ఏపీ వేదికగా చరిత్ర సృష్టించిన కియా మోటార్స్.. జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న కార్ల ఉత్పత్తి

భారత్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా కీలక మైలురాయిని చేరుకుంది. కియా సంస్థ భారత్‌లో 1 మిలియన్‌ కార్లను తయారుచేసింది. కియాకు సంబంధించి ప్రస్తుతం భారత మార్కెట్లో సెల్టోస్‌, సొనెట్‌, కారెన్స్‌, EV6 కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యంగా సెల్టోస్‌ కార్ల ఉత్పత్తిలో కియా రికార్డు సృష్టించింది. భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించిన నుంచి ఇప్పటి వరకు 5,32,450 యూనిట్లను ఉత్పత్తి చేసింది. కియా సెల్టోస్‌ తర్వాత సొనెట్‌ కార్లను కూడా పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేశారు. ఇప్పటి వరకు 3,32,450 సొనెట్‌ కార్లను తయారుచేశారు. దీని తర్వాత కారెన్స్‌ కార్లు 1,20,516 యూనిట్ల ఉత్పత్తి జరిగింది. కార్నివాల్ 14,584 యూనిట్లు ఉత్పత్తి చేశారు.

kia india celebrates 1 million car roll out

కియా కార్ల తయారీ ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉంది. కియా తన అన్ని మోడల్‌ కార్లను ఈ ప్లాంట్‌లోనే ఉత్పత్తి చేస్తోంది. EV6 ఎలక్ట్రిక్‌ కారును మాత్రం విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తున్నారు. అందుకే ఈ కారు ధర కాస్త ఎక్కువగా ఉంది. ఆ కారణంగానే కొన్ని వందల కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

అదే కియా సెల్టోస్‌ కారు మాత్రం నెలకు వేలల్లో విక్రయాలు నమోదు చేసుకుంటోంది. భారత్‌లో కియా సంస్థ విడుదల చేసిన తొలి మోడల్‌ కారు సెల్టోస్‌. కియా సెల్టోస్‌ SUV కారు భారత్‌లో కియా సంస్థకు గుర్తింపు తీసుకొచ్చింది. ఆగస్టు 2019లో తొలిసారిగా సెల్టోస్‌ను విడుదల చేసింది. నాలుగు సంవత్సరాలుగా ఈ కారు గణనీయమైన విక్రయాలను నమోదు చేస్తోంది. సెల్టోస్‌ కారు ఇప్పటికే 5.32 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది.

kia india celebrates 1 million car roll out

సెల్టోస్‌ విక్రయాలను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో అప్‌డేట్‌ చేయబడిన సెల్టోస్‌ కారును ఆవిష్కరించింది. త్వరలోనే విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్‌లో ఈ కారు ప్రీ బుకింగ్‌లు కూడా ప్రారంభం అయ్యాయి. అప్‌గ్రేడ్‌ చేయబడిన కియా సెల్టోస్‌ అనేక ఫీచర్లను కలిగి ఉండనుంది.

కారు లోపలి భాగం కీలక మార్పులు చేశారు. డ్యా్ష్‌బోర్డులోని డి‌స్‌ప్లేలు కొత్తగా అనిపిస్తాయి. టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ యానిట్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, కార్‌ టెక్‌కు సపోర్టు చేస్తుంది. కొత్త కియా సెల్టోస్‌లో డ్యూయల్‌ జోన్‌ ఆటోమేటిక్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థ, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది.

kia india celebrates 1 million car roll out

భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. EBDతో కూడిన ABS, బ్రేక్‌ అసిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ట్రాక్షన్ కంట్రోల్‌, హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌ మరియు హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లను కొత్త కియా సెల్టోజ్ కలిగి ఉంది. మరియు అత్యంత కీలక ఫీచర్‌ అయిన ADAS (అడ్వాన్సడ్ డ్రైవర్‌ అసెస్టెన్స్‌ సిస్టమ్‌ను) ను కలిగి ఉంటుంది.

అప్‌గ్రేడ్‌ చేయబడిన కియా సెల్టోస్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 158bhp శక్తి మరియు 253 గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ 1.5 లీటర్ల ఇంజిన్‌ ఉత్పత్తి చేసినదాని కంటే ఎక్కువ. ఈ ఇంజిన్‌ 113bhp శక్తి మరియు 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదే 1.5 లీటర్ల టర్బో డిజిల్‌ ఇంజిన్‌ 114bhp శక్తి మరియు 250Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ ఇంజిన్లు వేర్వేరు ట్రాన్సిమిషన్‌ ఆప్షన్లను కలిగి ఉంటాయి. 6 స్పీడ్‌ మాన్యువల్‌, 6 స్పీడ్‌ iMT, 6 స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ మరియు CVT ట్రాన్సిమిషన్‌లతో రానున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, July 14, 2023, 19:22 [IST]
English summary
Kia india celebrates 1 million car roll out in andhra pradesh plant
Read more on: #కియా #kia motors
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+