ఈ ప్రముఖ కారు విక్రయాలు ఇక లేనట్లే.. దానికి బదులుగా త్వరలో కొత్త ఎంపీవీ..

భారత మార్కెట్‌లోకి వాహనదారుల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతతో కొత్త మోడళ్లు వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని గ్రాండ్‌ సక్సెస్‌గా నిలిచి విక్రయాల్లో దూసుకుపోతుండగా మరికొన్ని ఫ్లాప్‌ అవుతూ మార్కెట్‌లో డీలా పడిపోతున్నాయి. ఇక్కడ అలాంటి కారు గురించే తెలుసుకోబోతున్నాం.

2020 లో భారతీయ కార్ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కియాకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా కార్నివాల్ ఎమ్‌పీవీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఇంతవరకూ దీంట్లో కంపెనీ ఎలాంటి అప్‌గ్రేడ్లు ఇవ్వలేదు. ఈ క్రమంలో ఈ కారు దేశీయ మార్కెట్‌ నుంచి దూరమైపోయింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

Kia-Carnival

కియా ఇండియా ఎట్టకేలకు భారత మార్కెట్లో కార్నివాల్ MPVని నిలిపివేసింది. దాని అధికారిక వెబ్‌సైట్ నుండి కారును తొలగించింది. ఇక నుంచి కార్నివాల్ ఎమ్‌పీవీ కస్టమర్ల నుంచి కంపెనీ ఎటువంటి బుకింగ్‌లను స్వీకరించదు. ప్రత్యక్ష పోటీదారులు లేని కియా కార్నివాల్ MPVకి ఇది ఒక శకం ముగింపుని సూచిస్తుంది. నాల్గవ తరం కార్నివాల్ రానున్న సంవత్సరంలో విడుదల కానుంది.

భారత మార్కెట్లో, టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు హైక్రాస్ మాత్రమే కియా కార్నివాల్ ఎమ్‌పీవీకి పోటీగా నిలిచాయి. అయితే, కార్నివాల్.. ఇన్నోవా కంటే పెద్దది మరియు విలాసవంతమైనది. అయినప్పటికీ ఇతర MPVలకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. అమ్మకాలు రోజురోజుకు పడిపోతుండటం, బీఎస్‌ రెండో దశ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే కార్నివాల్‌ నిలిచిపోవడానికి కారణంగా తెలుస్తోంది.

Kia-Carnival

కియా కార్నివాల్ భారతదేశంలో అందుబాటులో ఉన్న అతి పెద్ద కారుగా నిలిచింది. ఈ ప్రీమియం MPVలో 7, 8 మరియు 9 సీట్ల ఎంపికలు ఉన్నాయి. 6 సీట్ల ఎంపీవీలన్నీ కెప్టెన్ సీట్లు కావడం విశేషం. అంతే కాకుండా నాలుగు వరుసల 9 సీట్ల కార్నివాల్ కారు అందరినీ ఆకర్షించింది.

ప్రస్తుతం, నిలిపివేయబడిన కియా కార్నివాల్ ఎంపీవీ 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్ఠంగా 198 బీహెచ్‌పీ పవర్ వద్ద 440 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కొనుగోలుకు అందుబాటులో ఉండేది. కాగా కంపెనీ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డీలర్లు వీటి బుకింగ్‌లు తీసుకోవడం ఆపేశారు.

Kia-Carnival

కార్నివాల్ ఎంపీవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 30.99 లక్షల నుంచి రూ. 35.49 లక్షల మధ్య ఉంది. ఇది వినియోగదారులను ఆకర్షించే డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది. ప్రధానంగా 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ ప్యానెల్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. భద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి.

కియా దేశీయ మార్కెట్‌లో కార్నివాల్ MPVని నిలిపివేసినా.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాల్గవ తరం కార్నివాల్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాదిలో దీన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇది 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

భారత్‌లో కియా కార్నివాల్ ఎమ్‌పీవీ అమ్మకాలు మందగించడంతో నిలిచిపోయిన మాట వాస్తవమే. కానీ, రాబోయే రోజుల్లో అధిక సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించేందుకు కియా కార్నివాల్‌ అద్భుతమైన ఫీచర్లతో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుందనేది కూడా అంతే నిజం. ధర కూడా అంతే స్థాయిలో ఉంటుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, June 22, 2023, 17:49 [IST]
English summary
Kia india discontinued carnival mpv details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+