Kia seltos 2023 ఆవిష్కరణ.. ADAS సహా కీలక ఫీచర్లు..!!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన ఫేస్‌లిఫ్టెడ్‌ సెల్టోస్‌ SUVను భారత్‌లో ఆవిష్కరించింది. కొత్త కియా సెల్టోస్‌ కారు లోపల, బయట అనేక మార్పులు చేసింది. మరియు టెక్నాలజీ పరంగాను కీలక మార్వులు చేసింది. ఈ కారు బుకింగ్‌లు జులై 11 నుంచి ప్రారంభం అవుతాయి. ప్రాధాన్యత పరంగా యాజమానులు వాహనాల డెలివరీలను పొందుతారని వెల్లడించింది.

కియా సెల్టోస్‌ 2023 తాజా వెర్షన్‌ మూడు ఇంజిన్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఒక డీజిల్‌ మరియు రెండు పెట్రోల్ ఇంజిన్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఫేస్‌లిఫ్టెడ్‌ ఎస్‌యూవీ 1.5 లీటర్ల పెట్రోల్‌, డిజిల్‌ ఇంజిన్లతోపాటు 1.5 లీటర్ల టర్బో పెట్రోల్‌ను కలిగి ఉంటుంది.

Kia Seltos facelift

టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 158bhp శక్తి మరియు 253 గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ 1.5 లీటర్ల ఇంజిన్‌ ఉత్పత్తి చేసిన దానికంటే ఎక్కువ పనితీరును కనబరుస్తుంది. ఈ ఇంజిన్‌ 113bhp శక్తి మరియు 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అదే 1.5 లీటర్ల టర్బో డిజిల్‌ ఇంజిన్‌ 114bhp శక్తి మరియు 250Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ ఇంజిన్లు వేర్వేరు ట్రాన్సిమిషన్‌ ఆప్షన్లను కలిగి ఉంటాయి. 6 స్పీడ్‌ మాన్యువల్‌, 6 స్పీడ్‌ iMT, 6 స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ మరియు CVT ట్రాన్సిమిషన్‌లతో రానున్నాయి.

Kia Seltos facelift

ఫేస్‌లిఫ్టెడ్‌ కియా సెల్టోస్‌ డిజైన్‌ గతం కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ముందు భాగంలో అప్‌డేట్‌ చేయబడిన గ్రిల్‌ను కలిగి ఉంటుంది. మరియు రీడిజైన్‌ చేయబడిన LED DRL, బంపర్‌ను కలిగి ఉంటుంది. 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంది. వెనుక వైపు టెయిల్‌ లైట్లు లైట్‌ బార్‌ను కలిగి ఉన్నాయి. అయితే వెనుక బంపర్‌ మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటుంది.

Kia Seltos facelift

ఫెస్‌లిఫ్టెడ్‌ కియా సెల్టోస్‌ లోపలి భాగం కీలక మార్పులు చేశారు. డ్యాష్‌బోర్డులోని డిస్‌ప్లేలు కొత్తగా అనిపిస్తాయి. మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే మరియు కార్‌ టెక్‌కు సపోర్టు చేస్తుంది. కొత్త కియా సెల్టోస్‌ SUV డ్యూయల్‌ జోన్‌ ఆటోమేటిక్‌ ఎయిర్ కండిషనింగ్‌ వ్యవస్థ, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Kia Seltos facelift

కియా తన ఫేస్‌లిఫ్టెడ్‌ సెల్టోస్‌ SUV భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. EBDతో కూడిన ABS (యాంటీ బ్రేకింగ్‌ సిస్టమ్‌), బ్రేక్‌ అసిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌ మరియు హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Kia Seltos facelift

మరియు ఈ కారు కీలకమైన ADAS (ఆడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌)ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు ఆడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, బ్లైండ్‌ స్పాట్‌ కొలిజన్‌ వార్నింగ్‌ వంటి కీలక ఫీచర్లను కియా సెల్టోస్‌ 2023 వెర్షన్‌ కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 4, 2023, 14:22 [IST]
English summary
Kia seltos facelift unveiled in india here are the specs and features
Read more on: #కియా #kia seltos
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+