మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన కియా సెల్టోస్‌ ఫేస్ లిఫ్ట్.. 18 వేరియంట్లు, అత్యాధునిక భద్రతా ఫీచర్లు..

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా నేడు కొత్త కియా సెల్టోస్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ధర రూ. 10,89,900 (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభమవుతుంది. ఈ మోడల్‌పై మొదటి నుంచి మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కియా సెల్టోస్‌లో కంపెనీ తీసుకువచ్చిన ఫీచర్లను చూద్దాం.

భారతీయ మార్కెట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్టెడ్‌ 18 వేరియంట్‌లలో కంపెనీ ప్రవేశపెట్టింది. టాప్‌ వేరియంట్‌లు ADAS-GT-లైన్, X-లైన్ డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్‌లలో అందుబాటులో ఉంటాయి. వీటి ధరలను పరిశీలిస్తే వేరియంట్ల ప్రకారం రూ. 19,79,900 నంచి రూ. 19,99,900 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు.

Kia-Seltos-Facelift

కొత్త కియా సెల్టోస్‌ను ఈ నెల 4 న కియా ఆవిష్కరించింది. ఇందులో స్పోర్టీ పెర్ఫార్మెన్స్, మస్క్యులర్ ఎక్స్‌టీరియర్, ఫ్యూచరిస్టిక్ క్యాబిన్ మరియు అత్యాధునిక సాంకేతికతను కంపెనీ ప్రవేశపట్టింది. ఇది 15 స్ట్రాంగ్‌ సేఫ్టీ ఫీచర్లు మరియు 17 ADAS లెవెల్ 2 ఫీచర్లతో సహా 32 భద్రతా లక్షణాలతో ఈ కారును విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది.

ఫీచర్లు: ఇక కొత్త కియా సెల్టోస్‌లో ఫీచర్లను పరిశీలిస్తే, 10.3 అంగుళాల పూర్తి డిజిటల్ క్లస్టర్, 10.2 అంగుళాల HD టచ్‌స్క్రీన్ నావిగేషన్, డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.

Kia-Seltos-Facelift

ఇంజిన్‌: కొత్త కియా సెల్టోస్‌ ఇంజిన్ పనితీరును చర్చిస్తే.. Smartstream G1.5 T-GDi పెట్రోల్ ఇంజిన్ ఇప్పటివరకు సెగ్మెంట్‌లో అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌గా గుర్తింపు పొందింది. ఇది 160PS పవర్ వద్ద 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టెక్ లైన్, జీటీ లైన్ మరియు ఎక్స్-లైన్ అనే మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. మూడు ఇంజిన్‌లు మరియు ఐదు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో కొనుగోలు చేయవచ్చు.

సేఫ్టీ ఫీచర్లు: కొత్త కియా సెల్టోస్‌ అత్యంత భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. 17 అటానమస్ ఫీచర్‌లతో లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)తో వస్తుంది. విభిన్న ఇంటెలిజెంట్ ఫీచర్‌ల కోసం 1 కెమెరా, 3 రాడార్లు, అధునాతన ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడ్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్ మరియు స్టాప్ & గో(Stop and go)తో కూడిన స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి.

Kia-Seltos-Facelift

అంతే కాకుండా డ్రైవర్ మరియు ప్రయాణీకులకు భద్రతను కల్పించడానికి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, HAC (హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), మరియు VSM (వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్) వంటి ప్రామాణిక 15 భద్రతా ఫీచర్లతో వస్తుంది. కొత్త సెల్టోస్‌ను సురక్షితమైన SUVగా మార్చేందుకు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

కొత్త కియా సెల్టోస్ లాంచ్‌పై కియా ఇండియా సీఈఓ టే-జిన్ పార్క్ మాట్లాడారు. అధునాతన ADAS లెవెల్ 2, అత్యున్నతమైన భద్రతా ఫీచర్లు మరియు వినూత్న సాంకేతికతతో, వినియోగదారుల కోసం సరికొత్త కియా సెల్టోస్‌ను రూపొందించినట్లు చెప్పారు. విభిన్న వేరియంట్లతో పాటు, సరసమైన ధరలో, వినియోగదారులకు స్మార్ట్‌ డ్రైవింగ్‌ అనుభవాన్ని అందించడంతో మార్కెట్‌లో ది బెస్ట్‌గా ఉంటుందని చెప్పారు.

Kia-Seltos-Facelift

More from DriveSpark

Article Published On: Friday, July 21, 2023, 13:23 [IST]
English summary
Kia seltos launched in india at specs features price details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+