్తినిచ్చే సింగిల్ మోటారు వంటి వాటిని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడతాయి మరియు విడుదలవుతాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' ఫై క్లిక్ చేయండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.


Click it and Unblock the Notifications








