కియా వారి నయా ధరలు.. సోనెట్ నుంచి EV6 వరకు
కియా ఇండియా గత సంవత్సరం చివరిలో చెప్పినట్లుగానే 2023 జనవరి నుంచి తమ వాహనాల ధరలను ఏకంగా రూ. 1 లక్ష వరకు పెంచింది. కంపెనీ ఇప్పుడు ఏ కారు పైన ఎంత ధరలను పెంచింది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కియా కంపెనీ దేశీయ మార్కెట్లో 2023 నుంచి తమ సెల్టోస్, సోనెట్, కారెన్స్ మరియు ఈవి6 మోడల్స్ ధరలను పెంచింది. అయితే కియా కార్నివాల్ మాత్రం మునుపటి ధర వద్ద అందుబాటులో ఉంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను మరియు రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ మోడల్స్ (సెల్టోస్, సోనెట్, కారెన్స్ మరియు ఈవి6) ధరలను రూ. 20,000 నుంచి రూ. 1 లక్ష వరకు పెంచింది.

కియా సోనెట్:
2023 జనవరి నుంచి కియా మోటార్స్ తన సోనెట్ ధరలను వేరియంట్ ను బట్టి రూ.20,000 నుంచి రూ.40,000 వరకు పెంచింది. ఇందులో 1.2-లీటర్ ఇంజిన్లతో పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.20,000 పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత HTE బేస్ వేరియంట్ ధర రూ.7.69 లక్షలకు పెరిగింది. గతంలో ఈ మోడల్ ధర రూ.7.49 లక్షలు. అదే సమయంలో HTK మరియు HTK ప్లస్ ధరలు వరుసగా రూ.8.45 లక్షలు మరియు రూ.9.39 లక్షలకు చేరుకున్నాయి.
ఇక కియా సోనెట్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ IMT వేరియంట్లు మరియు డిసిటి వేరియంట్లు స్టాండర్డ్ ధర రూ .25,000 వరకు పెరిగాయి. కావున HTK ప్లస్ మరియు GTX ప్లస్ ధరలు ఇప్పుడు రూ .10.24 లక్షలు మరియు రూ. 12.84 లక్షలుగా ఉన్నాయి. ఇందులో టాప్ వేరియంట్ అయిన ఎక్స్-లైన్ డిసిటి ధర ఇప్పుడు రూ. 25,000 పెరుగుదలను పొంది రూ. 13.64 లక్షలకు చేరుకుంది.

కియా సోనెట్ డీజిల్ వేరియంట్స్ విషయానికి వస్తే, వీటి ధరలు రూ. 40,000 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత డీజిల్ వేరియంట్ బేస్ వేరియంట్ (HTE 1.5) ధర రూ. 9.45 లక్షలు, కాగా టాప్ వేరియంట్ (X-Line ఆటోమాటిక్) ధర రూ. 14.39 లక్షలను చేరుకుంది. ఇప్పుడు కియా సోనెట్ ధరల పెరుగుదల తరువాత మరింత ఎక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది.
కియా సెల్టోస్:
దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతూ ముందుకు వెళుతున్న కియా సెల్టోస్ ధరలు 2023 జనవరి నుంచి రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు ధరల పెరుగుదలను పొందాయి. ధరల పెరుగుదల తరువాత కియా సెల్టోస్ బేస్ వేరియంట్ అయిన HTE 1.5 ధర రూ. 10. 69 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ఆయిన X-Line 1.4 ధర రూ. 18.69 లక్షలు. డీజిల్ వేరియంట్ ధరలు రూ. 50,000 పెరుగుదలను పొందాయి.

కియా కారెన్స్:
కియా మోటార్స్ యొక్క కారెన్స్ MPV ధరలు ఇప్పుడు రూ. 20,000 నుంచి రూ. 45,000 వరకు ధరల పెరుగుదలను పొందాయి. ధరల పెరుగుదల తరువాత పెట్రోల్ వేరియంట్ (బేస్ వేరియంట్) ధర రూ. 10.19 లక్షలు, టాప్ వేరియంట్ రూ. 17.94 లక్షలకు చేరుకున్నాయి. డీజిల్ వేరియంట్ ధర (బేస్ వేరియంట్) రూ. 12.14 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 18.44 లక్షలకు చేరుకున్నాయి.
కియా ఈవీ6:
కియా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ కారు EV6 ధర కూడా 2023 జనవరిలో పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 1 లక్ష వరకు పెరిగింది. ధరల పెరుగుదల తరువాత కియా EV6 జిటి లైన్ ఆర్డబ్ల్యుడి ధర రూ. 60.95 లక్షలు, కాగా జిటి లైన్ ఎడబ్ల్యుడి రూ. 65.95 లక్షలు. గతంలో ఈ ధరలు రూ. 59.65 (జిటి లైన్ ఆర్డబ్ల్యుడి) మరియు రూ. 64.95 లక్షలు (జిటి లైన్ ఎడబ్ల్యుడి).
ఇదిలా ఉండగా ఈ నెలలో జరగనున్న 2023 ఆటో ఎక్స్‌పో లో కియా మోటార్స్ ఈవి9 మరియు మూడు వరుసల ఎలక్ట్రిక్ SUV వంటి వాటితో పాటు కొత్త జనరేషన్ కార్నివాల్ MPV మరియు సోరెంటో 7 సీటర్ వంటి వాటిని ప్రదర్శించనుంది. వీటితో పాటు సెల్టోస్ మరియు సోనెట్ యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








