కియా సెల్టోస్ రివ్యూ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ వీడియో.. గట్టీ భద్రతా ఫీచర్లు, ఫర్ఫామెన్స్ ఈ SUV సొంతం..!!
దేశంలో కియా కార్ల అమ్మకాల హవా కొనసాగుతోంది. కొత్త కొత్త మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అధునాతన ఫీచర్లతో ఈ కార్లను సంస్థ ఉత్పత్తి చేస్తుంది. తాజాగా ఈ కంపెనీ విడుదల చేసిన సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ 2.O తీసుకువచ్చింది. దీనిని మా డ్రైవ్స్‌పార్క్ టీమ్ టెస్ట్ డ్రైవ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో రివ్యూ మీకోసం..
ఈ కారులో డ్యాష్‌బోర్డుపై రెండు 10.25 అంగుళాల డిస్‌ప్లేలు ఉన్నాయి. కుడివైపున ఉన్న డిస్‌ప్లై డ్రైవర్ డిస్‌ప్లేగా పనిచేస్తుంది. మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం HD టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్టు చేస్తుంది. ప్రీమియం ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి వస్తుంది. మరియు మీ స్మార్ట్‌వాచ్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసేందుకు కియా కనెక్ట్ ఫీచర్‌తో కనెక్ట్ కావచ్చు.
కియా సెల్టోస్ మూడు ఇంజిన్ ఆప్షన్‌లో వస్తుంది మరియు 4 గేర్‌బాక్స్‌లను కలిగి ఉంటుంది. ఈ కారు నేచురల్ ఆస్పిరేటెడ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్.. 113bhp శక్తి, 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కియా సెల్టోస్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా iVT గేర్‌బాక్స్‌ను ఉన్న 1.5 లీటర్ డిజిల్ ఇంజిన్.. 114bhp శక్తి, 250Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజిన్ iMT మరియు ఆటోమేటిక్ 6 స్పీడ్ ట్రాన్సిమిషన్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. 1.5 టర్బో పెట్రోల్ ఇంజిన్ 158bhp శక్తి, 253Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ iMT మరియు 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.

భద్రతా పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మెనేజ్‌మెంట్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ISOFIX మరియు ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటాయి.


Click it and Unblock the Notifications








