kia-sonet: కియా సోనెట్ ఎంట్రీ లెవెల్ కారు ఫీచర్లు చూశారా! తక్కువ ధరలో కారు కోనేవారికి మంచి అవకాశం!
భారత మార్కెట్లో మోస్ట్ అవైటెడ్ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని కియా మోటార్స్ ఇండియా నిన్న(డిసెంబర్ 14) న ఆవిష్కరించింది. ఏడు వేరియంట్లలో ఆకర్షణీయణైన 11 కలర్స్‌లో సంస్థ దీనిని పరిచయం చేసింది. ఈ క్రమంలో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్ HTE కి సంబంధించిన విజువల్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
కొత్త ఏడాది 2024కి శుభారంభం పలుకుతూ కియా మోటార్స్.. తన సరికొత్త అప్‌డేటెడ్ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మారుతి సుజుకి నెక్సాన్, బ్రెజ్జా ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. కాగా Kia Sonet Facelift బుకింగ్స్ డిసెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి.

కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను సంస్థ ఏడు వేరియంట్లు.. HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X లైన్‌లలో సంస్థ ప్రవేశపెట్టింది. కాగా బేస్ వేరియంట్ HTE వేరియంట్‌కు సంబంధించిన విజువల్స్ విడుదలయ్యాయి. ఇతర వేరియంట్లతో పోలిస్తే బేస్ వేరియంట్ HTE కొన్ని ఫీచర్లను కోల్పోతుంది.

డిజైన్ పరంగా కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్.. హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌లైట్‌లు, టెయిల్‌గేట్‌పై కనెక్ట్ చేయబడిన రిఫ్లెక్టర్, కొత్త ఫ్రంట్, రియర్ బంపర్‌లు, సిల్వర్ వీల్స్ కవర్‌లతో కూడిన 15-అంగుళాల స్టీల్ వీల్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, పోల్-టైప్ యాంటినా, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో ఆకర్షణీయంగా ఉంది.
కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ HTE వేరియంట్‌లో ఇంటీరియర్ విషయానికొస్తే ఇందులో టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, రియర్ AC వెంట్‌లు ఇంకా స్టోరేజ్‌తో కూడిన ఫిక్స్‌డ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ వంటి అధునాతన ఫీచర్లతో డిజైన్ పరంగా ఆకట్టుకుంటోంది.

ఇక కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్‌లో భద్రతాపరంగా Bharat NCAP క్రాష్ టెస్ట్ రూల్స్‌కు అనుగుణంగా ఉందనే చెప్పవచ్చు. ప్రయాణికుల సేఫ్టీ కోసం కొత్తగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS(Anti-Lock Braking System), హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
కాగా కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ టాప్-స్పెక్ X-లైన్ వేరియంట్‌తో పోలిస్తే, Sonet facelift HTE వేరియంట్‌లో ఫోర్ వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, లెవెల్ 1 ADAS ఫీచర్, రియర్ పార్శిల్ ట్రే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రియర్ డిస్క్ బ్రేక్‌లతో పాటు OTA అప్‌డేట్‌లను కోల్పోతుంది.

కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్ HTE పెట్రోల్ వేరియంట్‌లో 1.2 లీటర్ NA పెట్రోల్ ఇంజిన్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. 82 bhp మరియు 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
Kia Sonet Facelift ఇక డీజిల్ వేరియంట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 114 bhp మరియు 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. బడ్జెట్ ధరలో చిన్న కారును కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ కారు బెస్ట్ ఆప్షన్.



Click it and Unblock the Notifications








