Kia India కియా సంస్థ మరో రికార్డు.. అతి తక్కువ సమయంలో ఇన్ని కార్లు అమ్ముడు పోయాయ..!
కియా మోటార్స్ ఇండియా (Kia India) వరుసగా రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు, విక్రయాల్లో దూసుకెళ్లిన కియా సంస్థ మరో రికార్డు సృష్టించింది. తాజాగా కియా కారెన్స్ MPV దేశంలో 1 లక్ష విక్రయాల మైలురాయిని అధిగమించింది. ఈ మేరకు కియా ప్రకటన చేసింది. కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే ఈ విక్రయాలు నమోదు చేసినట్లు పేర్కొంది.
కియా ఇండియా 2022 ఫిబ్రవరిలో కియా కారెన్స్ ఎంపీవీ (Kia Carens MPV)ను తిరిగి విడుదల చేసింది. లాంచింగ్ నుంచే మంచి ఆదరణ సంపాదించింది. మరియు తక్కువ కాలంలోనే భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అధిక సంఖ్యలో బుకింగ్‌లను రికార్డు చేసింది. కారెన్స్ ఎంపీవీ కారు విడుదల సమయంలో ఈ కారు హై స్పెక్ వేరియంట్ వెయిటింగ్ పిరియడ్ సంవత్సరం కంటే ఎక్కువ ఉండేది.

కియా కారెన్స్ MPV ప్రస్తుతం 6 ట్రిమ్ స్థాయిలో అందుబాటులో ఉంది. ప్రీమియం, ప్రెస్జిజ్, ప్రెస్జిజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్, X-లైన్ వేరియంట్లలో లభిస్తుంది. మరియు 8 రంగుల్లో లభిస్తుంది. బ్లూ, మాస్ బ్రౌన్, స్పార్కింగ్ సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ఈ కియా కారెన్స్ 2023 MPV 1.5 లీటర్ టర్బోఛార్జడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది BS6 ఫేజ్ 2, RDE ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఇంజిన్ 157.8 bhp, 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ iMT ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 113bhp, 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 1.5 టర్బోఛార్జడ్ డీజిల్ ఇంజిన్ 144bhp, 250Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు తాజా ఉద్గార ప్రమాణాలకు ఉన్నాయి. డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ iMT గేర్‌బాక్స్, 6- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను కలిగి ఉంటుంది. మరియు పెట్రోల్ ఇంజిన్ 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది.
కియా కారెన్స్ 12.5 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అన్ని వేరియంట్లలో కలిగి ఉంటుంది. దీంతోపాటు 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, UVO కనెక్టడ్ కార్ టెక్, బోస్ సౌండ్ సిస్టమ్ సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.

భద్రతా పరంగా ఈ కారు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX మౌంట్స్, హిల్ హోల్డ్ అసిస్టెన్స్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌ల వ్యవస్థను కలిగి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో మాత్రమే కియా కార్ల తయారీ ప్లాంట్ ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








