చరిత్ర తిరగరాసిన కియా మోటార్స్.. రెండు రోజుల్లోనే మరో రికార్డు..!!
రెండు రోజుల క్రితం 1 మిలియన్ కార్ల ఉత్పత్తి రికార్డును సృష్టించిన కియా మోటార్స్ ఇండియా.. మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ ప్లాంట్ ఉంది. తన అన్ని మోడల్ కార్లను ఈ ప్లాంట్ నుంచే ఉత్పత్తి చేస్తుంది. EV6 కార్లను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, భారత్‌లో విక్రయిస్తోంది.
కియా ఇండియా జులై తొలివారంలో ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్ మిడ్ సైజ్ SUVని ఆవిష్కరించింది. జులై 14 నుంచి కొత్త సెల్టోస్ ముందస్తు బుకింగ్‌లను స్వీకరించింది. 25 వేల రూపాయలు చెల్లించి కియా ఆన్‌లైన్ పోర్టల్, కియా డిలర్‌షిప్ వద్ద బుకింగ్ చేసుకోవచ్చు. అయితే కేవలం 24 గంటల్లోనే రికార్డు స్థాయి బుకింగ్‌లను నమోదుచేసినట్లు కియా వెల్లడించింది. దీంతో మిడ్ సైజ్ SUV సిగ్మెంట్‌లో అరుదైన రికార్డు సృష్టించింది.

కియా కొత్త సెల్టోస్ బుకింగ్‌లు తెరిచిన కేవలం 24 గంటల్లో 13,424 ప్రీ బుకింగ్‌లు నమోదు చేసింది. ఈ సెగ్మెంట్‌లో తొలి రోజు అత్యధిక ప్రీ బుకింగ్స్ నమోదు చేసిన కారుగా సెల్టోస్ రికార్డు సృష్టించింది. ఈ కారు ధర వచ్చే నెలలో వెల్లడి కానుంది.
సెల్టోస్ పాత మోడల్ కారు కంటే ధర అధికంగా ఉండే అవకాశం ఉంది. కొత్త సెల్టోస్ డెలివరీలు ఆగస్టు 2023లో ప్రారంభం అవుతాయని కియా వెల్లడించింది. వేరియంట్, కస్టమర్ లోకేషన్ ఆధారంగా ఈ కారు వెయిటింగ్ పీరియడ్ రెండు నుంచి ఆరు నెలల వరకు ఉంటుందని తెలుస్తోంది.

కియా సెల్టోస్ కొత్త కారు లోపలి భాగంలో అనేక కీలక మార్పులు చేశారు. డ్యా్ష్‌బోర్డులోని డిస్‌ప్లేలు కొత్తగా అనిపిస్తాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యానిట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కార్ టెక్‌కు సపోర్టు చేస్తుంది. కొత్త కియా సెల్టోస్‌లో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
అప్‌గ్రేడ్ చేయబడిన కియా సెల్టోస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 158bhp శక్తి మరియు 253 గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ 1.5 లీటర్ల ఇంజిన్ ఉత్పత్తి చేసినదాని కంటే ఎక్కువ. ఈ ఇంజిన్ 113bhp శక్తి మరియు 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదే 1.5 లీటర్ల టర్బో డిజిల్ ఇంజిన్ 114bhp శక్తి మరియు 250Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ ఇంజిన్లు వేర్వేరు ట్రాన్సిమిషన్ ఆప్షన్లను కలిగి ఉంటాయి. ఇంజిన్‌ను బట్టి MT,iMT, AT, IVT, DCT ట్రాన్సిమిషన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వస్తుంది.
భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కొత్త కియా సెల్టోజ్ కలిగి ఉంది. మరియు అత్యంత కీలక ఫీచర్ అయిన ADAS (అడ్వాన్సడ్ డ్రైవర్ అసెస్టెన్స్ సిస్టమ్‌ను) ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








