Kia Seltos 2023 ఆంధ్రప్రదేశ్ వేదికగా కియా మరో రికార్డు.. కేవలం 2 నెలల్లోనే...!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా.. భారత్ కస్టమర్లను భారీగా ఆకట్టుకుంటోంది. Kia Seltos 2023 కార్లు.. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కియాను అగ్రస్థాయి సంస్థగా నిలిపాయి. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జులై 21న కియా విడుదల చేసింది. ఈ వేరియంట్ కూడా భారీగా ఆధరణ లభిస్తోంది.
ఇప్పటికే అనేక కీలక మైలురాళ్లను కియా సెల్టోస్ 2023 (kia seltos Facelift) అధిగమించింది. తాజాగా కొత్త కియా సెల్టోస్ మరో చరిత్ర సృష్టించింది. కేవలం రెండు నెలల్లో 50వేల బుకింగ్‌లను సొంతం చేసుకుంది. కియా సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 5.47 లక్షలు యూనిట్ల సెల్టోస్ కార్లను విక్రయించింది. ఇందులో ఎగుమతులు కూడా ఉన్నాయి.

కీలక భద్రతా ఫీచర్ అయిన ADAS - అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌తో కూడిన కార్లకు ఎక్కువ బుకింగ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. కియా సెల్టోస్ 2023 కారు డిజైన్ సహా ఇతర స్పెసిఫికేషన్లు ఈ విజయానికి కారణం అని కియా ఇండియా చీఫ్ సేల్స్ మరియు బిజినెస్ ఆఫీసర్ సోహ్నా అన్నారు. ఫేస్‌లిఫ్ట్ కియా సెల్టోస్ కారు నేటి డ్రైవర్లకు నమ్మకమైన వాహనంగా నిలిచిందంటూ ఆనందం వ్యక్తం చేశారు.
పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కార్లను ఉత్పత్తి చేసేందుకు కియా సంస్థ కీలక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కస్టమర్లకు త్వరగా డెలివరీ చేయగలమని భావిస్తోంది. కియా మోటార్స్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ ప్లాంట్ ఉంది. తన అన్ని మోడల్ కార్లను ఈ ప్లాంట్ నుంచే ఉత్పత్తి చేస్తుంది. EV6 కార్లను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, భారత్‌లో విక్రయిస్తోంది.

కియా కొత్త సెల్టోస్ కారు ధర రూ.10.89 లక్షల నుంచి 19.99 లక్షల వరకు ఉంది. ఈ కారు మూడు ఇంజిన్ ఆప్షన్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. కియా సెల్టోస్ 2023 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 133bhp శక్తి, 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
1.5 లీటర్ GDi టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 158bhp శక్తి, 253Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్, 6 స్పీడ్ క్లచ్‌లెస్ మాన్యువల్ గేర్‌బాక్స్‌లో అందుబాటులో ఉంటుంది. మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 114bhp శక్తిని, 250Nm గరిష్ఠ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్‌ను బట్టి MT,iMT, AT, IVT, DCT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వస్తుంది.

కియా సెల్టోస్ కొత్త కారు లోపలి భాగంలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యానిట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కార్ టెక్‌కు సపోర్టు చేస్తుంది. కొత్త కియా సెల్టోస్‌లో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీల కెమెరా, LED హెడ్‌లైట్లు, బంపర్ డిజైన్‌కు ఆకట్టుకుంటుంది.
భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లను కొత్త కియా సెల్టోజ్ కలిగి ఉంది. మరియు అత్యంత కీలక ఫీచర్ అయిన ADAS (అడ్వాన్సడ్ డ్రైవర్ అసెస్టెన్స్ సిస్టమ్‌ను) ను కలిగి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








