Kia Sonet కొత్త వేరియంట్.. బడ్జెట్‌ రేంజ్‌లో ప్రీమియం సౌకర్యాలు..!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా.. భారత్‌లో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. సాధారణంగా భారత్‌లో పండుగ సీజన్‌లో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు కియా సంస్థ సోనెట్‌ కొత్త వేరియంట్‌ను ప్రకటించింది.

కియా సోనెట్‌ స్మార్ట్‌స్ట్రీమ్‌ G1.2 HTK+ వేరియంట్‌ ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌తో అందించనున్నట్లు కియా ఇండియా సోమవారం ప్రకటన చేసింది. ఈ వేరియంట్‌ రూ.9.76 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్‌ ధరలో ప్రీమియం సౌకర్యాలు అందించడం ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవచ్చని సంస్థ భావిస్తోంది.

Kia sonet new variant launched with electric sunroof

కియా సోనెట్‌ స్మార్ట్‌స్ట్రీమ్‌ G1.2 HTK ఫ్లస్‌ వేరియంట్‌ 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ 81.8 bhp శక్తి, 115Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. కారు డ్యాష్‌బోర్డులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, వైర్‌లైస్‌ ఫోన్‌ ఛార్జర్‌, మెరుగైన స్పీకర్లు, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌తోపాటు ఆటోమేటిక్‌ ఎయిర్‌ కండిషనర్‌ ఉన్నాయి.

భారత్‌ మార్కెట్‌లోకి 2020 సంవత్సరంలో తొలిసారిగా సోనెట్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది. గత మూడేళ్లలో 3.3 లక్షల విక్రయాలను నమోదు చేసింది. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు వీలుగా 3 సంవత్సరాల ఉచిత మెయింటెనెన్స్‌, 5 సంవత్సరాల వారింటీ, జీరో డౌన్ పేమెంట్‌ వంటి ప్లాన్లను సంస్థ ప్రకటించింది.

Kia sonet new variant launched with electric sunroof

ఈ సంవత్సరం మార్చిలో కియా తన సోనెట్ SUV లైనప్‌ను BS6 ప్రమాణాలు మరియు E20 (20% ఇథనాల్‌, 80% పెట్రోల్‌) అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేసింది. అలాగే 1.5 లీటర్‌ WGT డీజిల్‌ ఇంజిన్‌ను 1.5 లీటర్‌ VGT డీజిల్‌ ఇంజిన్‌తో భర్తీ చేసింది. దీంతోపాటు కొత్త సోనెట్‌ మోడళ్లు ఐడిల్‌ స్టాప్‌/ స్టార్ట్‌ బటన్‌ను పొందుతాయి.

* ఈ సంవత్సరం జులైలో కియా ఫెస్‌లిఫ్టెడ్‌ సెల్టోస్‌ను విడుదల చేసింది. ఈ కొత్త సెల్టోస్‌ రూ.10.89 లక్షల నుంచి రూ.19.99 లక్షల (ఎక్స్‌షోరూం) ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ కారు 1.5 లీటర్‌ పెట్రోల్‌, 1.5 లీటర్‌ డీజిల్‌, 1.5 లీటర్‌ టర్బోఛార్జర్‌ పెట్రోల్‌ ఇంజిన్లను కలిగి ఉంటుంది. వేరియంట్లను బట్టి 17kmpl నుంచి 20.7 kmpl మైలేజీని ఇస్తుంది.

కియా సెల్టోస్‌ 2023 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 133bhp శక్తి, 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్‌, CVT గేర్‌బాక్స్‌ ఆప్షన్‌లలో లభిస్తుంది. 1.5 లీటర్‌ GDi టర్బో పెట్రోల్‌ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 158bhp శక్తి, 253Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

7 స్పీడ్‌ DCT గేర్‌బాక్స్‌, 6 స్పీడ్‌ క్లచ్‌లెస్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌లో అందుబాటులో ఉంటుంది. మరియు 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో 114bhp శక్తిని, 250Nm గరిష్ఠ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజిన్‌ను బట్టి MT,iMT, AT, IVT, DCT ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లలో అందుబాటులోకి వస్తుంది.

కియా సెల్టోస్‌ కొత్త కారు లోపలి భాగంలో టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ యానిట్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, కార్‌ టెక్‌కు సపోర్టు చేస్తుంది. కొత్త కియా సెల్టోస్‌లో డ్యూయల్‌ జోన్‌ ఆటోమేటిక్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థ, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 360 డిగ్రీల కెమెరా, LED హెడ్‌లైట్లు, బంపర్‌ డిజైన్‌కు ఆకట్టుకుంటుంది.

భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. EBDతో కూడిన ABS, బ్రేక్‌ అసిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ట్రాక్షన్ కంట్రోల్‌, హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌ మరియు హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లను కొత్త కియా సెల్టోజ్ కలిగి ఉంది. మరియు అత్యంత కీలక ఫీచర్‌ అయిన ADAS (అడ్వాన్సడ్ డ్రైవర్‌ అసెస్టెన్స్‌ సిస్టమ్‌ను) ను కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 29, 2023, 14:53 [IST]
English summary
Kia sonet new variant launched with electric sunroof and wireless charger at rs9 76 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+