మరికొన్ని గంటల్లో Kia Sonet ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు ప్రారంభం.. ఏంటీ కారు ప్రత్యేకత?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తక్కువ సమయంలో భారత్‌లో ప్రసిద్ధ సంస్థగా పేరుగాంచింది. మెరుగైన డిజైన్, భద్రతా ఫీచర్ల కారణంగా తక్కువ కాలంలోనే ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించింది. తాజాగా కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఆవిష్కరించింది. బుకింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
అడ్వాన్స్ ఎంత చెల్లించాలి : డిసెంబర్ 20 అర్ధరాత్రి నుంచి కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఆసక్తిగల కస్టమర్‌లు కియా అధికారిక వెబ్‌సైట్ లేదా కియా డీలర్‌షిప్‌లను సందర్శించడం ద్వారా రూ.25 వేల నగదు చెల్లించడం ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ HTE, HTK, HTK+, HTX, HTX+, GTX మరియు X-లైన్ అనే 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీంతోపాటు 11 రంగుల ఎంపికల్లో అందించబడుతుంది. గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ, క్లియర్ వైట్, ప్యూటర్, ఆలివ్ సహా మరిన్ని రంగుల్లో అందుబాటులో ఉంది.
ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్లు, పనితీరు : కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. మరియు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.

డిజైన్‌లో కీలక మార్పులు! : కియా సోనెట్ పాత మోడల్ కంటే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అనేక డిజైన్ మార్పులను కలిగి ఉంది. LED హెడ్‌ల్యాంప్, టెయిల్‌లైట్, ఆకట్టుకొనే LED ఫాగ్‌లైట్లు, ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు వెనుకవైపు డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.
ఆకట్టుకొనేలా ఫీచర్లు : సోనెట్ కొత్త మోడల్ SUV ఆకర్షణీయమైన ఫీచర్లు సహా ఇంటీరియర్ కూడా ఆకట్టుకుంటుంది. కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్రైవ్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, OTA అప్‌డేట్, 7-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ADAS సహా 6 ఎయిర్‌బ్యాగ్‌లు : ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ భద్రత పరంగానూ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. ఈ కారు ధర మరికొన్ని రోజుల్లో వెల్లడి కానుంది. రేపు అర్ధరాత్రి నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానుండగా.. జనవరి 2024 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








